వరంగల్ నగరంలోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో శనివారం 'నమో జెన్-Z కన్క్లేవ్' సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నవభారత నిర్మాణంలో యువత పాత్ర, దేశ ప్రగతిపై వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు నేటి 'జెన్-Z' యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించాయని వివరించారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను యువతకు తెలియజేసి, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను కావాలని దిశా నిర్దేశం చేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ముఖ్య అతిథులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేసిందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో యువత అంతా మోడీ గారి అభివృద్ధి విధానాలకు ఆకర్షితులవుతున్నారని, దేశ సరిహద్దుల రక్షణ నుండి అంతరిక్ష రంగం వరకు భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి యువత గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రత్నం సతీష్, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. శ్రవణ్, ప్రశాంత్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నర్సంపేట నియోజకవర్గ నాయకులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బీజేవైఎం శ్రేణులు నిరంతరం యువత సమస్యలపై పోరాడుతూనే, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
వరంగల్ నగరంలోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో శనివారం 'నమో జెన్-Z కన్క్లేవ్' సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నవభారత నిర్మాణంలో యువత పాత్ర, దేశ ప్రగతిపై వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని ప్రశంసించారు.
డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు నేటి 'జెన్-Z' యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించాయని వివరించారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను యువతకు తెలియజేసి, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను కావాలని దిశా నిర్దేశం చేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ముఖ్య అతిథులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేసిందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో యువత అంతా మోడీ గారి
అభివృద్ధి విధానాలకు ఆకర్షితులవుతున్నారని, దేశ సరిహద్దుల రక్షణ నుండి అంతరిక్ష రంగం వరకు భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి యువత గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రత్నం సతీష్, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. శ్రవణ్, ప్రశాంత్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నర్సంపేట నియోజకవర్గ నాయకులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బీజేవైఎం శ్రేణులు నిరంతరం యువత సమస్యలపై పోరాడుతూనే, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
- నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్, కౌన్సిలర్లు, క్లస్టర్ బాధ్యులు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, రాష్ట్ర ఏర్పాటు, దాని సజీవ నిలకడ కోసం జీవితకాలం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. జయశంకర్ గారి చరిత్రను నవతరం యువతరం ఎవరూ మరువలేరని ఆయన అన్నారు. ప్రజా పోరాటాలను శాంతియుతంగా, గాంధీ మార్గంలో కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిన జయశంకర్ గారి సందేశం వల్లనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభించి, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా అద్భుతమైన పాలనను 10 సంవత్సరాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా, సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తక్కువ కాలంలో పునర్నిర్మించిన వ్యూహకర్త కేసీఆర్ గారికి సలహా సూచనలు ఇచ్చిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ గారికి దక్కుతుందన్నారు. జయశంకర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు కేసీఆర్ గారి పాలన చేసిన తర్వాత, మార్పులో భాగంగా కొత్త పాలన రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అభివృద్ధి పథంలో నచ్చిన తెలంగాణను మళ్లీ పునాదుల్లోనే అణిచివేసే కుట్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. కేసీఆర్ గారు ఆనాడు వ్యూహ రచన చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి, తక్కువ కాలంలో 90% తెలంగాణ పునర్నిర్మాణం సాధించారని గుర్తుచేస్తూ, కేసీఆర్ గారి వారసత్వాన్ని తుడిచిపెడతామంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆనవాళ్లను లేకుండా చేస్తామని చెప్పడమేనని తీవ్ర ఆరోపణ చేశారు.2
- వరంగల్ నగరంలోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో శనివారం 'నమో జెన్-Z కన్క్లేవ్' సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నవభారత నిర్మాణంలో యువత పాత్ర, దేశ ప్రగతిపై వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు నేటి 'జెన్-Z' యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించాయని వివరించారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల కల్పనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను యువతకు తెలియజేసి, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను కావాలని దిశా నిర్దేశం చేశారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ముఖ్య అతిథులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేసిందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో యువత అంతా మోడీ గారి అభివృద్ధి విధానాలకు ఆకర్షితులవుతున్నారని, దేశ సరిహద్దుల రక్షణ నుండి అంతరిక్ష రంగం వరకు భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి యువత గర్విస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రత్నం సతీష్, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. శ్రవణ్, ప్రశాంత్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నర్సంపేట నియోజకవర్గ నాయకులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బీజేవైఎం శ్రేణులు నిరంతరం యువత సమస్యలపై పోరాడుతూనే, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.3
- జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడంతో పాటు బీఎన్ఏలకు శిక్షణ కార్యక్రమాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు కూడా ఆయన ఇవ్వనున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని మండల, క్లస్టర్ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.1
- మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ జిల్లాలోని బయ్యారం మండల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలతో స్వయంగా మాట్లాడారు, వారి సమస్యలను తెలుసుకున్నారు, అంతేకాకుండా ఉపాధ్యాయురాలిగా మారి స్వయంగా పాఠాలు కూడా బోధించారు. జిల్లాలో మొత్తం 1032 విద్యాసంస్థలు ఉన్నాయని, వాటిలో చదువుతున్న 1 లక్ష 90 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ పక్కాగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో డిజిటల్ తరగతుల ద్వారా విద్య బోధనలు అందించాలని, ప్రతి ఉపాధ్యాయుడు అందుకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పిల్లలను వ్యక్తిగతంగా గమనిస్తూ, విద్య అంశాలపై తల్లిదండ్రులతో చర్చించాలని పేర్కొన్నారు. 'బడిబాట' కార్యక్రమంలో ఇప్పటివరకు 6,709 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో అందిస్తున్న సౌకర్యాలపై విస్తృత ప్రచారం కల్పించి, నమోదు శాతం పెంచేందుకు అన్ని విద్యాసంస్థల సిబ్బంది కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరికీ టెస్ట్ బుక్కులు, నోట్ బుక్స్ అందించాలని, తెలుగుతో పాటు అన్ని సబ్జెక్టులలో, ముఖ్యంగా ఇంగ్లీషులో ప్రావీణ్యం పొందడం కోసం ఉపాధ్యాయులు ఇంగ్లీషులోనే విద్యను బోధించాలని, పిల్లలతో అదే భాషలో మాట్లాడాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పిల్లల విద్యాబోధనలు, ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహారం, ధ్యానం, క్రీడలు, మేధస్సును వెలికి తీసేలా ఉండాలని, విద్య అంశాలపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్న సిబ్బందికి, కిందిస్థాయి ఉద్యోగులకు కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వాటి నివేదికలను సమర్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు విద్యాసంస్థలలో పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. టాయిలెట్స్, డైనింగ్ హాల్, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించాలని, కోడిగుడ్లు, బాలామృతం వంటి పౌష్టికాహారం కలిగిన నాణ్యమైన పదార్థాలను అందించాలని కలెక్టర్ అన్నారు. అంగన్వాడి కేంద్రం పరిధిలో శ్యామ్ (SAM), మ్యామ్ (MAM) పిల్లలను నిరంతరం గమనిస్తూ, వారికి సమయానికి మందులు అందిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధనలను అందించాలని ఆమె పునరుద్ఘాటించారు.1
- జూన్ 21న తమిళనాడు రాష్ట్రంలో విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ మహాసంఘ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ డా. మద్దిశెట్టి సామేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో సుమారు 30 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు, ఆలయ పూజారులు, ధర్మకర్తలు మరియు హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభకు విచ్చేసిన డా. మద్దిశెట్టి సామేలుకు పూలమాలలు, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, మహంత్ ముకేశ్ నాథ్ జీ ఆదేశాల మేరకు, చిన్నదురై గారిని తమిళనాడు రాష్ట్ర విశ్వ హిందూ మహాసంఘ్ అధ్యక్షుడిగా ప్రకటించారు. అలాగే, డా. మద్దిశెట్టి సామేలు తమిళనాడులోని 30 గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.1
- వీణవంక మండలంలోని కోర్కల్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ నూతన చేనేత సంఘం అధ్యక్షుడిగా అడిగొప్పుల సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలుగా అడిగొప్పుల నిర్మల, కోశాధికారిగా బొద్ధుల భావనఋషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు కొత్త డైరెక్టర్ల కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి జిల్లా ఎన్నికల అధికారి పలుకల సురేందర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం, నూతనంగా ఎన్నికైన చేనేత సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సత్యనారాయణ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు మరియు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్కల్ చేనేత సహకార సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జక్కు అరుణ, దూడం సంజీవులు, మార్త అశోక్, సిరిపురం శంకరయ్య, సింగం కుమార స్వామి, సింగం రామస్వామిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.1
- ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామం ఎస్సీ కాలనీలోని రచ్చబండ వద్ద అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు గ్రహీత, వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్మ్ జన్మదినం సందర్భంగా ఒక మర్రి మొక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మర్రి మొక్కను నాటడం కేవలం ఒక సంబరం మాత్రమే కాదని, దానిని పోషించి పెంచే బాధ్యత తనదేనని ఉద్ఘాటించారు. గ్రామ ప్రజలకు, పక్షులకు, జంతువులకు మంచి వాతావరణాన్ని అందించడానికి, అలాగే ముందు తరాలకు ఉపయోగపడే మహావృక్షంగా ఇది ఎదగాలని భగవంతుని వేడుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.1