కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల గృహ కల సాకారం – సుగుణక్క* ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలోని ఒకటవ వార్డు నంబర్‌లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన గృహానికి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. *ప్రెస్ రిలీజ్* *తేదీ: 17-04-2026* *🔹 ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్రే అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్‌లతో కలిసి నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.గృహ యజమానికి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.ప్రతి కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపాలంటే గృహం ఎంతో ముఖ్యమని,సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి అవసరాలను గుర్తించి ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పేదల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. *డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్*
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల గృహ కల సాకారం – సుగుణక్క* ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలోని ఒకటవ వార్డు నంబర్‌లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన గృహానికి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. *ప్రెస్ రిలీజ్* *తేదీ: 17-04-2026* *🔹 ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్రే అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్‌లతో కలిసి నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.గృహ యజమానికి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.ప్రతి కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపాలంటే గృహం ఎంతో ముఖ్యమని,సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి అవసరాలను గుర్తించి ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పేదల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. *డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్*
- *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 17 :- *ప్రమాదంలో గాయపడిన వారి ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి చేర్చిన ఒక లక్ష యాభై వేల వరకు నగదు రహిత చికిత్స.* *సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో స్వయంగా పాల్గొన్న జిల్లా ఎస్పి* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* “అరైవ్ అలైవ్” వారోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈరోజు స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి అధ్యక్షతన రిమ్స్ ఆసుపత్రి నిష్ణాతులైన అనస్తేషియా వైద్యులచే డయల్ 100, బ్లూ కోర్ట్, స్పెషల్ పార్టీ, ఏ ఆర్ సిబ్బందికి సిపిఆర్ (CPR) మరియు ఫస్ట్ ఎయిడ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాద సందర్భంలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలక భూమిక పోషిస్తుందని, గోల్డెన్ అవర్‌లోపు బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. సిపిఆర్ చేయడానికి ముందు బాధితుడు స్పృహలో ఉన్నాడో లేదో నిర్ధారించుకోవాలని, గుండె స్పందన ఆగిపోయిన సందర్భంలో మాత్రమే సిపిఆర్ నిర్వహించాలని సూచించారు. రోడ్డుపై జరిగిన ప్రమాదాలను గమనించిన వెంటనే స్పందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రహ-వీర్” పథకం ద్వారా నగదు బహుమతి లభిస్తుందని, అలాగే ప్రమాద బాధితులకు సమీప ఆసుపత్రిలో ₹1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణలో పాల్గొనడం జరిగింది. అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి శిక్షణను అందించి ప్రాణాపాయ సమయంలో రక్షించేలా సంసిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు, ఆర్ ఐ లు, రిజర్వ్ సిబ్బంది రిమ్స్ వైద్యులు అనస్థీషియా డా శ్యామ్ సుందర్, డా గంగాధర్, డా వివేక్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.4
- ఆదిలాబాద్ జిల్లా : ప్రజా పాలన ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఎస్టీయూ భవన్లో జరిగిన ప్రత్యేక మున్సిపల్ స్థాయి సమావేశంలో ప్రసంగించిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్1
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియ నేతకాని సామాజిక వర్గంలో పెను మంటలు రేపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన శక్తిగా ఉన్న నేతకానీలను జనాభా లెక్కల్లో విస్మరించడంపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వివక్షను నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం (TNMVS OUJAC) రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. "మా ఉనికిని తుడిచేస్తారా?" - ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిని ప్రసాద్ కులగణన నివేదికల్లో నేతకాని కులానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై ఓయూ వేదికగా జరిగిన సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు కుట్ర పూరిత వివక్ష: "తెలంగాణ గడ్డపై 12 లక్షల జనాభా కలిగిన మా సమాజాన్ని లెక్కల్లో చూపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, నేతకానీల గొంతు నొక్కే ప్రయత్నం." 40 నియోజకవర్గాల్లో పంజా: రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతకాని ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని, తమను తక్కువ అంచనా వేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. తొత్తుల పాలన: ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తూ, అత్యంత వెనుకబడిన నేతకానీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధం ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నేతకాని బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.1
- రోడ్డు నియమాలను అందరూ పాటించాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ అప్పాల జలపతి, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉన్నారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు1
- సిర్పూర్ (టి) మండల కేంద్రంలో నోయిడా కార్మికులపై లాఠీచార్జ్, అరెస్టులకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల అడ్డా వద్ద నిరసన జరిగింది. జిల్లా జాయింట్ సెక్రటరీ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ, కార్మికులు కనీస వేతనాలు, 8 గంటల పని దినం, కాంట్రాక్ట్ విధానం రద్దు వంటి డిమాండ్ల కోసం శాంతియుతంగా పోరాడుతుండగా అణచివేత చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. కార్మికుల సమస్యలను పక్కన పెట్టి నిర్బంధాలు, అరెస్టులు చేయడం తగదని, వెంటనే ఈ చర్యలు నిలిపి డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ సాధ్యతపై రక్షణ శాఖ, AAI మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో అధ్యయనం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ ఫీల్డ్ విజిట్‌ను ఏర్పాటు చేయడం ఆనందకరమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం, సంబంధిత కేంద్ర మంత్రులు మరియు తెలంగాణ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వస్తుందని ఎమ్మెల్యే గారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు4