logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి, ప్రభుత్వం నుండి అందే ప్రతి ఫలాన్ని వారికి అందజేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ఎమ్మెల్సీలు కోదండరాం సార్ మరియు అద్దంకి దయాకర్ అన్న ఈ అంశాన్ని పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన జర్నలిస్టుల పక్షాన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రం సిద్ధించే వరకు జరిగిన ప్రతి సంఘటనలోనూ, అన్ని సందర్భాల్లోనూ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని సిహెచ్ శ్రీనివాస్ గుర్తుచేశారు. అప్పటి పాలకపక్షాల, రాజకీయ పక్షాల ఒత్తిడిని తట్టుకొని తెలంగాణ ఉద్యమం ముందుకు సాగడానికి, తెలంగాణ కోసం పోరాడే శక్తులన్నీ ఒక్కతాటిపైకి రావడానికి జర్నలిస్టులు ఉద్యమకారులతో పోటీపడి కష్టపడ్డారని ఆయన తెలిపారు. సభలు, సమావేశాలు, వంటావార్పు, మానవహారం, రాస్తారోకోలు, నాఖాబందీలు, రైలురోకోలు, సకలజనుల సమ్మె, తెలంగాణ ధూంధాం, సాగరహారం వంటి ప్రతి ఉద్యమ కార్యక్రమంలోనూ జర్నలిస్టులు తమ వృత్తిధర్మానికి తోడుగా తెలంగాణ ఆకాంక్షతో పని చేశారని వివరించారు. ఉద్యమ పోరాటాన్ని పతాకస్థాయికి చేర్చిన మహబూబాబాద్ దాడి ఘటనలో జర్నలిస్టులు చూపిన తెగువ నాటి జేఏసీ చైర్మన్ కోదండరాం సార్, అద్దంకి దయాకర్ అన్నకు తెలియనిది కాదని సిహెచ్ శ్రీనివాస్ మరోసారి గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి ఖచ్చితంగా న్యాయం జరగాలని, అదే పద్ధతిలో తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్రం సాధించేంతవరకు అలుపెరగకుండా ఉద్యమం వెంట నడిచిన, కొన్ని సందర్భాల్లో యాజమాన్యాల ఒత్తిడిని కూడా తట్టుకుని నిలబడిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు అందే ఫలాలను, ఆనాటి ఉద్యమ కాలంలో పనిచేసిన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అందేలా చూడాల్సిన బాధ్యత పెద్దలు కోదండరాం సార్, అద్దంకి దయాకర్ అన్న తీసుకోవాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

18 hrs ago
user_CHALLA VENU
CHALLA VENU
కురవి, మహబూబాబాద్, తెలంగాణ•
18 hrs ago
c9b59499-0d8b-41d7-817a-960bd6ebbcf2

