logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు : ప్రత్తిపాటి రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు : ప్రత్తిపాటి • గేదెలు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుంది • పశుపోషణకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి • మానుకొండవారిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి. ప్రభుత్వం అందించే ఉచిత పశువైద్యసేవలు, పశుపోషణ రాయితీలు, ప్రోత్సాహకాల్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మానుకొండవారిపాలెంలో పశుసంవర్థక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించి, రైతుల్ని, గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. పశువులకు గాలికుంటు, గొంతువాపు వ్యాధి టీకాలు, గొర్రెలకు నాచు, నీలినాలుక వ్యాధి టీకాలను పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఉచితంగా వేస్తోందన్నారు. నట్టల నివారణ మందులతో పాటు, పశువులను పరీక్షించి అవసరమైన అన్నిరకాల మందుల్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. గేదెలు, ఆవులు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం, స్వార్థ ప్రయోజనాలకోసం మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మరలా పంచాయతీలుగా పరిగణించబోతున్నామని ప్రత్తిపాటి చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కల్లి వీర రెడ్డి, పశు వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ, నాగేశ్వరరావు , దీప్తి, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

9 hrs ago
user_మీడియా ఇన్చార్జి
మీడియా ఇన్చార్జి
Animal Protection Organisation చిలకలూరిపేట హెచ్.ఓ. పురుషోత్తపట్నం, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago
d56c54d8-e108-4ed0-a14e-68fe8ecc4b78

రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు : ప్రత్తిపాటి రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు : ప్రత్తిపాటి • గేదెలు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుంది • పశుపోషణకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి • మానుకొండవారిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి. ప్రభుత్వం అందించే ఉచిత పశువైద్యసేవలు, పశుపోషణ రాయితీలు, ప్రోత్సాహకాల్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మానుకొండవారిపాలెంలో పశుసంవర్థక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించి, రైతుల్ని, గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. పశువులకు గాలికుంటు, గొంతువాపు వ్యాధి టీకాలు, గొర్రెలకు నాచు, నీలినాలుక వ్యాధి టీకాలను పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఉచితంగా వేస్తోందన్నారు. నట్టల నివారణ మందులతో పాటు, పశువులను పరీక్షించి అవసరమైన అన్నిరకాల మందుల్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. గేదెలు, ఆవులు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం, స్వార్థ ప్రయోజనాలకోసం మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మరలా పంచాయతీలుగా పరిగణించబోతున్నామని ప్రత్తిపాటి చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కల్లి వీర రెడ్డి, పశు వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ, నాగేశ్వరరావు , దీప్తి, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    1
    అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ
అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.
    1
    .  సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. 
మట్టా రాగమయి దయానంద్ 
ఎమ్మెల్యే, సత్తుపల్లి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • ఈరోజు నకిరేకల్ లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ & ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలేసి ఆశ వర్కర్లను మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడం స్పష్టమైన ద్రోహం. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచ్చి, రాష్ట్ర నాయకులు, ఆశ వర్కర్లను అరెస్టు చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, ఇది ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతు నొక్కే చర్య. ఈ విధానం నియంతృత్వ పాలనకు సంకేతం. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లను అనగదొక్కే ప్రయత్నం చేస్తే అది ప్రజల ఆగ్రహన్నీ రెచ్చగొట్టడమే. ప్రభుత్వం వెంటనే తన నిరంకుశ వైఖరిని విరమిచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతుందన్నారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో ఈరోజు BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు & ఆశా ల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక ఆధ్వర్యంలో BRTU అనుబంధ ఆశ వర్కర్లు నకిరేకల్ PHC వద్ద నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా చేసి నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఆశ వర్కర్ల డిమాండ్లు: 1. ఆశ వర్కర్లకు ఇచ్చిన 18000 ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి. 2. ప్రజాస్వామ్య పోరాటoను అణచివేయడం వెంటనే ఆపాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పోరాటం మరింత తీవ్రత దాలుస్తుందని అన్నారు .ఆశ వర్కర్లను తక్కువగా అంచనా వేయకండి. ఆశాల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చమని BRTU డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో SK సుల్తానా, కొండ అనసూర్య, A హైమావతి, M నీలావతి, M స్వప్న, V సుజాత, CH ఇందిర, P లలిత, P రేణుక, Y విజయలక్ష్మి, CH నాగమణి, B జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
    4
    ఈరోజు నకిరేకల్ లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల అక్రమ  అరెస్ట్ ను నిరసిస్తూ & ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలేసి ఆశ వర్కర్లను మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడం స్పష్టమైన ద్రోహం.  హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచ్చి, రాష్ట్ర నాయకులు, ఆశ వర్కర్లను అరెస్టు చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, ఇది ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతు నొక్కే చర్య. ఈ విధానం నియంతృత్వ పాలనకు సంకేతం. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లను అనగదొక్కే  ప్రయత్నం చేస్తే అది ప్రజల ఆగ్రహన్నీ రెచ్చగొట్టడమే. ప్రభుత్వం వెంటనే తన నిరంకుశ వైఖరిని విరమిచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతుందన్నారు.
ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో ఈరోజు BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు & ఆశా ల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక ఆధ్వర్యంలో BRTU అనుబంధ ఆశ వర్కర్లు నకిరేకల్ PHC వద్ద నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా చేసి నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. 
ఆశ వర్కర్ల డిమాండ్లు:
1. ఆశ వర్కర్లకు ఇచ్చిన 18000 ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి.
2.   ప్రజాస్వామ్య పోరాటoను అణచివేయడం వెంటనే ఆపాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పోరాటం మరింత తీవ్రత దాలుస్తుందని అన్నారు .ఆశ వర్కర్లను తక్కువగా అంచనా వేయకండి. ఆశాల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చమని BRTU డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో SK సుల్తానా, కొండ అనసూర్య, A హైమావతి, M నీలావతి, M స్వప్న, V సుజాత, CH ఇందిర, P లలిత, P రేణుక, Y విజయలక్ష్మి, CH నాగమణి, B జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    6 hrs ago
  • సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.
    2
    సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా  మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ 'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం - విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు. - కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌. - పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో 1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    4
    పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్  'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం
- విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు.
- కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌.
- పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 
రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. 
ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో  1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల  ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.