logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల జిల్లా కోరుట్లలొ స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు వర్ధంతి సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం... స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి వేడుకలు రత్నాకర్ రావు కాస్య విగ్రహానికి పూలమాలలు చేసి నివాళులర్పించిన జువ్వాడి బ్రదర్స్... కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు... మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం... కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల వద్ద గల స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కాస్య విగ్రహం వద్ద స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి వేడుకలను కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వేలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు లు విచ్చేసి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తల తో కలిసి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కాస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కోరుట్ల నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు అని కొనియాడారు అనంతరం వారు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి తప్ప గడచిన 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు కోరుట్ల పట్టణ ఆటో చివరన (మెట్ పల్లి రోడ్డు) వెటర్నరీ కళాశాల ఇటు చివరన (జగిత్యాల రోడ్డు) పాలిటెక్నిక్ కళాశాల తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు అని ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కోరుట్ల పట్టణానికి సుమారు 4500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు తో మాదాపూర్ కాలనీ అర్బన్ కాలనీ ఏసుకొని గుట్ట అల్లమయ్య గుట్ట లాంటి కాలనీలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి రత్నాకర్ రావు అన్నారు గడచిన 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కేవలం కోరుట్ల పట్టణంలో 80 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రమే నిర్మించారని అవి కూడా వారికి అనుకూలంగా ఉన్నవారికి అప్పగించారే తప్ప అర్హులైన ఏ ఒక్కరికి కూడా అందించలేదన్నారు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 500 రూపాయలకె గ్యాస్ సిలిండర్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా పేద మధ్య తరగతి ప్రజలు కూడా కడుపునిండా తినాలని సంకల్పంతో రేషన్ దుకాణాల ద్వారా దేశంలో ఎక్కడా లేదు విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజల సహకారం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కోరుట్ల నియోజకవర్గానికి ఇప్పటివరకు 3500 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరిగిందని ప్రోసిడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టుకోవాలని ఇంటి నిర్మాణం ఏ విధంగా జరిగితే ఆ విధంగా ఆ ఇంటి యజమాని ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు కావున ప్రోసిడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టుకోవాలని అన్నారు అలాగే అనారోగ్య సమస్య వల్ల ఆస్పత్రిలో చేరి వైద్యం కోసం ఖర్చు చేసిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అధిక మొత్తంలో అందజేయడం జరుగుతుందన్నారు కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 7 కోట్ల పైచిలుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు ఆశయ సాధన కోసం ఆయన తనయులుగా మేము (జువ్వాడి బ్రదర్స్) అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వేలమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

5 hrs ago
user_అబ్దుల్ ముసవ్విర్
అబ్దుల్ ముసవ్విర్
కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
5 hrs ago
67b8294c-69ba-4ccd-9501-937e35d45f5b

జగిత్యాల జిల్లా కోరుట్లలొ స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు వర్ధంతి సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం... స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి వేడుకలు రత్నాకర్ రావు కాస్య విగ్రహానికి పూలమాలలు చేసి నివాళులర్పించిన జువ్వాడి బ్రదర్స్... కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు... మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం... కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల వద్ద గల స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కాస్య విగ్రహం వద్ద స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి వేడుకలను కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వేలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు లు విచ్చేసి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తల తో కలిసి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కాస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కోరుట్ల నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు అని కొనియాడారు అనంతరం వారు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి తప్ప గడచిన 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు కోరుట్ల పట్టణ ఆటో చివరన (మెట్ పల్లి రోడ్డు) వెటర్నరీ కళాశాల ఇటు చివరన (జగిత్యాల రోడ్డు) పాలిటెక్నిక్ కళాశాల తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు అని ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కోరుట్ల పట్టణానికి సుమారు 4500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు తో మాదాపూర్ కాలనీ అర్బన్ కాలనీ ఏసుకొని గుట్ట అల్లమయ్య గుట్ట లాంటి కాలనీలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి రత్నాకర్ రావు అన్నారు గడచిన 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కేవలం కోరుట్ల పట్టణంలో 80 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రమే నిర్మించారని అవి కూడా వారికి అనుకూలంగా ఉన్నవారికి అప్పగించారే తప్ప అర్హులైన ఏ ఒక్కరికి కూడా అందించలేదన్నారు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 500 రూపాయలకె గ్యాస్ సిలిండర్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా పేద మధ్య తరగతి ప్రజలు కూడా కడుపునిండా తినాలని సంకల్పంతో రేషన్ దుకాణాల ద్వారా దేశంలో ఎక్కడా లేదు విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజల సహకారం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కోరుట్ల నియోజకవర్గానికి ఇప్పటివరకు 3500 