వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐 జోహార్ వైస్సార్
వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐 జోహార్ వైస్సార్
- దివంగత మహానేతవై.యస్.రాజశేఖర్ రెడ్డికి పాలాభిషేకం చేసిన అభిమానులు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం ఇబ్రహీంపట్టణం మండలం, కాచవరం గ్రామ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు,మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొని దివంగత మహానేతవై.యస్.రాజశేఖర్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. వై.యస్.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం జరిగింది.1
- ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 19వ డివిజన్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మినీ లారీ స్టాండ్ వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కిలారి రోశయ్య, మేకల రవీంద్ర, చందనపు నాగరాజు, సయ్యద్ షర్బుద్ధిన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- భరణిపాడులో యూరియా కోసం రైతుల ఆందోళన.. యాప్ బుకింగ్‌పై అధికారులను నిలదీత ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీకి వచ్చిన 20 టన్నుల యూరియా ఇతర గ్రామాల రైతులకు యాప్‌లో బుకింగ్ అయిందని.. తమ గ్రామ రైతులకు మాత్రం బుక్ కావడం లేదంటూ నిరసన చేపట్టారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం తెలియని రైతుల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. భరణిపాడు సొసైటీకి 20 టన్నుల యూరియా వచ్చినప్పటికీ.. యాప్‌లో తమ గ్రామ రైతులకు బుకింగ్ కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇతర గ్రామాల రైతులకు యూరియా బుకింగ్ అవుతున్నప్పుడు.. తమకు ఎందుకు బుక్ కావడం లేదంటూ అధికారులను ప్రశ్నించారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం రాని రైతుల పరిస్థితి ఏంటని అధికారిని నిలదీశారు.యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారి రైతులకు వివరించారు. మరో 20 టన్నుల యూరియాను తెప్పించి రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.1
- కృష్ణాజిల్లా పెడనలో ఘనంగా పవన్ కళ్యాణ్ 55వ పుట్టిన రోజు వేడుకలు ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ మాట్లాడుతూ మారుమూల, కొండల ప్రాంతాలలో రోడ్లు,మంచినీటి సదుపాయం కల్పించారని,పెడన నియోజకవర్గం లోనే 20 కోట్లు పైనే పంచాయతీ సీసీ రోడ్లు వేయించిన ఘనత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిదే అని తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ జెన్ జి అనే కార్యక్రమన్ని స్థాపించారాని తెలిపారు. యువత కోసం జై కొట్టు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది అని అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు అరవై వేలు సభ్యత్వాలు ఉన్నపటికీ, ఇప్పుడు ఇరవై ఒక్క లక్ష యాభై మూడు వేలు సభ్యత్వాలు ప్రాంతీయ పార్టీ కి విజయానికి నాంది అని, అలాగే రానున్న స్థానిక సంస్థ ల ఎన్నికలలో ఘన విజయం సాధించటానికి ప్రతి ఒక్క కార్యకర్త జై కొట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు.1
- 1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం:మాజీ MLA కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పాలేరు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలంటూ ఓట్ల నాటకాలాడారని మండిపడ్డారు. తన తుది శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే జీవిస్తానన్నారు. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చకపోతే పాలేరు గడ్డపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- పాలేరు లో కాంగ్రెస్1000 రోజుల వైఫల్య పాలన పై BRS పార్టీ ఏర్పాటు చేసిన సమరభేరీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు లో కాంగ్రెస్1000 రోజుల వైఫల్య పాలన పై BRS పార్టీ ఏర్పాటు చేసిన సమరభేరీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు.పాలేరు రిజర్వాయర్ లో నీళ్లను ఇక్కడ రైతులకు సాగు నీటి కోసం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.త్రాగునీటి కోసం మరోసారి సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని ఆయన అన్నారు.ఒక్క పంటకైనా నీరు ఇవ్వకుండా రైతులను అన్యాయం చేయొద్దన్నారు. పాలేరు ప్రజలు మరొకసారి మోసపోవద్దని ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేస్తానని ఆయన తెలిపారు1
- పాయకరావుపేటలో ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాయకరావు పేట క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు పోలవరం ఎడమ కాలువలోనే నిల్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేశారు.గోదావరి జలాలకు పుష్పాలు సమర్పించి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి, ఎంపీలు విజయ్, సీఎం రమేశ్ తదితరులు పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకుని అందరికీ చల్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు1
- *నరసరావుపేట లో లోకేష్ పర్యటన* SHOT News:నర్సరావుపేట రూరల్ ఉప్పలపాడుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టగా, అభిమానులు పూలవర్షం కురిపించారు.1
- ఖమ్మంలో బీఆర్ఎస్ ధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పువ్వాడ అజయ్ ఫైర్ ఖమ్మం జడ్పీ సెంటర్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే దగా, మోసం అని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ముందే కాంగ్రెస్ వస్తే మోసపోవడం ఖాయమని గతంలో చెప్పారని గుర్తుచేశారు. వాయిస్ ఓవర్: వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని.. రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేయకుండా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందని ఆరోపించిన పువ్వాడ.. కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఒక్క మంత్రిగా చేసిన పనులను ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉండి కూడా చేయలేకపోతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కనీస నిర్వహణపై కూడా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. అలాగే ఖమ్మం జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణలో రామరాజ్యం రావడం పక్కా అని పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జడ్పీ సెంటర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1