కేరళ స్కూల్‌లో ఘనంగా ఓనం వేడుకలు…ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ కేరళ స్కూల్‌లో ఓనం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు ఉంటాయని అన్నారు. కేరళకు ఎంతో ప్రత్యేకమైన ఓనం పండుగను మన ఖానాపూర్‌లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఓనం పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ పండుగ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ఓనం వేడుకలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా మరోసారి కేరళ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు ఖానాపూర్ ప్రజలకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కేరళ స్కూల్‌లో ఘనంగా ఓనం వేడుకలు…ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ కేరళ స్కూల్‌లో ఓనం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు ఉంటాయని అన్నారు. కేరళకు ఎంతో ప్రత్యేకమైన ఓనం పండుగను మన ఖానాపూర్‌లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఓనం పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ పండుగ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ఓనం వేడుకలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా మరోసారి కేరళ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు ఖానాపూర్ ప్రజలకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
- *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.1
- రామగుండం లో గుజరాత్.NIA తనిఖీలు., * పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రామగుండం సిపి కి వినతిపత్రం అందించిన విశ్వహింద్ పరిషత్ రామగుండం లో గుజరాత్ NIA తనిఖీల సంబంధించి రామగుండం పోలీసు కమీషనర్ కు వినతి పత్రం సమర్పించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు. నిన్ను రామగుండం అయోధ్య నగర్ లో ముజాహిల్ అనే విద్యార్థి నీ గుజరాత్ NIA వారు అతని ఇంటిని సోదాలు నిర్వహించి అతని ఫోన్. లాప్టాప్ తీసుకువెళ్ళి అతనిని NTPC పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది.. ఈ సందర్భంగా పరిషత్. విభాగ కార్యదర్శి. అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉగ్రవాద జడలు ఉన్నాయి.. అనేకమంది ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. అనేకసార్లు ఇక్కడ జాతీయ నిగూ సంస్థ ల తనిఖీలు జరిగాయి.. కావున పోలీసు వారు ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు... ఈ కార్యక్రమంలో. జిల్లా సహా కార్యదర్శి అడ్డిగొప్పుల రాజు. నగర్ కార్యదర్శి మునిగాల సంపత్. వెంకటస్వామి. లింగాన్న. రాజేశ్. తిరుపతి. మరియు బాధ్యులు పాల్గొన్నారు.....1
- ఎస్టీయూటీఎస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన 80 వసంతాల వైభవోత్సవం ఆదిలాబాద్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందం,ప్రధాన కార్యదర్శి జి.గజేందర్,ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాహెబ్ అలీ,జిల్లా అధ్యక్షుడు మురళీ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి జాధవ్ రవికుమార్,ఆర్థిక కార్యదర్శి బూత్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.1
- Kamaraddy distik banswada me miladun nabi juloos police bhari bandubast,1
- ఆదిలాబాద్ లో కురిసిన భారీ వర్షం.. రోడ్డు మార్గాలన్నీ జలమయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ జలమయంగా మారాయి. మార్కెట్ కు వచ్చిన ప్రజలు కాస్తంత ఇబ్బందులకు గురయ్యారు.1
- కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.3
- బొగ్గు గని కార్మికులకు 35% లాభాల వాటా, 25% ఇంటిరియం రిలీఫ్ చెల్లించాలి : HMS నేత రియాజ్ అహ్మద్ కోల్ ఇండియా యాజమాన్యం 12వ వేతన ఒప్పందం జరిగేంతవరకు ముందుగా దేశంలోని బొగ్గు గని కార్మికులకు 25% (ఐ. ఆర్) ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు బొగ్గు రంగ సంస్థల యాజమాన్యాల కు అనుకూలంగా వ్యవహరిస్తూ 12వ వేతన ఒప్పందం జరగకుండా నిర్లక్ష్యం వహిస్తుంది అందుకే వేతన ఒప్పందం విషయంలో లేబర్ కోడ్లను అడ్డుపెట్టుకొని దేశంలోని బొగ్గు రంగ సంస్థలలో ఎన్నికలు నిర్వహించి 51% మెజారిటీ ఓట్లు వచ్చిన సంఘంతోనే వేతన ఒప్పందాలు చేస్తామని కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతుంది. దీనికి కోల్ ఇండియా యాజమాన్యం JBCCI సంఘాలను పిలవకుండా 12 వ వేతన కమిటీ వేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని 12వ వేతన కమిటీ ఒప్పందం జరిగే వరకు బొగ్గు రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులందరికీ 25% ఇంటీరియర్ రిలీఫ్ చెల్లించాలని మరియు వేతన కమిటీని నియమించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డైరెక్టర్ పా స్పందించి గతంలో ఇచ్చిన మాదిరిగా వేతన ఒప్పందాలు జరిగేంతవరకు సింగరేణి కార్మికులకు 25% శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని ఒప్పందాలు జరిగిన తర్వాత పెరిగిన పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం: అంతేకాకుండా గత 2024 సంవత్సరంలో సింగరేణి సంస్థ అంతర్గతంగా ఉన్న భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇప్పటివరకు ఖాళీలను భర్తీ చేయలేదు. కాబట్టి సెక్యూరిటీ ఖాళీలతో పాటు అంతర్గత ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన సంబంధిత పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2025 -26 ఆర్థిక సంవత్సరములో సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాల నుండి కార్మికులకు 35% లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో తీవ్ర పోరాటాలు తప్పవని హెచ్చరించారు.1
- అయ్యప్ప ఆలయంలో ఓనం పూజలు.. పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : ఓనం పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లూరిలోని శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డిని సన్మానించారు. ఆలయంలో నిర్వహించిన పడిపూజలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులతో కలిసి శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..1
- ఆగస్టు 26, 2026_ఆదిలాబాదు: *అదిలాబాద్‌లో వైభవంగా ఓనం వేడుకలు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రిక ప్రకటన కేరళ తరహాలోనే బెల్లూరి అయ్యప్ప ఆలయం వద్ద ఓనం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాదు గ్రామీణ మండలం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతుందో, అదే రీతిలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ చరిత్ర కొనసాగుతోందని, దేశవ్యాప్తంగా ఓనం పండుగను జరుపుకున్నట్లే మన జిల్లాలో సైతం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది తాను ఓనం పండుగలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. భగవంతుని దర్శనం చేసుకుని, ఆశీస్సులు తీసుకుని జిల్లా అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, చదువులోనూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, భగవంతుడు అందరికీ శక్తినివ్వాలని కోరారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న పెండింగ్ పేమెంట్స్, బిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని, మరిన్ని వసతులు సమకూర్చుకుంటూ ఈసారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓనం పండుగను మరింత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి రమేష్, గురుస్వాములు గొర్ల కృష్ణ, చంద్ర గణేష్, తిప్పరి సత్యం, గాలి లక్ష్మి, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.1