Shuru
Apke Nagar Ki App…
మాచారెడ్డి మండలం : భవానిపేటలో వార్డు సభ్యులకు అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట రైతు వేదికలో మంగళవారం రెండు రోజు వార్డు సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యతలు, విధులు గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం, గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై దర్శన్ అధికారులు సూచనలు చేశారు.
Narmala Swapna
మాచారెడ్డి మండలం : భవానిపేటలో వార్డు సభ్యులకు అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట రైతు వేదికలో మంగళవారం రెండు రోజు వార్డు సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యతలు, విధులు గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం, గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై దర్శన్ అధికారులు సూచనలు చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- కన్నుల పండుగగా రథోత్సవం వైభవంగా నిర్వహణ ఏడుపాయల వన దుర్గ మాత జాతర మహోత్సవ చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ప్రత్యేక పూజలు, హారతులు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి, ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.2
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1
- నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ రైతు వేదికలో ఫార్మర్ ఐడీ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అదే విధంగా పంట సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ కిష్టవ్వ దిల్ రాజ్, పులిగుండు సర్పంచ్ రామారావు, రైతులు పాల్గొన్నారు.1