Shuru
Apke Nagar Ki App…
జనగామ జిల్లాలో రేషన్ డీలర్ ఉద్యోగాలు 👌టెన్త్ పాస్ చాలు, apply చేయండి. #telangana #rationdealer #job
Chandraiah Pochampally
జనగామ జిల్లాలో రేషన్ డీలర్ ఉద్యోగాలు 👌టెన్త్ పాస్ చాలు, apply చేయండి. #telangana #rationdealer #job
More news from East Godavari and nearby areas
- జనగామ జిల్లాలో రేషన్ డీలర్ ఉద్యోగాలు 👌టెన్త్ పాస్ చాలు, apply చేయండి. #telangana #rationdealer #job1
- సేవా కార్యక్రమాలతో మోదీ జన్మదిన వేడుకలు.. సీఎండీ లేఅవుట్‌లో కంబాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం1
- దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ , ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, బిజెపి ఇన్చార్జ్, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయిన నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోది అన్నారు. అటువంటి వ్యక్తి బాగుండాలని భారతీయులందరూ బాగుంటారని పేర్కొన్నారు మన దేశాన్ని మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు వికసిప్ భారత్ సంకల్పంలో భాగంగా 2047వ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని భారతీయులందరూ సంపన్నులు అవ్వాలని ఆలోచించి దేశం కోసం నిరంతరం శ్రమిస్తు ,కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.2
- పెనుగొండలో వీఆర్ఏల కదంతొక్కిన ర్యాలీ డిమాండ్ల పరిష్కారానికి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (VRA JAC) పిలుపు మేరకు వీఆర్ఏలు రెండో రోజు గురువారం పెనుగొండలో ర్యాలీ నిర్వహించారు. నరసాపురం డివిజన్ వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు వెన్నుదన్నుగా పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్‌ఓ, అటెండర్, నైట్‌వాచ్‌మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని నాగరాజు కోరారు. ర్యాలీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.1
- *మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్స్‌పై విద్యార్థులకు అవగాహన* అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థినీ విద్యార్థులకు మత్తు పదార్థాలు, గంజాయి, సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి అమలాపురం డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది, పోలీస్ ఈగల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నెట్ మార్కెటింగ్, ఫేక్ యాప్స్, ఓటీపీ మోసాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, NDPS చట్టం, ఆపరేషన్ గరుడ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే డి-అడిక్షన్ సెంటర్ అందించే చికిత్స, కౌన్సెలింగ్ మరియు ఇతర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనుబాబు, పీర్ ఎడ్యుకేటర్ లలిత, పోలీస్ ఈగల్ విభాగం సిబ్బంది రఘు , సత్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.1
- అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి వేడుకలు టిడిపి నాయకురాలు జ్యోతుల లక్ష్మి దేవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కాకినాడ జిల్లా .జగ్గంపేట నియోజకవర్గం. జగ్గంపేట మండలం: ఇర్రిపాక .గణేష్ నవరాత్రుల సందర్భంగా టిడిపి మహిళా నాయకురాలు, జగ్గంపేట శాసనసభ్యులు,టీటీడీ బోర్డు నెంబర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ కోడలు, కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో వారి స్వగృహం నందు విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది జరిపే ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపంను నిర్మించి వినాయకుడికి విశేష పూజలు అందిస్తున్నారు. బుధవారం నాడు నవీన్ లక్ష్మీదేవి దంపతులు నిర్వహించారు. జగ్గంపేట మండలం కాట్రాలపల్లి వారిచే కోలాటం, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యం భక్తి పారవశంతో పూజలు నిర్వహించడంతో స్థానిక భక్తులు, జగ్గంపేట నియోజవర్గంలోని భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో తంటికొండ దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర , గోకవరం మండల టిడిపి నాయకులు దాసరి సీతారామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ బద్దిరెడ్డి బాబి, మలిరెడ్డి సిరి, బద్దిరెడ్డి రవి,మింది నరేంద్ర,కొంగరపు రాజు, చింతల నాగు, గంటిపూడి శ్రీధర్,బీశెట్టి వెంకన్న, పడాల దొర ,నాగం నాగిందు , బద్దిరెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.4
- కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన1
- తాడేపల్లిగూడెం మండలంలో వీఆర్ఏల ఆందోళన , వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చి పే స్కేల్ పెంచాలని డిమాండ్ తాడేపల్లిగూడెం, వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... - వీఆర్ఏలకు ఇస్తున్న గౌరవ వేతనం స్థానంలో ప్రమోషన్ ఇచ్చి పే స్కేల్ అమలు చేయాలి. - నామినేటెడ్ పద్ధతిలో పనిచేస్తున్న వీఆర్ఏలకు ప్రమోషన్ ఇచ్చి వీఆర్వోలుగా నియమించాలి. - వీఆర్వో ప్రమోషన్లలో వీఆర్ఏలకు ఉన్న 30% కోటాను 70% కి పెంచాలి. - చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. ప్రస్తుతం ఇస్తున్న తక్కువ జీతాలతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.3