logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉప్పరపాలెం పంట పొలాల్లో8 మంది పేకాట రాయులు అరెస్టు. . యడ్లపాడు మండలంలోని ఉప్పరపాలెం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో జరుగుతున్న జూద కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందిన మేరకు ఎడ్లపాడు పోలీసులు దాడి నిర్వహించారు. దాడి సందర్భంగా జూదంలో పాల్గొంటున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం రూ.3,800/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

17 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
17 hrs ago
4ae7f0c3-f9b1-451f-a617-d5f41a34af7d

ఉప్పరపాలెం పంట పొలాల్లో8 మంది పేకాట రాయులు అరెస్టు. . యడ్లపాడు మండలంలోని ఉప్పరపాలెం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో జరుగుతున్న జూద కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందిన మేరకు ఎడ్లపాడు పోలీసులు దాడి నిర్వహించారు. దాడి సందర్భంగా జూదంలో పాల్గొంటున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం రూ.3,800/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు ​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: ​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. ​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. ​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. ​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ​పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు
​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం!
​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు:
​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు.
​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.
​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది"
​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
​పాల్గొన్న నాయకులు:
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
    1
    వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....
    1
    14 ఏప్రిల్ 2026:
శివకోడు...
డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన
చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన
ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన
విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా...
జైభీమ్.జయహోఅంభేథ్కర్....
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*
    1
    *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.*
:చిలకలూరిపేట::16-04-2026.*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    1
    ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • వరంగల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన మల్లిబల్లి రాముడు (55) రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో ఎడమ కాలి పాదం క్రష్ కాగా, కుడి భుజం విరిగింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలెట్ సాంబయ్య ప్రాథమిక చికిత్స అందించి గాయపడిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
    1
    వరంగల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన మల్లిబల్లి రాముడు (55) రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో ఎడమ కాలి పాదం క్రష్ కాగా, కుడి భుజం విరిగింది.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలెట్ సాంబయ్య ప్రాథమిక చికిత్స అందించి గాయపడిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    1
    ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.