తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలి. అందుకే ఆ త్యాగాల చరిత్ర ఎగ్జిబిషన్ ని ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. దేశమంతా మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఆగస్టు 15 సెప్టెంబర్ 1947 న ఎగరవేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ జెండా కోసం అనేకమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజున ఎగురవేసుకున్నాము. - ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. - అది కేవలం జెండా మాత్రమే కాదు, లక్షలాదిమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణ త్యాగాలు, కోట్లాదిమంది ప్రజల కష్టం. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎంతోమంది నేలకొరిగారు. - భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా కొట్లాడారు. - - నిజాం అరాచకాలపై దాశరథి గారి లాంటి వారు పాట రాసినా..యాదిగిరి లాంటివారు పాడినా.. పత్రికలో రాసినా జైల్లో పెట్టారు, హత్య చేసినట్టు చరిత్ర చెబుతుంది.

- సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం లభించలేదని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి అన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై విమోచనం పొందిందని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక చౌరస్తాలో బండ కార్తిక రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించే పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు3
- శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.1
- తెలంగాణ దొంగలు YouTube ఛానల్, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన BRSV కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీడియోలు ప్రచారం చేస్తున్నారని, ఆ ఛానల్లను బ్లాక్ చేసి వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు1
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు తమ వృత్తి, ఉపాధికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లా పెద్దకంచెర్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకోగా, పలువురు విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థులు వెల్లడించారు. నిమజ్జనం సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం 6:30 ప్రాంతంలో జరిగిందని విద్యార్థులు తెలిపారు.1