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి, ప్రభుత్వం నుండి అందే ప్రతి ఫలాన్ని వారికి అందజేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ఎమ్మెల్సీలు కోదండరాం సార్ మరియు అద్దంకి దయాకర్ అన్న ఈ అంశాన్ని పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన జర్నలిస్టుల పక్షాన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రం సిద్ధించే వరకు జరిగిన ప్రతి సంఘటనలోనూ, అన్ని సందర్భాల్లోనూ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని సిహెచ్ శ్రీనివాస్ గుర్తుచేశారు. అప్పటి పాలకపక్షాల, రాజకీయ పక్షాల ఒత్తిడిని తట్టుకొని తెలంగాణ ఉద్యమం ముందుకు సాగడానికి, తెలంగాణ కోసం పోరాడే శక్తులన్నీ ఒక్కతాటిపైకి రావడానికి జర్నలిస్టులు ఉద్యమకారులతో పోటీపడి కష్టపడ్డారని ఆయన తెలిపారు. సభలు, సమావేశాలు, వంటావార్పు, మానవహారం, రాస్తారోకోలు, నాఖాబందీలు, రైలురోకోలు, సకలజనుల సమ్మె, తెలంగాణ ధూంధాం, సాగరహారం వంటి ప్రతి ఉద్యమ కార్యక్రమంలోనూ జర్నలిస్టులు తమ వృత్తిధర్మానికి తోడుగా తెలంగాణ ఆకాంక్షతో పని చేశారని వివరించారు. ఉద్యమ పోరాటాన్ని పతాకస్థాయికి చేర్చిన మహబూబాబాద్ దాడి ఘటనలో జర్నలిస్టులు చూపిన తెగువ నాటి జేఏసీ చైర్మన్ కోదండరాం సార్, అద్దంకి దయాకర్ అన్నకు తెలియనిది కాదని సిహెచ్ శ్రీనివాస్ మరోసారి గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి ఖచ్చితంగా న్యాయం జరగాలని, అదే పద్ధతిలో తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్రం సాధించేంతవరకు అలుపెరగకుండా ఉద్యమం వెంట నడిచిన, కొన్ని సందర్భాల్లో యాజమాన్యాల ఒత్తిడిని కూడా తట్టుకుని నిలబడిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు అందే ఫలాలను, ఆనాటి ఉద్యమ కాలంలో పనిచేసిన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అందేలా చూడాల్సిన బాధ్యత పెద్దలు కోదండరాం సార్, అద్దంకి దయాకర్ అన్న తీసుకోవాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్, కౌన్సిలర్లు, క్లస్టర్ బాధ్యులు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, రాష్ట్ర ఏర్పాటు, దాని సజీవ నిలకడ కోసం జీవితకాలం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. జయశంకర్ గారి చరిత్రను నవతరం యువతరం ఎవరూ మరువలేరని ఆయన అన్నారు. ప్రజా పోరాటాలను శాంతియుతంగా, గాంధీ మార్గంలో కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిన జయశంకర్ గారి సందేశం వల్లనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభించి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా అద్భుతమైన పాలనను 10 సంవత్సరాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా, సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తక్కువ కాలంలో పునర్నిర్మించిన వ్యూహకర్త కేసీఆర్ గారికి సలహా సూచనలు ఇచ్చిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ గారికి దక్కుతుందన్నారు. జయశంకర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు కేసీఆర్ గారి పాలన చేసిన తర్వాత, మార్పులో భాగంగా కొత్త పాలన రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అభివృద్ధి పథంలో నచ్చిన తెలంగాణను మళ్లీ పునాదుల్లోనే అణిచివేసే కుట్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. కేసీఆర్ గారు ఆనాడు వ్యూహ రచన చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి, తక్కువ కాలంలో 90% తెలంగాణ పునర్నిర్మాణం సాధించారని గుర్తుచేస్తూ, కేసీఆర్ గారి వారసత్వాన్ని తుడిచిపెడతామంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆనవాళ్లను లేకుండా చేస్తామని చెప్పడమేనని తీవ్ర ఆరోపణ చేశారు.
    2
    నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్, కౌన్సిలర్లు, క్లస్టర్ బాధ్యులు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, రాష్ట్ర ఏర్పాటు, దాని సజీవ నిలకడ కోసం జీవితకాలం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. జయశంకర్ గారి చరిత్రను నవతరం యువతరం ఎవరూ మరువలేరని ఆయన అన్నారు. ప్రజా పోరాటాలను శాంతియుతంగా, గాంధీ మార్గంలో కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిన జయశంకర్ గారి సందేశం వల్లనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభించి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా అద్భుతమైన పాలనను 10 సంవత్సరాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా, సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తక్కువ కాలంలో పునర్నిర్మించిన వ్యూహకర్త కేసీఆర్ గారికి సలహా సూచనలు ఇచ్చిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ గారికి దక్కుతుందన్నారు.

