logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గిరిజన తండాల్లో బీరస్ పార్టీ పదార్థం ఆవిష్కరించి మాజీ సీఎం కేసీఆర్ పాలాభిషేకం చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి పిలుపు గిరిజనులకు4%రిజర్వేషన్లు 10 శాతానికి పెంచింది కేసీఆరే తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..సెప్టెంబర్‌ 17న ప్రతి తండాలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలి.మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి..గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేస్తూ సెప్టెంబర్‌ 17న మెదక్ జిల్లాలో ప్రతి తండాలో కేసీఆర్‌కు క్షీరాభిషేకం నిర్వహించాలనిపిలుపునిచ్చారు. బుధవారం మెదక్‌ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో బిఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గిరిజనుల స్వయం పాలన కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు.గిరిజనుల విద్యా, సామాజిక అభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు.గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 10 శాతం రిజర్వేషన్‌ కారణంగా గిరిజన విద్యార్థులకు విద్యా రంగంలో ప్రయోజనం కలుగుతోందని, వైద్య విద్యలో ఏటా విద్యార్థులకు సీట్లు లభిస్తున్నాయని తెలిపారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం కోసం కేసీఆర్‌ చేసిన కృషిని గుర్తుచేసుకునేందుకే సెప్టెంబర్‌ 17న ప్రతి తండాలో క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకే సర్పంచులుగా అవకాశం కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తండాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. తండాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు, 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అందించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. రోడ్లు లేని పలు తండాలకు రహదారులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు.మెదక్‌ పట్టణంలో బంజారా భవన్‌ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించామని గుర్తు చేశారు. నిధులు కూడా మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆరోపించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నది కూడా కేసీఆర్‌ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్‌ హయాంలో తండాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ కేసీఆర్‌ పాలన రావాలని ,ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదని, కాంగ్రెస్‌ నాయకుల పాలనగా మారిందని ఆరోపించారు. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గిరిజనుల హక్కులు, సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.అనంతరరం సుల్తాన్‌పూర్‌ తండా సర్పంచ్‌ రమేష్‌, గిరిజన నాయకులు శ్రీను నాయక్, రంజిత్ నాయక్, ధన్ సింగ్ లు మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పాలన కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందనిఅన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచి వారి హక్కులకు గుర్తింపు కల్పించారని తెలిపారు.కేసీఆర్‌ హయాంలో తండాలకు పంచాయతీ హోదా కల్పించడంతో పాటు రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన తండాల్లో సమస్యలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు.మెదక్‌ పట్టణంలో బంజారా భవన్‌ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు రద్దు చేసిందని ఆరోపించారు.గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. తండాలకు గతంలో కల్పించిన మౌలిక వసతులను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 17న మెదక్‌ జిల్లాలోని అన్ని తండాల్లో బిఆర్‌ఎస్‌ జెండాలు ఎగురవేసి, కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్,జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్ హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం అంజ గౌడ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా. నరేందర్, నాయకులు గడ్డమీద కృష్ణ గౌడ్,ప్రభు రెడ్డి,ఆర్కే శ్రీనివాస్,సాప సాయిలు, మార్గం. ఆంజనేయులు, శ్రీహరి, ప్రభాకర్, మంగ్యా,ఫుల్ సింగ్, ధన్ సింగ్,పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•

More news from తెలంగాణ and nearby areas
  • నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.
    1
    నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం 
ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • శ్రీ ఏడుపాయల మనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల మనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని  బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలి. అందుకే ఆ త్యాగాల చరిత్ర ఎగ్జిబిషన్ ని ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. దేశమంతా మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఆగస్టు 15 సెప్టెంబర్ 1947 న ఎగరవేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ జెండా కోసం అనేకమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజున ఎగురవేసుకున్నాము. - ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. - అది కేవలం జెండా మాత్రమే కాదు, లక్షలాదిమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణ త్యాగాలు, కోట్లాదిమంది ప్రజల కష్టం. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎంతోమంది నేలకొరిగారు. - భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా కొట్లాడారు. - - నిజాం అరాచకాలపై దాశరథి గారి లాంటి వారు పాట రాసినా..యాదిగిరి లాంటివారు పాడినా.. పత్రికలో రాసినా జైల్లో పెట్టారు, హత్య చేసినట్టు చరిత్ర చెబుతుంది.
