Shuru
Apke Nagar Ki App…
యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
P.srinu
యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా??? తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా??? సిగ్గు సిగ్గు..🤬 సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ ఉండగా మాస్కులు ధరించి దాడికి యత్నించిన 15 మంది గుండాలు బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఎదురు తిరగడంతో పారిపోయిన వైనం1
- తెలంగాణలో MEOల కొరతపై కవిత ఆందోళన ప్రతి మండలానికి ఎంఈఓ ఉండాలి తెలంగాణలో సుమారు 620 మండలాలు ఉండగా, ప్రతి మండలానికి ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) ఉండాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కవిత అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 మండలాల్లో మాత్రమే పర్మనెంట్ MEOలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. విద్యాశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన MEO పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా పరిపాలనపై ప్రభావం పడుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి శాశ్వత MEOను నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ఘనంగా ప్రత్యేక పూజలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ హాజరు గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, దీపక్ జాన్ ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో నిర్వహించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.4
- జిల్లాలో ప్రశాంతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి.. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ _గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచనలు.!_ ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,500 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి.. మరో వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం.. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి... రాత్రి వేళల్లో మండపం వద్ద ఒక నిర్వాహకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. భక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి.. ప్రతి గణేష్ మండపానికి ఒక కానిస్టేబుల్‌ను అందుబాటులో.. దొంగతనాల నివారణకు సీసీఎస్ బృందాలు ప్రత్యేకంగా ఫీల్డ్‌లో పర్యటిస్తాయి.. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయి... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో నిమజ్జనం తేదీ వివరాలను కూడా నమోదు చేయాలి.. నిమజ్జనం రోజున ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. ల్యాండ్ అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు.. గత వారం రోజులుగా పలువురికి కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు చేపట్టాం.. ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని విజ్ఞప్తి.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్*1
- హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య.. నగరంలో భయాందోళనలు లైవ్ మర్డర్ వీడియో..! ప్రాణ స్నేహితుడినే హతమార్చిన రౌడీషీటర్ సెటిల్మెంట్ డబ్బుల వివాదమే హత్యకు కారణమా..? నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో నాగోల్ పోలీసుల గాలింపు హైదరాబాద్, సెప్టెంబర్ 15 హైదరాబాద్ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నహీమ్ బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. మూడు నెలలుగా వివాదం.. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా మహేష్, నహీమ్ మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలు, ముఠా విభేదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరువురిపైనా గతంలో పలు హత్య కేసులు ఉన్నట్లు, ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు నమోదైనట్లు సమాచారం. చిన్ననాటి స్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ అండ్ టీం కోసం గాలింపు హత్య అనంతరం నిందితులు పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. హత్యకు అసలు కారణం, ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో హత్యకు చెందిన వీడియోలు వైరల్ గా మారాయి.1