Shuru
Apke Nagar Ki App…
శ్రీకాకుళం నగరంలో ప్లే గ్రౌండ్ గా మారిన హెలి ప్యాడ్..! శ్రీకాకుళం నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాల కొరత ఉంది. ఈ కారణంగా విద్యార్థులు ఖాళీ స్థలాలు పార్కుల్ని క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నారు.అవీ చాలక ఇప్పుడు నగరంలోని డచ్ బంగ్లా సమీపంలో ఉన్న హెలిప్యాడ్ ని సైతం క్రీడామైదానంగా తయారు చేసారు. భద్రతాపరమైన ప్రోటోకాల్ హెలి ప్యాడ్ సమీపంలో అమలులో ఉంటుంది. అయినా సంబంధిత అధికారులు గాని, క్రీడాకారులు గాని ఎవరూ పట్టించుకోవటం లేదు. నగరంలో మరిన్ని ఆట స్థలాలను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.
Venkata Ramana Murthy K
శ్రీకాకుళం నగరంలో ప్లే గ్రౌండ్ గా మారిన హెలి ప్యాడ్..! శ్రీకాకుళం నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాల కొరత ఉంది. ఈ కారణంగా విద్యార్థులు ఖాళీ స్థలాలు పార్కుల్ని క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నారు.అవీ చాలక ఇప్పుడు నగరంలోని డచ్ బంగ్లా సమీపంలో ఉన్న హెలిప్యాడ్ ని సైతం క్రీడామైదానంగా తయారు చేసారు. భద్రతాపరమైన ప్రోటోకాల్ హెలి ప్యాడ్ సమీపంలో అమలులో ఉంటుంది. అయినా సంబంధిత అధికారులు గాని, క్రీడాకారులు గాని ఎవరూ పట్టించుకోవటం లేదు. నగరంలో మరిన్ని ఆట స్థలాలను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం నగరంలో ప్లే గ్రౌండ్ గా మారిన హెలి ప్యాడ్..! శ్రీకాకుళం నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాల కొరత ఉంది. ఈ కారణంగా విద్యార్థులు ఖాళీ స్థలాలు పార్కుల్ని క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నారు.అవీ చాలక ఇప్పుడు నగరంలోని డచ్ బంగ్లా సమీపంలో ఉన్న హెలిప్యాడ్ ని సైతం క్రీడామైదానంగా తయారు చేసారు. భద్రతాపరమైన ప్రోటోకాల్ హెలి ప్యాడ్ సమీపంలో అమలులో ఉంటుంది. అయినా సంబంధిత అధికారులు గాని, క్రీడాకారులు గాని ఎవరూ పట్టించుకోవటం లేదు. నగరంలో మరిన్ని ఆట స్థలాలను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు.1
- రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.2
- రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.1
- రాజాం హాస్టల్ విద్యార్థినులతో రోడ్లపై డాన్సులు, చేయించిన వార్డెన్ రమాదేవి. రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.1
- డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.1
- శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి..... సాలి హుండాం బౌద్ధారామం గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.1