    1
    తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. 
త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ 
తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. 
త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. 
త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలి. 
అందుకే ఆ త్యాగాల చరిత్ర ఎగ్జిబిషన్ ని ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో దత్తాత్రేయ  చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. 
దేశమంతా మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఆగస్టు 15 సెప్టెంబర్ 1947 న ఎగరవేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ జెండా కోసం అనేకమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజున ఎగురవేసుకున్నాము. 
- ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. 
- అది కేవలం జెండా మాత్రమే కాదు, లక్షలాదిమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణ త్యాగాలు, కోట్లాదిమంది ప్రజల కష్టం. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎంతోమంది నేలకొరిగారు. 
- భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా కొట్లాడారు. 
- 
- నిజాం అరాచకాలపై దాశరథి గారి లాంటి వారు పాట రాసినా..యాదిగిరి లాంటివారు పాడినా.. పత్రికలో రాసినా జైల్లో పెట్టారు, హత్య చేసినట్టు  చరిత్ర చెబుతుంది.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    26 min ago
  • బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.
    1
    బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం
గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ /
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
    1
    బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం!
హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఈరోజు ప్రత్యేక అభిషేకం పూజలు మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయలవల దుర్గా భవాని మాత ఆలయంలో పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ పూజారులుమంజిరానది జలాలతో అభిషేకము పట్టు వస్తలంకరణ పుష్పాలంకరణ పసుపు కుంకుమ సుందరంగా అలంకరించారు కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి బోనాలు ఓడి బియ్యం తలనీలాల సమర్పిస్తున్నారు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఈరోజు ప్రత్యేక అభిషేకం పూజలు
మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయలవల దుర్గా భవాని మాత ఆలయంలో పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ పూజారులుమంజిరానది జలాలతో అభిషేకము పట్టు వస్తలంకరణ పుష్పాలంకరణ పసుపు కుంకుమ సుందరంగా అలంకరించారు కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి బోనాలు ఓడి బియ్యం తలనీలాల సమర్పిస్తున్నారు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    7 hrs ago
  • భజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద చిన్నారులు పెద్దలచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని బజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం సందర్బంగా చిన్నారులు, యువకులు, పెద్దలు కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగ వినాయకునికి ఆంజనేయ స్వామికి పూజలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.
    1
    భజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద చిన్నారులు పెద్దలచే హనుమాన్ చాలీసా పారాయణం 
ఎల్లారెడ్డి: పట్టణంలోని బజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం సందర్బంగా చిన్నారులు, యువకులు,  పెద్దలు కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగ వినాయకునికి ఆంజనేయ స్వామికి పూజలు చేసి హనుమాన్  చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్  ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన
పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    21 hrs ago
  • వెంకటరత్నాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బైకులను ధ్వంసం చేయడంతో గ్రామస్థుల్లో ఆందోళన తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బైకులను ధ్వంసం చేయడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. రత్నాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో గ్రామస్థులు తమ ద్విచక్ర వాహనాలను తూప్రాన్ వైపు రహదారి పక్కన పార్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడ నిలిపి ఉంచిన బైకులపై గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ బైక్ హ్యాండిల్ డోమ్‌ను ధ్వంసం చేయడంతో పాటు మరో ఐదు బైకుల్లో ఇసుక పోసి, వాటికి సంబంధించిన పైపులను తొలగించినట్లు పేర్కొన్నారు. ఉదయం బైకుల పరిస్థితిని గమనించిన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, బైకులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    1
    వెంకటరత్నాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బైకులను ధ్వంసం చేయడంతో గ్రామస్థుల్లో ఆందోళన
తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బైకులను ధ్వంసం చేయడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. రత్నాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో గ్రామస్థులు తమ ద్విచక్ర వాహనాలను తూప్రాన్ వైపు రహదారి పక్కన పార్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడ నిలిపి ఉంచిన బైకులపై గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ బైక్ హ్యాండిల్ డోమ్‌ను ధ్వంసం చేయడంతో పాటు మరో ఐదు బైకుల్లో ఇసుక పోసి, వాటికి సంబంధించిన పైపులను తొలగించినట్లు పేర్కొన్నారు. ఉదయం బైకుల పరిస్థితిని గమనించిన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, బైకులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.