జయశంకర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు కేసీఆర్ గారి పాలన చేసిన తర్వాత, మార్పులో భాగంగా కొత్త పాలన రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అభివృద్ధి పథంలో నచ్చిన తెలంగాణను మళ్లీ పునాదుల్లోనే అణిచివేసే కుట్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. కేసీఆర్ గారు ఆనాడు వ్యూహ రచన చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి, తక్కువ కాలంలో 90% తెలంగాణ పునర్నిర్మాణం సాధించారని గుర్తుచేస్తూ, కేసీఆర్ గారి వారసత్వాన్ని తుడిచిపెడతామంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆనవాళ్లను లేకుండా చేస్తామని చెప్పడమేనని తీవ్ర ఆరోపణ చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అది మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన ఒక ఉత్తమ జీవన విధానమని కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన యోగా దినోత్సవంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదని, మానసిక ప్రశాంతత మరియు క్రమశిక్షణతో కూడిన ఒక ఉన్నత జీవన మార్గమని కలెక్టర్ దివాకర మరోసారి నొక్కిచెప్పారు.
    1
    యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అది మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన ఒక ఉత్తమ జీవన విధానమని కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన యోగా దినోత్సవంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదని, మానసిక ప్రశాంతత మరియు క్రమశిక్షణతో కూడిన ఒక ఉన్నత జీవన మార్గమని కలెక్టర్ దివాకర మరోసారి నొక్కిచెప్పారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • వరంగల్ నగరంలోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో శనివారం 'నమో జెన్-Z కన్క్లేవ్' సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నవభారత నిర్మాణంలో యువత పాత్ర, దేశ ప్రగతిపై వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు నేటి 'జెన్-Z' యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించాయని వివరించారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను యువతకు తెలియజేసి, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను కావాలని దిశా నిర్దేశం చేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ముఖ్య అతిథులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేసిందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో యువత అంతా మోడీ గారి అభివృద్ధి విధానాలకు ఆకర్షితులవుతున్నారని, దేశ సరిహద్దుల రక్షణ నుండి అంతరిక్ష రంగం వరకు భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి యువత గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రత్నం సతీష్, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. శ్రవణ్, ప్రశాంత్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నర్సంపేట నియోజకవర్గ నాయకులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బీజేవైఎం శ్రేణులు నిరంతరం యువత సమస్యలపై పోరాడుతూనే, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    3
    వరంగల్ నగరంలోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో శనివారం 'నమో జెన్-Z కన్క్లేవ్' సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నవభారత నిర్మాణంలో యువత పాత్ర, దేశ ప్రగతిపై వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం.

ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు నేటి 'జెన్-Z' యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించాయని వివరించారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను యువతకు తెలియజేసి, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను కావాలని దిశా నిర్దేశం చేశారు.

దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ముఖ్య అతిథులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేసిందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో యువత అంతా మోడీ గారి అభివృద్ధి విధానాలకు ఆకర్షితులవుతున్నారని, దేశ సరిహద్దుల రక్షణ నుండి అంతరిక్ష రంగం వరకు భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి యువత గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రత్నం సతీష్, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. శ్రవణ్, ప్రశాంత్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నర్సంపేట నియోజకవర్గ నాయకులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బీజేవైఎం శ్రేణులు నిరంతరం యువత సమస్యలపై పోరాడుతూనే, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    user_Vinod Kumar paladugula
    Vinod Kumar paladugula
    Local News Reporter నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    19 hrs ago
  • అమెరికాలోని డల్లాస్ నగరంలోని ప్రిస్కోలో నూతనంగా ఏర్పాటు చేసిన PMJ జ్యువెలరీ షోరూమ్‌ను తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, PMJ జ్యువెలరీ సంస్థ నాణ్యత, విశ్వసనీయతతో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. భారతీయ వ్యాపార సంస్థలు విదేశాల్లో విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేయడం గర్వకారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు పాల్గొని షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    అమెరికాలోని డల్లాస్ నగరంలోని ప్రిస్కోలో నూతనంగా ఏర్పాటు చేసిన PMJ జ్యువెలరీ షోరూమ్‌ను తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, PMJ జ్యువెలరీ సంస్థ నాణ్యత, విశ్వసనీయతతో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. భారతీయ వ్యాపార సంస్థలు విదేశాల్లో విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేయడం గర్వకారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు పాల్గొని షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • సత్తుపల్లి సింగరేణిలోని జేవియర్ ఓసి కిష్టారంతో పాటు జిఎం కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం చింతల శ్రీనివాస్ గారు, ఎస్ ఓ టూ జిఎం శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, ఏరియా ఇంజనీర్ కె సోమశేఖర్ రావు గారు, జే వి ఆర్ ఓ సి ప్రాజెక్టు అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ గారు, జే వి ఆర్ సి హెచ్ పి ఇన్చార్జి శ్రీ సాయినాథ్ గారితో పాటు ఉద్యోగ కార్మికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    4
    సత్తుపల్లి సింగరేణిలోని జేవియర్ ఓసి కిష్టారంతో పాటు జిఎం కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం చింతల శ్రీనివాస్ గారు, ఎస్ ఓ టూ జిఎం శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, ఏరియా ఇంజనీర్ కె సోమశేఖర్ రావు గారు, జే వి ఆర్ ఓ సి ప్రాజెక్టు అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ గారు, జే వి ఆర్ సి హెచ్ పి ఇన్చార్జి శ్రీ సాయినాథ్ గారితో పాటు ఉద్యోగ కార్మికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట మండలంలోని గరుడాచలంలో, అలాగే రెడ్డి నాయక్ తండాలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. గరుడాచలంలోని శ్రీ వీర నరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రానికి DMF నిధుల ద్వారా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఘాట్ రోడ్డు పనులు ఇందులో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా, రెడ్డి నాయక్ తండాలో రూ.90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి ప్రతిపాదిత మార్గాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ అభివృద్ధి పనుల పరిశీలనలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో పాటు పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ మరియు స్థానిక నాయకులు ఉన్నారు. వీరందరితో కలిసి ఆయన జరుగుతున్న పనులను సమీక్షించారు.
    1
    ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట మండలంలోని గరుడాచలంలో, అలాగే రెడ్డి నాయక్ తండాలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. గరుడాచలంలోని శ్రీ వీర నరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రానికి DMF నిధుల ద్వారా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఘాట్ రోడ్డు పనులు ఇందులో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా, రెడ్డి నాయక్ తండాలో రూ.90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి ప్రతిపాదిత మార్గాన్ని కూడా ఆయన పరిశీలించారు.

