Shuru
Apke Nagar Ki App…
జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నాకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Sraya
జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నాకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- సంగారెడ్డి జిల్లా పెద్దకంచెర్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకోగా, పలువురు విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థులు వెల్లడించారు. నిమజ్జనం సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం 6:30 ప్రాంతంలో జరిగిందని విద్యార్థులు తెలిపారు.1
- బీసీ రాజ్యాధికార ఉద్యమంపై తీన్మార్ మల్లన్న మనసులో మాట... *బీసీ రాజ్యాధికార యాత్ర*🚶♂️➡️ *సెప్టెంబర్ - 17*💥 *గోల్కొండ కోట - 8:00 AM*🚩 #bcrajyadhikarayathra #trp #teenmarmallanna #1yearfortrp1
- గిరిజన తండాల్లో బీరస్ పార్టీ పదార్థం ఆవిష్కరించి మాజీ సీఎం కేసీఆర్ పాలాభిషేకం చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి పిలుపు గిరిజనులకు4%రిజర్వేషన్లు 10 శాతానికి పెంచింది కేసీఆరే తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..సెప్టెంబర్ 17న ప్రతి తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలి.మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి..గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేస్తూ సెప్టెంబర్ 17న మెదక్ జిల్లాలో ప్రతి తండాలో కేసీఆర్‌కు క్షీరాభిషేకం నిర్వహించాలనిపిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గిరిజనుల స్వయం పాలన కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.గిరిజనుల విద్యా, సామాజిక అభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు.గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 10 శాతం రిజర్వేషన్ కారణంగా గిరిజన విద్యార్థులకు విద్యా రంగంలో ప్రయోజనం కలుగుతోందని, వైద్య విద్యలో ఏటా విద్యార్థులకు సీట్లు లభిస్తున్నాయని తెలిపారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం కోసం కేసీఆర్ చేసిన కృషిని గుర్తుచేసుకునేందుకే సెప్టెంబర్ 17న ప్రతి తండాలో క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకే సర్పంచులుగా అవకాశం కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తండాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. తండాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. రోడ్లు లేని పలు తండాలకు రహదారులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు.మెదక్ పట్టణంలో బంజారా భవన్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించామని గుర్తు చేశారు. నిధులు కూడా మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆరోపించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ హయాంలో తండాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ,ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదని, కాంగ్రెస్ నాయకుల పాలనగా మారిందని ఆరోపించారు. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గిరిజనుల హక్కులు, సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.అనంతరరం సుల్తాన్‌పూర్ తండా సర్పంచ్ రమేష్, గిరిజన నాయకులు శ్రీను నాయక్, రంజిత్ నాయక్, ధన్ సింగ్ లు మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పాలన కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందనిఅన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచి వారి హక్కులకు గుర్తింపు కల్పించారని తెలిపారు.కేసీఆర్ హయాంలో తండాలకు పంచాయతీ హోదా కల్పించడంతో పాటు రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన తండాల్లో సమస్యలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు.మెదక్ పట్టణంలో బంజారా భవన్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు రద్దు చేసిందని ఆరోపించారు.గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. తండాలకు గతంలో కల్పించిన మౌలిక వసతులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న మెదక్ జిల్లాలోని అన్ని తండాల్లో బిఆర్‌ఎస్ జెండాలు ఎగురవేసి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్,జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్ హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం అంజ గౌడ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా. నరేందర్, నాయకులు గడ్డమీద కృష్ణ గౌడ్,ప్రభు రెడ్డి,ఆర్కే శ్రీనివాస్,సాప సాయిలు, మార్గం. ఆంజనేయులు, శ్రీహరి, ప్రభాకర్, మంగ్యా,ఫుల్ సింగ్, ధన్ సింగ్,పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.1
