Shuru
Apke Nagar Ki App…
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
SREEYAN
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- జేఏసీ బలం ఇదే.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు........ . జేఏసీ ఐక్యత, పోరాటం వల్లే మన సమస్యలు రాజకీయ పార్టీల దృష్టికి వెళ్తున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. - జేఏసీ ఐక్యతే మన బలం. - ప్రతి రాజకీయ పార్టీ మన సమస్యలపై మాట్లాడాలి. - ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ జరగాలి. - ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలి. - న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. - ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతాం.1
- నాగసాన్‌పల్లి వద్ద తెగిపడిన 11 కేవీ వైరు తెగిపడటంతో అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది కౌడిపల్లి మండలం నాగసాన్‌పల్లి సమీపంలోని వరి పొలాల్లో 11 కేవీ విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తెగిపడింది. దీంతో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తెగిన వైర్‌కు మరమ్మతులు చేపట్టారు. సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం, ప్రమాదం చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరమ్మతులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అధికారుల సత్వర స్పందనపై రైతులు, స్థానిక గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.1
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.1
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- సంగారెడ్డి జిల్లా పెద్దకంచెర్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకోగా, పలువురు విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థులు వెల్లడించారు. నిమజ్జనం సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం 6:30 ప్రాంతంలో జరిగిందని విద్యార్థులు తెలిపారు.1