logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మల్కాజిగిరి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఇటీవల ఎన్నికైన నూతన సభ్యులను కమిషనర్ సుమతి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సర్టిఫికెట్లను అందజేశారు. నూతన బృందానికి కమిషనర్ సుమతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీసు అధికారుల సంక్షేమం, సమన్వయం కోసం నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేయాలని ఆమె సూచించారు.

1 hr ago
user_Bhaskar Reddy
Bhaskar Reddy
Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
1 hr ago
c6773f09-5096-4431-9c7f-001475ebce86

మల్కాజిగిరి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఇటీవల ఎన్నికైన నూతన సభ్యులను కమిషనర్ సుమతి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సర్టిఫికెట్లను అందజేశారు. నూతన బృందానికి కమిషనర్ సుమతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీసు అధికారుల సంక్షేమం, సమన్వయం కోసం నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేయాలని ఆమె సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ* రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య, మశయ్య, ఆర్.ఉదయ్, పాల్గొన్నారు.
    2
    *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి*
*ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ
*జాతీయ మహాసభలను జయప్రదం చేయండి*
*ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ*
రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. 
మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో  బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య,  మశయ్య,  ఆర్.ఉదయ్,  పాల్గొన్నారు.
    user_Bhupathi Srinivas
    Bhupathi Srinivas
    రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన
పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    1
    యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ
మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
  • కవులు కళాకారుల ఐక్యవేదిక, జనగామ ఆధ్యర్యంలో అభినందన సభ శ్రీ బేతి వీరారెడ్డి గారికి తెలంగాణ శాసనసభ సహాయ కార్యదర్శిగా విధి నిర్వహణలో ఉంటూ, తమ ఉన్నతమైన నైపుణ్యాల అధ్యయనంలో భాగంగా విదేశాల్లో పర్యలోంచి విజయవంతంగా స్వదేశానికి విచ్చేసిన వేదిక: పెంబత్తి గ్రామం గ్రామ పంచాయతి దగ్గర శ్రీ. నెల్లుట్ల రవీందర్ రావు గారికి నిరంతర సామాజిక సేవా వికాసమే ధ్యేయం నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కళా, సాహిత్య, సామాజక సేవారంగాల్లో తమ నిరప,మాన సేవ గానూ ఇదేవల జాతీయ స్థాయిలో ప్రతిష్టాత పురస్కారాలు అందుకున్న 3໖: 20-09-2026 ఆదివారం సమయం: ৯ :6:00 e గ్రామ సర్పంచ్ శ్రీమతి చిన్నబోయిన రేఖరాజు గారి సహకారంతో అందరు ఆహ్వానితులే... ACCవర్కింగ్ కమిటీ జి. కృష్ట (జ.వై.గిరి ఫౌండేషన్) పెట్లోజు సోమేశ్వరాచారి (కవి హ్యధయం సాహిత్య వేదిక) అయిలా సోమనర్సింహాచా (అభినందన కల్వరల్ సొసైటీ- పెఁ లగిశెట్టి సభాకర్ చిలుమోజు సాయికిరణ్ గడం మనోజ్ కుమార్ గౌ
    3
    కవులు కళాకారుల ఐక్యవేదిక,
జనగామ
ఆధ్యర్యంలో
అభినందన సభ
శ్రీ బేతి వీరారెడ్డి గారికి
తెలంగాణ శాసనసభ సహాయ కార్యదర్శిగా విధి నిర్వహణలో ఉంటూ, తమ ఉన్నతమైన నైపుణ్యాల అధ్యయనంలో భాగంగా విదేశాల్లో పర్యలోంచి విజయవంతంగా స్వదేశానికి విచ్చేసిన
వేదిక:
పెంబత్తి గ్రామం గ్రామ పంచాయతి దగ్గర
శ్రీ. నెల్లుట్ల రవీందర్ రావు గారికి
నిరంతర సామాజిక సేవా వికాసమే ధ్యేయం నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కళా, సాహిత్య, సామాజక సేవారంగాల్లో తమ నిరప,మాన సేవ గానూ ఇదేవల జాతీయ స్థాయిలో ప్రతిష్టాత పురస్కారాలు అందుకున్న
3໖:
20-09-2026 ఆదివారం
సమయం:
৯ :6:00 e
గ్రామ సర్పంచ్ శ్రీమతి చిన్నబోయిన రేఖరాజు గారి సహకారంతో
అందరు ఆహ్వానితులే...
ACCవర్కింగ్ కమిటీ
జి. కృష్ట
(జ.వై.గిరి ఫౌండేషన్)
పెట్లోజు సోమేశ్వరాచారి (కవి హ్యధయం సాహిత్య వేదిక)
అయిలా సోమనర్సింహాచా (అభినందన కల్వరల్ సొసైటీ- పెఁ
లగిశెట్టి సభాకర్
చిలుమోజు సాయికిరణ్
గడం మనోజ్ కుమార్ గౌ
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    56 min ago
  • సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ఘనంగా ప్రత్యేక పూజలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ హాజరు గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, దీపక్ జాన్ ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో నిర్వహించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    4
    సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ఘనంగా ప్రత్యేక పూజలు

మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ హాజరు

గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, దీపక్ జాన్ ఆకాంక్షించారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో నిర్వహించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_Sai journalist
    Sai journalist
    బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్‌ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్‌ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్‌ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్‌ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య.. నగరంలో భయాందోళనలు లైవ్ మర్డర్ వీడియో..! ప్రాణ స్నేహితుడినే హతమార్చిన రౌడీషీటర్ సెటిల్మెంట్‌ డబ్బుల వివాదమే హత్యకు కారణమా..? నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో నాగోల్‌ పోలీసుల గాలింపు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 హైదరాబాద్‌ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్‌ మహమ్మద్‌ నహీమ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్‌ అలియాస్‌ జేకే మహేష్‌, మహమ్మద్‌ నహీమ్‌ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నహీమ్‌ బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. మూడు నెలలుగా వివాదం.. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా మహేష్‌, నహీమ్‌ మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలు, ముఠా విభేదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరువురిపైనా గతంలో పలు హత్య కేసులు ఉన్నట్లు, ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్లు నమోదైనట్లు సమాచారం. చిన్ననాటి స్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది. మహేష్‌ అండ్‌ టీం కోసం గాలింపు హత్య అనంతరం నిందితులు పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన నాగోల్‌ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. హత్యకు అసలు కారణం, ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో హత్యకు చెందిన వీడియోలు వైరల్ గా మారాయి.
    1
    హైదరాబాద్‌లో  రౌడీ షీటర్ దారుణ హత్య.. నగరంలో భయాందోళనలు
లైవ్ మర్డర్ వీడియో..!
ప్రాణ స్నేహితుడినే హతమార్చిన రౌడీషీటర్
సెటిల్మెంట్‌ డబ్బుల వివాదమే హత్యకు కారణమా..?
నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో నాగోల్‌ పోలీసుల గాలింపు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 
హైదరాబాద్‌ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్‌ మహమ్మద్‌ నహీమ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్‌ అలియాస్‌ జేకే మహేష్‌, మహమ్మద్‌ నహీమ్‌ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నహీమ్‌ బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.
మూడు నెలలుగా వివాదం..
సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా మహేష్‌, నహీమ్‌ మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలు, ముఠా విభేదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇరువురిపైనా గతంలో పలు హత్య కేసులు ఉన్నట్లు, ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్లు నమోదైనట్లు సమాచారం. చిన్ననాటి స్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది.
మహేష్‌ అండ్‌ టీం కోసం గాలింపు
హత్య అనంతరం నిందితులు పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన నాగోల్‌ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. హత్యకు అసలు కారణం, ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో హత్యకు చెందిన వీడియోలు వైరల్ గా మారాయి.
    user_Sai journalist
    Sai journalist
    బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి
కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.