logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల జిల్లాలో దండు కట్టిన మిడతలు...కొండాపూర్ కు భారీగా తరలివచ్చిన మిడతలతో భయాందోళన చెందుతున్న గ్రామస్తులు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో మిడతలు దండు కట్టాయి. గత రాత్రి భారీగా మిడతలు తరలిరావడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అరుదుగా కనిపించే మిడతలు ఒక్కసారి జనవాసాల్లోకి రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మిడతలతో పంటలకువ్యాధులను వ్యాపింపజేస్తుందని తెలియకపోయినప్పటికీ, ఆ కాటుల వలన దురద, చికాకు లేదా చిన్న, పైపైన గాయాలు ఏర్పడవచ్చు . వ్యవసాయ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నష్టం వాటిల్లుతుందనిశరైతులు ఆందోళన చెందుతున్నారు. మిడతల విజృంభణతో మనుషులకు సైతం ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడుతుఝదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండయాత్రలా తరలివచ్చిన మిడతలు అన్ని రకాల పంటలపై దాడి చేసి నాశనం చేస్తాయని, గుంపులుగా జీవించే మిడతలు తమకు ముప్పు ఉందని లేదా ఇరుక్కుపోయామని భావించినప్పుడు మరింత దూకుడుగా మారి, మనుషులు పశువుల పై దాడి చేస్తాయని భావిస్తున్నారు. హాని కలిగించే మిడతల నుంచి రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ...

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

జగిత్యాల జిల్లాలో దండు కట్టిన మిడతలు...కొండాపూర్ కు భారీగా తరలివచ్చిన మిడతలతో భయాందోళన చెందుతున్న గ్రామస్తులు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో మిడతలు దండు కట్టాయి. గత రాత్రి భారీగా మిడతలు తరలిరావడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అరుదుగా కనిపించే మిడతలు ఒక్కసారి జనవాసాల్లోకి రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మిడతలతో పంటలకువ్యాధులను వ్యాపింపజేస్తుందని తెలియకపోయినప్పటికీ, ఆ కాటుల వలన దురద, చికాకు లేదా చిన్న, పైపైన గాయాలు ఏర్పడవచ్చు . వ్యవసాయ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నష్టం వాటిల్లుతుందనిశరైతులు ఆందోళన చెందుతున్నారు. మిడతల విజృంభణతో మనుషులకు సైతం ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడుతుఝదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండయాత్రలా తరలివచ్చిన మిడతలు అన్ని రకాల పంటలపై దాడి చేసి నాశనం చేస్తాయని, గుంపులుగా జీవించే మిడతలు తమకు ముప్పు ఉందని లేదా ఇరుక్కుపోయామని భావించినప్పుడు మరింత దూకుడుగా మారి, మనుషులు పశువుల పై దాడి చేస్తాయని భావిస్తున్నారు. హాని కలిగించే మిడతల నుంచి రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ...

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోసి పొలం నుండి వడ్లు జార గోడుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు క్రిందకు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ సీట్లో ఉన్న యువరైతు కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంట చేతికందిన సమయంలో సంతోషించాల్సిన రైతు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.‌
    2
    కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోసి పొలం నుండి వడ్లు జార గోడుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు క్రిందకు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ సీట్లో ఉన్న యువరైతు కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంట చేతికందిన సమయంలో సంతోషించాల్సిన రైతు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.‌
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 min ago
  • హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.
    1
    హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై  ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    20 hrs ago
  • బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు.
గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    20 hrs ago
  • Post by Solanke Ravi
    4
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Photographer నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
    1
    lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • Post by నీరటి మహేందర్
    1
    Post by నీరటి మహేందర్
    user_నీరటి మహేందర్
    నీరటి మహేందర్
    మద్దూర్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి  ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖ పై రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని కరీంనగర్లో చెప్పారు. అసెంబ్లీలో, పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అవకాశం తమకు లేదని డిజీపి స్పష్టం చేశారు. కరీంనగర్ లో పర్యటించిన డీజీపీ, అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొని పోలీసులకు నగర ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. సిపి గౌస్ ఆలం ఆద్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ లో మొక్కలు నాటారు. అరైవ్ అలైవ్ ప్రాధాన్యతను వివరిస్తూ జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించి బెలూన్ ఏగురేశారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలో 1 లక్షా 74 వేల మంది మృతి చెందారని, డిసెంబర్ నుంచి చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో గడిచిన మూడు మాసాల్లో 330 మృతి కేసులు తగ్గాయని చెప్పారు. అన్ని విభాగాల భాగస్వామ్యంతో క్షేత్ర స్థాయిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అవగాహన కార్యక్రమాల అనంతరం రోడ్ సేఫ్టీ పై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సామాజిక, ప్రజా సమస్యగా ఉన్న రోడ్ సేఫ్టీని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. గ్రామాల్లో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు చేపడుతామని చెప్పారు. రోడ్డు సేఫ్టీ పై ప్రత్యేకంగా మీడియా ప్రాధాన్యత ఇవ్వాలని డిజిపి శివధర్ రెడ్డి కోరారు.
    4
    పార్లమెంటులో  ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖ పై రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని కరీంనగర్లో చెప్పారు. అసెంబ్లీలో, పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అవకాశం తమకు లేదని డిజీపి స్పష్టం చేశారు. కరీంనగర్ లో పర్యటించిన డీజీపీ, అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొని పోలీసులకు నగర ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. సిపి గౌస్ ఆలం ఆద్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ లో మొక్కలు నాటారు. అరైవ్ అలైవ్ ప్రాధాన్యతను వివరిస్తూ జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించి బెలూన్ ఏగురేశారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలో 1 లక్షా 74 వేల మంది మృతి చెందారని, డిసెంబర్ నుంచి చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో గడిచిన మూడు మాసాల్లో 330 మృతి కేసులు తగ్గాయని చెప్పారు. అన్ని విభాగాల భాగస్వామ్యంతో క్షేత్ర స్థాయిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అవగాహన కార్యక్రమాల అనంతరం రోడ్ సేఫ్టీ పై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సామాజిక, ప్రజా సమస్యగా ఉన్న రోడ్ సేఫ్టీని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. గ్రామాల్లో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు చేపడుతామని చెప్పారు. రోడ్డు సేఫ్టీ పై ప్రత్యేకంగా మీడియా ప్రాధాన్యత ఇవ్వాలని డిజిపి శివధర్ రెడ్డి కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    26 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.