ఈ అభివృద్ధి పనుల పరిశీలనలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో పాటు పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ మరియు స్థానిక నాయకులు ఉన్నారు. వీరందరితో కలిసి ఆయన జరుగుతున్న పనులను సమీక్షించారు.
    user_Kakaraparthi ramesh
    Kakaraparthi ramesh
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుబల్లి మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆయుష్ విభాగం మరియు హార్ట్ ఫుల్ వారి ఆధ్వర్యంలో యోగాసనాలు, యోగ ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ విన్యాసాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోమియో డాక్టర్ శ్రీనివాస్, యోగా మాస్టర్ సిహెచ్ రామకృష్ణ, లంక సాగర్ పీహెచ్‌సీ వైద్యులు కిరణ్ కుమార్, ఎంఈఓ మోహన్ రావు, వియం బంజర్ సర్పంచ్, గంగదేవి పాడు సర్పంచ్ మాలోత్ కృష్ణ, హార్ట్ ఫుల్ నెస్ నుండి రమణ, ఆశా వర్కర్లు, ఆయుష్ విభాగం నుండి సాధన చేస్తున్న యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
    4
    12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుబల్లి మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆయుష్ విభాగం మరియు హార్ట్ ఫుల్ వారి ఆధ్వర్యంలో యోగాసనాలు, యోగ ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ విన్యాసాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హోమియో డాక్టర్ శ్రీనివాస్, యోగా మాస్టర్ సిహెచ్ రామకృష్ణ, లంక సాగర్ పీహెచ్‌సీ వైద్యులు కిరణ్ కుమార్, ఎంఈఓ మోహన్ రావు, వియం బంజర్ సర్పంచ్, గంగదేవి పాడు సర్పంచ్ మాలోత్ కృష్ణ, హార్ట్ ఫుల్ నెస్ నుండి రమణ, ఆశా వర్కర్లు, ఆయుష్ విభాగం నుండి సాధన చేస్తున్న యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట సాయిబాబా గుడి సమీపంలో ఒక ఇసుక లారీ అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయి, తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని కాలు విరిగినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అశ్వాపురం పోలీసులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మరియు పోలీసుల సహాయంతో, గ్యాస్ కట్టర్‌ను తెప్పించి, కొన్ని ఇనుప రాడ్లను కత్తిరించి క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటికి తీశారు. అనంతరం, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవతో డ్రైవర్‌ను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా భద్రాచలం వైద్యులను ఆయన ఫోన్లో ఆదేశించారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట సాయిబాబా గుడి సమీపంలో ఒక ఇసుక లారీ అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయి, తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని కాలు విరిగినట్లు సమాచారం.

ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అశ్వాపురం పోలీసులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మరియు పోలీసుల సహాయంతో, గ్యాస్ కట్టర్‌ను తెప్పించి, కొన్ని ఇనుప రాడ్లను కత్తిరించి క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటికి తీశారు.

అనంతరం, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవతో డ్రైవర్‌ను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా భద్రాచలం వైద్యులను ఆయన ఫోన్లో ఆదేశించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.