Shuru
Apke Nagar Ki App…
శాయంపేట నకిలీ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి: ప్రజా సంఘాలు హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. శాయంపేట శివారులోని సర్వే నెంబర్లను తప్పుడు విధంగా మార్చి నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. బాధిత పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘీ ఎలేందర్, రోంటాల దేవా, యాకంబ్రచారి తదితరులు పాల్గొన్నారు.
M D Azizuddin
శాయంపేట నకిలీ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి: ప్రజా సంఘాలు హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. శాయంపేట శివారులోని సర్వే నెంబర్లను తప్పుడు విధంగా మార్చి నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. బాధిత పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘీ ఎలేందర్, రోంటాల దేవా, యాకంబ్రచారి తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ సుబేదారి క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 132 మంది లబ్ధిదారులకు రూ.1,34,15,544 విలువైన చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హతే ప్రమాణంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని తెలిపారు.2
- మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు... తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పోర్తి తో రాజకీయంగా ఎదగాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.నర్సంపేట పట్టణం లోని కంఠ మహేశ్వరుని ఆలయం ఆవరణలో వరంగల్ జిల్లాలో ఇటీవల నూతనం గా కౌన్సిలర్ లుగా ఎన్నికైన వేముల సంధ్య- సాంబయ్య గౌడ్, జూలూరి రోజా రాణి, దొమ్మటి రమ్య-సంతోష్ గౌడ్ లకు గౌడ కులస్తులకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదె బ్బ వరంగల్ జిల్లాకమిటీ,నర్సం పేట జిడబ్ల్యూఎస్, నర్సంపేట పట్టణ గౌడ సంఘాల నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్,గండి లింగయ్య గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, గోడిశాల సదానందం గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరి గింది. ఈ సంధర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మూడు దశబ్దాల క్రితమే సామాన్య గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 కోటలను జయించి గోల్కొండ కోట పరిపాలన చేసిన చక్రవర్తిగా పేరు గదించడం జరిగిందన్నారు.ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన రాజకీయంగా వెనుకబడి పోతున్నామన్నారు.గౌడ కులస్తులు ఐక్యతగా ఉండి అభివృద్ధి చెందా లని రమేష్ గౌడ్ తెలిపారు.అనంతరం నూతన గౌడ కౌన్సిలర్ కు శాలువ, షీల్డ్, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరాగాని సాంబయ్య గౌడ్, కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, తాళ్లపెల్లి చంద్ర మౌళి గౌడ్,జూలూరి మనీష్ గౌడ్, కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, మర్ద గణేష్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వేముల ఐలు సమ్మయ్య గౌడ్,నాగేల్లి సారంగం గౌడ్, గండి నర్సయ్య గౌడ్,నాతి సదానందం గౌడ్, గాదెగోని బాబు గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి కృష్ణ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, గండి రాము గౌడ్, బూర వేణు గౌడ్, వేముల కృష్ణ గౌడ్,తాబేటీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- మంగళవారం రోజు అర్ధరాత్రి నాయుడు పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు నుజులు అయింది కారు వెనుక ముందు నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం3
- వర్ధన్నపేట | వరంగల్ జిల్లా: ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.1
- ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో వరంగల్ కాజీపేట హనుమకొండలో భారీ శోభాయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సూర్య ప్రకాష్ రెడ్డి, వరంగల్ సంయోజాక్ చత్రపతి శివాజీ, రామ్ శర్మ, ప్రవీణ్ దాదా, సాగర్ పాల్గొన్నారు.1
- మహారాష్ట్ర | సాతారా జిల్లా: సాతారా జిల్లాలోని దేరే గ్రామానికి చెందిన భారత సైనికుడు ప్రమోద్ పరశురాం జాధవ్ విధి నిర్వహణలో అమరుడయ్యారు. ఆయన మృతి వార్త గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. హృదయాన్ని కలిచివేసే దృశ్యంలో… కేవలం 8 గంటల క్రితం జన్మించిన తమ నవజాత కుమార్తెతో కలిసి, ప్రసవం అనంతరం స్ట్రెచర్‌పైనే ఉన్న ఆయన భార్య, తన వీర భర్తకు చివరి వీడ్కోలు పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తించింది. సరిహద్దుల్లో దేశ శాంతి కోసం ప్రాణాలర్పించే జవానుల త్యాగానికి ఇది మరో ఉదాహరణ. వ్యక్తిగత ఆనందాలను పక్కనపెట్టి, కుటుంబాన్ని వదిలి, దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇచ్చే మన సైనికుల ధైర్యానికి ఈ ఘటన నిదర్శనం. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… “ఇది ప్రేమకథ కాదు – త్యాగగాథ. మనందరి శాంతికోసం తమ జీవితాలనే అర్పిస్తున్న జవానుల్ని మనం స్మరించుకోవాలి” అన్నారు. భారత సైన్యం మన గర్వం. మన రక్షణ కవచం. వీర అమర జవాన్ జాధవ్‌కు శతకోటి వందనాలు. వారి కుటుంబానికి దేశమంతా సెల్యూట్. 🙏🇮🇳1
- తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.1
- వరంగల్ గోపాలస్వామి ఆలయం సమీపంలోని త్రి శక్తి పీఠం దేవాలయాన్ని కూల్చివేయాలనే ప్రయత్నాల వెనుక కుట్ర దాగి ఉందని ఎంఎల్సీ బసవరాజు సారయ్య ఆరోపించారు. స్థానిక మద్యం వ్యాపారి, మాజీ ఎమ్మెల్యే, కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ దేవాలయాన్ని కూల్చడం సమర్థించబోమని, దేవాలయాలను కులాలకు అన్వయించడం తగదని తెలిపారు.1