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరిగిందని ప్రోసిడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టుకోవాలని ఇంటి నిర్మాణం ఏ విధంగా జరిగితే ఆ విధంగా ఆ ఇంటి యజమాని ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు కావున ప్రోసిడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టుకోవాలని అన్నారు అలాగే అనారోగ్య సమస్య వల్ల ఆస్పత్రిలో చేరి వైద్యం కోసం ఖర్చు చేసిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అధిక మొత్తంలో అందజేయడం జరుగుతుందన్నారు కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 7 కోట్ల పైచిలుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు ఆశయ సాధన కోసం ఆయన తనయులుగా మేము (జువ్వాడి బ్రదర్స్) అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వేలమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు! ​ అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది! ​నెల గడిచినా కదలని కొనుగోళ్లు ​పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ​రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు ​ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. ​రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. ​ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు. ​మిత్తి భారంతో కుదేలు ​"అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి. ​ ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
    2
    జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు!
​ అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది!
​నెల గడిచినా కదలని కొనుగోళ్లు
​పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
​రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు
​ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు.
​రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు.
​ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు.
​మిత్తి భారంతో కుదేలు
​"అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి.
​
ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం... బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు.... ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు. రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ... నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు... జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి? వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు. మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి. గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి. తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి. దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
    1
    మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం...
బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు....

ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు.
రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ...
నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు...
జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి?
వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి...
నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా  ఇబ్బందులు పడుతున్నారని 
దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు.
మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు.
రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు.
వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి.
గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి.
తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి.
దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ  కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి  పిలుపునిచ్చారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు..... జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    1
    కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు.....
జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    1
    చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • మే 25,26న హైదారాబాద్ లో జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు మే 25,26వ తేదీలలో రెండు రోజుల పాటు హైదారాబాద్ లో జరిగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాకారులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. కళాకారులకు పల్లె నర్సింహ పాటలు పాడటం, డప్పు కొట్టడం శిక్షణ ఇచ్చారు.శిక్షణ ముగింపు సందర్భంగా పల్లె నర్సింహ మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది మేధావులు,రచయితలు,కవులు,కళాకారులు కలిసి ఇప్టా స్థాపించారని,కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక రచనలు చేస్తున్నారని,పాటలు వ్రాస్తున్నారన్నారు,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడుతుంటారని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి వారని,అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు వ్రాస్తూ,పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని నర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,జానపద,యక్షగాన,బుర్ర కథ,ఒగ్గు కథ, వీధి బాగోత కళారుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వం వారిని గుర్తించాలని,అన్ని రంగాల కళాకారులను గుర్తించినవారికి గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సింహ కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని,గాయకుడు నాయకుడు అవుతాడు. కానీ నాయకుడు గాయకుడు కావడం చాలా కష్టమన్నారు. ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కళాకారులగా తయారయ్యే వారికి తోడ్పాటు అందించడం కోసం సిపిఐ జిల్లా సమితి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, మాజీ జడ్పీటీసీ అందె స్వామి,ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి దుడ్డేల సమ్మయ్య,,ఉమ్మడి జిల్లా కళాకారులు లెనిన్,వరకోలు సదానందం,కోమల, సరిత,రమ, ఏ.రాజయ్య,విజయ్, తిరుపతి,లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు
    2
    మే 25,26న హైదారాబాద్ లో జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.
కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ.
ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు మే 25,26వ  తేదీలలో రెండు రోజుల పాటు హైదారాబాద్ లో జరిగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని  తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాకారులకు పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది.
కళాకారులకు పల్లె నర్సింహ పాటలు పాడటం, డప్పు కొట్టడం శిక్షణ ఇచ్చారు.శిక్షణ ముగింపు సందర్భంగా పల్లె నర్సింహ మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది మేధావులు,రచయితలు,కవులు,కళాకారులు కలిసి ఇప్టా స్థాపించారని,కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక రచనలు చేస్తున్నారని,పాటలు వ్రాస్తున్నారన్నారు,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడుతుంటారని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి వారని,అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు వ్రాస్తూ,పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని నర్సింహ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,జానపద,యక్షగాన,బుర్ర కథ,ఒగ్గు కథ, వీధి బాగోత కళారుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వం వారిని గుర్తించాలని,అన్ని రంగాల కళాకారులను గుర్తించినవారికి గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సింహ కోరారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని,గాయకుడు నాయకుడు అవుతాడు. కానీ నాయకుడు గాయకుడు కావడం చాలా కష్టమన్నారు.
ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా  కళాకారులు ఉండాల్సిందేనని, కళాకారులగా తయారయ్యే వారికి తోడ్పాటు అందించడం కోసం సిపిఐ జిల్లా సమితి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.
ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, మాజీ జడ్పీటీసీ అందె స్వామి,ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉమ్మడి కరీంనగర్  జిల్లా కార్యదర్శి దుడ్డేల సమ్మయ్య,,ఉమ్మడి జిల్లా కళాకారులు లెనిన్,వరకోలు సదానందం,కోమల, సరిత,రమ, ఏ.రాజయ్య,విజయ్, తిరుపతి,లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.
    1
    నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • జర్నలిస్ట్ జితేందర్ కవ్వాల్ గ్రామంలో వైభవంగా ఇందూర్ పోచమ్మ బోనాలు... మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఆదివారం ఇందూర్ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకలో గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ​ఘనంగా బోనాల ఊరేగింపు ​ఉదయం నుండే గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని మహిళలు నూతన వస్త్రాలు ధరించి, పసుపు కుంకుమలతో అలంకరించిన మట్టి కుండల్లో (బోనాలు) నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నారు. తలపై బోనాలను పెట్టుకుని, వేపాకులతో అలంకరించిన ఘటాలతో వీధుల గుండా ప్రదర్శనగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ​శివసత్తుల పూనకాలు - డప్పు చప్పుళ్లు ​ఈ వేడుకలో స్థానిక కళాకారుల డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల దరువులకు అనుగుణంగా యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా నృత్యం చేశారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. ​మొక్కులు తీర్చుకున్న భక్తులు ​ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
    1
    జర్నలిస్ట్ జితేందర్ కవ్వాల్ గ్రామంలో వైభవంగా ఇందూర్ పోచమ్మ బోనాలు...
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఆదివారం ఇందూర్ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకలో గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
​ఘనంగా బోనాల ఊరేగింపు
​ఉదయం నుండే గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని మహిళలు నూతన వస్త్రాలు ధరించి, పసుపు కుంకుమలతో అలంకరించిన మట్టి కుండల్లో (బోనాలు) నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నారు. తలపై బోనాలను పెట్టుకుని, వేపాకులతో అలంకరించిన ఘటాలతో వీధుల గుండా ప్రదర్శనగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
​శివసత్తుల పూనకాలు - డప్పు చప్పుళ్లు
​ఈ వేడుకలో స్థానిక కళాకారుల డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల దరువులకు అనుగుణంగా యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా నృత్యం చేశారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది.
​మొక్కులు తీర్చుకున్న భక్తులు
​ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.