Shuru
Apke Nagar Ki App…
మండల రెవిన్యూకార్యాలయం వద్దడిమాండ్ల సాధనకు వీఆర్ఏల నిరసన దీక్ష డిమాండ్ల సాధనకు వీఆర్ఏల నిరసన దీక్ష మొగల్తూరు, సెప్టెంబర్ 16 న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం బుధవారం నుంచి నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు
నాగిడి దుర్గా నాగేశ్వరరావు
మండల రెవిన్యూకార్యాలయం వద్దడిమాండ్ల సాధనకు వీఆర్ఏల నిరసన దీక్ష డిమాండ్ల సాధనకు వీఆర్ఏల నిరసన దీక్ష మొగల్తూరు, సెప్టెంబర్ 16 న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం బుధవారం నుంచి నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పెనుగొండలో వీఆర్ఏల కదంతొక్కిన ర్యాలీ డిమాండ్ల పరిష్కారానికి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (VRA JAC) పిలుపు మేరకు వీఆర్ఏలు రెండో రోజు గురువారం పెనుగొండలో ర్యాలీ నిర్వహించారు. నరసాపురం డివిజన్ వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు వెన్నుదన్నుగా పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్‌ఓ, అటెండర్, నైట్‌వాచ్‌మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని నాగరాజు కోరారు. ర్యాలీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.1
- దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ , ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, బిజెపి ఇన్చార్జ్, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయిన నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోది అన్నారు. అటువంటి వ్యక్తి బాగుండాలని భారతీయులందరూ బాగుంటారని పేర్కొన్నారు మన దేశాన్ని మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు వికసిప్ భారత్ సంకల్పంలో భాగంగా 2047వ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని భారతీయులందరూ సంపన్నులు అవ్వాలని ఆలోచించి దేశం కోసం నిరంతరం శ్రమిస్తు ,కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.2
- *మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్స్‌పై విద్యార్థులకు అవగాహన* అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థినీ విద్యార్థులకు మత్తు పదార్థాలు, గంజాయి, సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి అమలాపురం డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది, పోలీస్ ఈగల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నెట్ మార్కెటింగ్, ఫేక్ యాప్స్, ఓటీపీ మోసాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, NDPS చట్టం, ఆపరేషన్ గరుడ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే డి-అడిక్షన్ సెంటర్ అందించే చికిత్స, కౌన్సెలింగ్ మరియు ఇతర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనుబాబు, పీర్ ఎడ్యుకేటర్ లలిత, పోలీస్ ఈగల్ విభాగం సిబ్బంది రఘు , సత్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.1
- జనగామ జిల్లాలో రేషన్ డీలర్ ఉద్యోగాలు 👌టెన్త్ పాస్ చాలు, apply చేయండి. #telangana #rationdealer #job1
- సేవా కార్యక్రమాలతో మోదీ జన్మదిన వేడుకలు.. సీఎండీ లేఅవుట్‌లో కంబాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం1
- సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడు, సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడుకి మహిళలు పూజా కార్యక్రమం చేసి పిల్లలచే ఆటపాటలు చేయించుచున్న కమిటీ వారికి ధన్యవాదాలు.2
- కాలువ పక్కన చెత్తకు నిప్పు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం మారెమ్మగూడెంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ఎదురుగా రోడ్డు పక్కన చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకుల పాఠశాల నుంచి వెలువడే ప్లాస్టిక్, ఆహార ప్యాకెట్ల వ్యర్థాలను పెద్ద కాలువ పక్కనే పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్తను సక్రమంగా సేకరించకుండా పారిశుద్ధ్య కార్మికులు అక్కడే నిప్పంటించడంతో ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వెలువడే పొగతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.చెత్త దహనం కారణంగా వచ్చే పొగ, దుర్వాసనతో సమీప నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు సైతం పొగ, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెద్ద కాలువ పక్కన చెత్తను విచ్చలవిడిగా వేయడం వల్ల కాలువలోకి వ్యర్థాలు చేరి నీటి కాలుష్యానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇకనైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాలువ పక్కన చెత్త వేయకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేయడంతో పాటు గురుకుల పాఠశాల నుంచి వెలువడే వ్యర్థాలను నిబంధనల ప్రకారం సేకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి, ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పుపెట్టకుండా పారిశుద్ధ్య కార్మికులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కాలువ పరిసరాలను పరిశీలించి వ్యర్థాల తొలగింపునకు చర్యలు చేపట్టాలని, పంచాయతీ అధికారులు నిరంతర పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, కాలువ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేశారు1
- మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సిట్ అధికారులు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకోచ్చారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు.పీటీ వారెంట్‌పై కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు.మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు.1