logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

15న ఓయూలో మాల విద్యార్థుల,ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం ​ఉస్మానియా యూనివర్సిటీలో మార్చి 15న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" ​ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ (malaStudent JAC) మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను నేడు ఆవిష్కరించారు. ఓయూ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్‌లో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. ​ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ​కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ​ఐక్యత చాటడం రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి. ​అభివృద్ధి ప్రణాళికలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. ​రాజకీయ ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాట కార్యాచరణ. ​మేధో చర్చ మాల జాతి మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగుల అనుభవాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం. ​జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని" నిర్వాహకులు పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, అంసా ఓయూ ప్రెసిడెంట్ నామ సైదులు, ప్రొఫెసర్ సవీన్ సౌడా, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదయ్, సేపూరి ప్రణయ్, మోహన్ బట్టపోతుల, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ప్రెసిడెంట్ బత్తుల రమేష్, ఓయూ ప్రెసిడెంట్ దాసరి రవి, అరుణ్ నంద (ఓయూ), బత్తుల దిలీప్, అనీష్ వర్మ, పురమా మహేష్, అంజిబాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

on 11 March
user_Sagaboina Paparao
Sagaboina Paparao
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
on 11 March

15న ఓయూలో మాల విద్యార్థుల,ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం ​ఉస్మానియా యూనివర్సిటీలో మార్చి 15న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" ​ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ (malaStudent JAC) మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను నేడు ఆవిష్కరించారు. ఓయూ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్‌లో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. ​ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ​కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ​ఐక్యత చాటడం రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి. ​అభివృద్ధి ప్రణాళికలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. ​రాజకీయ ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాట కార్యాచరణ. ​మేధో చర్చ మాల జాతి మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగుల అనుభవాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం. ​జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని" నిర్వాహకులు పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, అంసా ఓయూ ప్రెసిడెంట్ నామ సైదులు, ప్రొఫెసర్ సవీన్ సౌడా, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదయ్, సేపూరి ప్రణయ్, మోహన్ బట్టపోతుల, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ప్రెసిడెంట్ బత్తుల రమేష్, ఓయూ ప్రెసిడెంట్ దాసరి రవి, అరుణ్ నంద (ఓయూ), బత్తుల దిలీప్, అనీష్ వర్మ, పురమా మహేష్, అంజిబాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    5
    ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా  నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల  సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి  మరియు ఎన్టీవీఎస్  ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • Post by Bandi renu
    1
    Post by Bandi renu
    user_Bandi renu
    Bandi renu
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.
    1
    కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    38 min ago
  • చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    1
    చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    12 hrs ago
  • ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
    4
    ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
    user_Meenakshi construction Civil c
    Meenakshi construction Civil c
    లింగాలఘన్‌పూర్, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.
    2
    అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా  ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో  అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను  గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.