Shuru
Apke Nagar Ki App…
ప్రయాణంలో ప్రమాదం.. రైలులో నుంచి జారి పడిన వ్యక్తి పరిస్థితి విషమం వరంగల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన మల్లిబల్లి రాముడు (55) రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో ఎడమ కాలి పాదం క్రష్ కాగా, కుడి భుజం విరిగింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలెట్ సాంబయ్య ప్రాథమిక చికిత్స అందించి గాయపడిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
M D Azizuddin
ప్రయాణంలో ప్రమాదం.. రైలులో నుంచి జారి పడిన వ్యక్తి పరిస్థితి విషమం వరంగల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన మల్లిబల్లి రాముడు (55) రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో ఎడమ కాలి పాదం క్రష్ కాగా, కుడి భుజం విరిగింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలెట్ సాంబయ్య ప్రాథమిక చికిత్స అందించి గాయపడిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో మిడతలు దండు కట్టాయి. గత రాత్రి భారీగా మిడతలు తరలిరావడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అరుదుగా కనిపించే మిడతలు ఒక్కసారి జనవాసాల్లోకి రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మిడతలతో పంటలకువ్యాధులను వ్యాపింపజేస్తుందని తెలియకపోయినప్పటికీ, ఆ కాటుల వలన దురద, చికాకు లేదా చిన్న, పైపైన గాయాలు ఏర్పడవచ్చు . వ్యవసాయ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నష్టం వాటిల్లుతుందనిశరైతులు ఆందోళన చెందుతున్నారు. మిడతల విజృంభణతో మనుషులకు సైతం ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడుతుఝదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండయాత్రలా తరలివచ్చిన మిడతలు అన్ని రకాల పంటలపై దాడి చేసి నాశనం చేస్తాయని, గుంపులుగా జీవించే మిడతలు తమకు ముప్పు ఉందని లేదా ఇరుక్కుపోయామని భావించినప్పుడు మరింత దూకుడుగా మారి, మనుషులు పశువుల పై దాడి చేస్తాయని భావిస్తున్నారు. హాని కలిగించే మిడతల నుంచి రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ...1
- Post by Solanke Ravi4
- నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- వరంగల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన మల్లిబల్లి రాముడు (55) రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో ఎడమ కాలి పాదం క్రష్ కాగా, కుడి భుజం విరిగింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలెట్ సాంబయ్య ప్రాథమిక చికిత్స అందించి గాయపడిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్‌లో మూడు రోజుల క్రితం వృద్ధురాలు కోన లక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి ఇంట్లో చోరీకి వెళ్లిన గడీల రాజు ను చూసి వృధ్ధురాలు అరవడంతో కత్తెరతో మెడలో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి సమక్షంలో అరెస్ట్ అయిన రాజును చూపించి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన రాజు డబ్బులు, బంగారం కోసం ఒంటరిగా ఉన్న లక్ష్మిని టార్గెట్ గా చేసుకుని నేరానికి పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. చోరీకి వెళ్ళిన రాజును చూసి వృద్ధురాలు అరవడంతో కత్తెరతో పొడిచేసాడని, స్థానికులు ఇచ్చిన క్లూతో విచారణ చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు. రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2000 నగదు, మృతురాలి చెవి కమ్మలు, దివ్యాంగుల సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బయోభారంతో ఉండే వృద్ధులను ఒంటరిగా వదిలిపెట్టవద్దని అలా వదిలిపెడితే వారి పిల్లలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని డిఎస్పి హెచ్చరించారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1