చదరంగంతో ఏకగ్రత వ్యూహాత్మక ఆలోచనలకు పదును ఎన్ఎస్ఎస్ దినోత్సవంలో 42 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవంలో చెస్ పోటీలు చదరంగంతో ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచనకు పదును.. 42 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 తెలంగాణ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్–1 ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో చెస్ పోటీలను నిర్వహించారు. యువత సమగ్ర అభివృద్ధిలో క్రీడలు, ఆటల ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసానికి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా చదరంగం ద్వారా ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యం పెంపొందుతాయని తెలిపారు. ప్రత్యేక అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ. పున్నయ్య మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వం, క్రీడాస్ఫూర్తి పెంపొందుతాయని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పబ్లిక్ రిలేషన్స్ అధికారి డాక్టర్ కె.వి. రమణాచారి మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థుల్లో సేవాభావంతో పాటు నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు. క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి దోహదపడటంతో పాటు యువతలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చెస్ పోటీల్లో 42 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలను యూనివర్సిటీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్. నేత పర్యవేక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం. నర్సయ్య, డాక్టర్ స్వామి, విద్యార్థులు మనోహర్, రోహన్, చందు, పృథ్వి, మణికంఠ, శ్రావణి, వర్షిణి, త్రిష, సిద్ధార్థ, శశిక, కీర్తన తదితరులు పాల్గొన్నారు.

- సిరికొండలో తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ సిరికొండలో తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే సాయంత్రం ప్రతి ఇంటిలో ‘ఆశీర్వాద దీపం’ వెలిగించి ప్రధానికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో పాల్గొనాలని సిరికొండ మండల ప్రజలకు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుర్రం సంజీవరెడ్డి, నక్క రాజేశ్వర్, చింతకుంట రామస్వామి, తలకట్ల గంగారెడ్డి, ధర్పల్లి బాబురావు, చౌటుపల్లి ప్రభాకర్, లింబ గౌడ్, బందేల ధర్మపురి, రంజిత్ రెడ్డి, బచ్చు మారుతి, జంగం గంగాధర్, రాకేష్, దాసు, గ్యామా గంగాదాస్, దాసరి లింబాద్రి, సాయ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నిజామాబాద్‌లో అర్ధరాత్రి బుల్లెట్ బైక్ హల్‌చల్.. శబ్ద కాలుష్యానికి కారణమైన బైక్ సీజ్! నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ అధిక శబ్దంతో బుల్లెట్ బైక్ నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన బుల్లెట్ బైక్‌కు అధిక శబ్దం చేసే సైలెన్సర్‌ను అమర్చుకొని, అర్ధరాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని, పబ్లిక్ న్యూసెన్స్ మరియు శబ్ద కాలుష్యానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ స్పందిస్తూ, అధిక శబ్దం చేసే లేదా నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన సైలెన్సర్లను వాహనాలకు అమర్చుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చుకున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని కమిషనర్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వాహనాలు నడపాలని పోలీస్ శాఖ సూచించింది. శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టేందుకు నిజామాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.1
- బాసర మండల కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు..అధికారులు... నిర్మల్ జిల్లా // బాసర 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు : *తహసీల్దార్ పవన్ చంద్ర ఝకాటే...* 13 నెలల సాయుధ పోరాటం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేసిన రోజు : *ఎంపిడిఓ దేవేందర్* *ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు.. ప్రజా పాలన స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దాం. రాజ్యాంగ విలువలను కాపాడుదాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం. : *సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్* బాసర లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.. ఆయా ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు పాఠశాల ల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు.. నాయకులు...1
- ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం బాన్సువాడ, గురువారం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, వినాయకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. మండపం పరిసరాలు భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతూ, గణేశుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. గురువారం నాడు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నాగులగామ వందన గోపీనాథ్ గుప్త, రాహుల్ ఆటోమొబైల్, మోటమర్రి సంధ్యరాణి, నాగరాజు గుప్త, త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ వారి చేతుల మీదుగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ, ప్రతిరోజూ భక్తి భావంతో నిత్య అన్నదానాలు నిర్వహిస్తూ వినాయకుని కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. గణేశుని ఆటపాటలు, భజనలతో కాలనీ అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయిందని తెలిపారు.4
- విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలీ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ . తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒకరు ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండి, పొదుపును పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి ఒకరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు. కామారెడ్డి జిల్లాలోని దొంగలి మండల కేంద్రంలోని లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు.1
- నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. ........... నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యంమని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.1
- టేకు చెట్లు తొలగించిన కేసులు సర్పంచ్ భర్తకు జరిమానా.... టేకు చెట్లు తొలగించిన కేసులో సర్పంచ్ భర్తకు జరిమానా అనుమతి లేకుండా చెట్లు తొలగించారన్న ఫిర్యాదుపై అటవీశాఖ చర్యలు డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో ఘటన నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను అనుమతి లేకుండా తొలగించిన వ్యవహారంలో సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది? సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టిన సమయంలో గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య ఇంటి పక్కన ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు చెట్లను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర సమక్షంలో జేసీబీ సహాయంతో 12 టేకు చెట్లను తొలగించారని నర్సయ్య అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీఎఫ్‌వోకు ఫిర్యాదు ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లను తొలగించడంతో తీవ్రంగా నష్టపోయిన నర్సయ్య నేరుగా జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా చెట్లను తొలగించిన వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చెట్ల తొలగింపు వ్యవహారంపై వివరాలను సేకరించారు. రూ.13,325 జరిమానా అటవీశాఖ విచారణ అనంతరం అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను తొలగించిన వ్యవహారంలో మాసూరి ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధించినట్లు అధికారులు నిర్ణయించారు. అయితే చెట్ల తొలగింపు సమయంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర కూడా అక్కడ ఉన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, జరిమానా విషయంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడంపై నర్సయ్య సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని గ్రామస్థులు కోరుతున్నారు. అభివృద్ధి పనులైనా.. నిబంధనలు పాటించాల్సిందే అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో చెట్లు అడ్డుగా ఉన్నా సంబంధిత శాఖల నిబంధనలు, అనుమతులు పాటించాల్సిందేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పచ్చదనం పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులే చెట్ల తొలగింపు వ్యవహారంలో జరిమానా ఎదుర్కోవడం చర్చకు దారితీసిందన్నారు. అధికారిక అనుమతులు, నిబంధనలు పాటించకుండా చెట్లను తొలగిస్తే చర్యలు తప్పవనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.1