Shuru
Apke Nagar Ki App…
కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు..... జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
P.G. Murthy
కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు..... జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు! అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది! నెల గడిచినా కదలని కొనుగోళ్లు పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు. మిత్తి భారంతో కుదేలు "అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.2
- కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు..... జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.1
- రాజీవ్ చౌరస్తా – అంబేడ్కర్ చౌరస్తాల్లో వాహనాల రద్దీ ➡️ ఆదివారం సాయంత్రం పీక్ అవర్స్‌లో రాజీవ్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాల వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. ➡️ రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ➡️ బస్సులు, ఆటోలు, బైకులు, కార్లు ఒకేసారి నిలిచిపోవడంతో రోడ్డు మొత్తం కిక్కిరిసిపోయింది. ➡️ అత్యవసర సేవల వాహనాలు కూడా ముందుకు కదలలేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. ➡️ ట్రాఫిక్ పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి, వాహనాలను మళ్లించి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ➡️ అధికారులు వాహనదారులు సహనం పాటించి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.1
- సికింద్రాబాద్‌లో బీజేపీ నాయకుల ర్యాలీ......................... హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక రైలులో చేరుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పరేడ్ గ్రౌండ్ సభాస్థలికి చేరుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.1
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.1
- స్వయం సేవక్‌గా, ఎబివిపి కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పార్టీ జెండాను కింద పడనివ్వను. ఎన్ని కష్టాలొచ్చినా తలెత్తుకునే పని చేస్తాను కానీ, తలవంచే పని చేయను. ఈ ధర్మయుద్ధంలో నా వెంటే ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.1
- మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం... బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు.... ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు. రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ... నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు... జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి? వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు. మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి. గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి. తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి. దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.1
- జర్నలిస్ట్ జితేందర్ కవ్వాల్ గ్రామంలో వైభవంగా ఇందూర్ పోచమ్మ బోనాలు... మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఆదివారం ఇందూర్ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకలో గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఘనంగా బోనాల ఊరేగింపు ఉదయం నుండే గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని మహిళలు నూతన వస్త్రాలు ధరించి, పసుపు కుంకుమలతో అలంకరించిన మట్టి కుండల్లో (బోనాలు) నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నారు. తలపై బోనాలను పెట్టుకుని, వేపాకులతో అలంకరించిన ఘటాలతో వీధుల గుండా ప్రదర్శనగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. శివసత్తుల పూనకాలు - డప్పు చప్పుళ్లు ఈ వేడుకలో స్థానిక కళాకారుల డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల దరువులకు అనుగుణంగా యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా నృత్యం చేశారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. మొక్కులు తీర్చుకున్న భక్తులు ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.1