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్‌పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్‌పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్‌పై కల్పిత వ్యాఖ్యలతో పుస్తకం రాశారంటూ ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు దాడిగా నరేశ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుమార్ ఆరోపించారు. ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, రచనలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, యువజన కార్యకర్తలు, స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.1
- మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే *బైపాస్ రోడ్డు ప్రయాణంలో ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ప్రయాణికులకు ప్రజలకు తెలుసు* .. *మా ఎమ్మెల్యే ఆరాటం HMDA నాన్స్ ప్రకారం బైపాస్ రోడ్డు విస్తీరణ ఉండాలి* ... *కూల్చాడు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే విడ్డూరంగా ఉంది...* *50 ఫీట్ల రోడ్డుతో ఎవ్వరికి ఉపయోగం...* *మాటలు నరకడం ఆపి రోడ్డు గుంతలను పూడ్చాలి...* *మీ ప్రయోజనాలకోసం ప్రజలను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు* .. *ముగ్గురు సీఎం లు మారిన రాజీవ్ పార్క్ ఎందుకు బాగు చేయలేదు... ?* సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి అని మాజీ సిడిసి చైర్మన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు విషయంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, రామప్ప, కౌన్సిలర్ లు పొన్న రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ మీడియా తో మాట్లాడారు.. వ్యక్తిగత విమర్శలు, అనవసర ఆరోపణలు కాకుండా సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడితే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సంగారెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాజీ ఎమ్మెల్యేకు తెలియవా? గుంతలు, ట్రాఫిక్ సమస్యలు, నెమ్మదిగా సాగుతున్న పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్. 50 అడుగుల రోడ్డుతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? లేక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల ఉన్న చోట 80. అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డును నిర్మించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలా? అనేది ప్రజలే ఆలోచించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలి. భవిష్యత్‌లో మళ్లీ రోడ్డు విస్తరణ అవసరం రాకుండా ఇప్పుడే సరైన ప్రణాళికతో పని పూర్తి చేయాలి. ఇక రోడ్డు పనుల నాణ్యతపై, పనులు ఎందుకు నెమ్మదిగా జరుగుతున్నాయి? గడువులోగా ఎందుకు పూర్తి చేయడం లేదు? ప్రజలకు వివరించాలి... మొన్న సీఎం వచ్చినపుడు ఐబీ ఆవరణలో రోడ్డు పనుల కోసం గోడలు కూల్చినప్పుడు, ఆగమేఘాల మీద పనులు చేపట్టినప్పుడు ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదా? ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే విమర్శలు చేయడం ఎందుకు? అభివృద్ధి కోసం అవసరమైన చోట రోడ్డు విస్తరణ, ప్రభుత్వ ఆస్తుల మార్పులు, నిర్మాణ పనులు చేపట్టాల్సి వస్తే వాటిని నిబంధనల ప్రకారం పూర్తి చేయడం ముఖ్యం. ఎన్నికల సమయంలో సంగారెడ్డి పట్టణంలోని ప్రతి వార్డుకు 8.కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? ఇటీవల ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చిన సమయంలో పట్టణానికి కొత్తగా ఎంత నిధులు మంజూరు చేశారు? ప్రజలకు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాజీవ్ పార్క్ అభివృద్ధి విషయంలో కూడా సంవత్సరాలుగా ముగ్గురు సీఎం లు మారిన ఒక పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇంత కాలం ఎందుకు పడుతోంది? గతంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కృషితో పట్టణ అభివృద్ధికి 50కోట్ల నిధులు తీసుకువచ్చి పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. సంగారెడ్డి ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు — అభివృద్ధి. మాటలు కాదు — పనులు. హామీలు కాదు — నిధులు. ప్రచారం కాదు — నాణ్యమైన రోడ్లు. రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రోడ్డు ఉన్న చోట 80 అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు కాదు… ప్రజలకు ఉపయోగపడే పనులపై చర్చ జరగాలి. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై అనవసర ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టాలి. సంగారెడ్డి ప్రజలు అమాయకులు కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి హయాంలో ఏ పని జరిగింది అన్నది ప్రజలకు తెలుసు. కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ లు ,లాడే మల్లేశం, నవీన్, సురేష్, కసిని శ్రీకాంత్, విఠల్, వజిత్ తదితరులు ఉన్నారు.4
- 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతి -ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరుతూ మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం1