logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు మంత్రి అచ్చం నాయుడు. 42 ఆరోగ్య సిబ్బందికి హెచ్చరికలు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం లో టెక్కలి ప్రధాన జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను హెచ్చరించారు. సోమవారం ఉదయం 9 గంటలకే ఆకస్మికంగా టెక్కలి జిల్లా ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, సుమారు గంటన్నర పాటు ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ఆరా తీసిన ఆయన.. విధులకు ఆలస్యంగా వచ్చిన 42 మంది సిబ్బందికి మరోసారి పునరావృతం కాకుండా పద్ధతి మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై కమిటీ వేసి 36 గంటల్లోగా నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్‌ను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, రోగులకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఆసుపత్రిలో నీటి లభ్యత ఉన్న చోట వెంటనే కొత్త బోరు తవ్వించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించడంతో పాటు, రోగుల రాకపోకల సౌకర్యార్థం ప్రధాన గేటు వద్ద రెండు మాన్యువల్ గేట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే కేసులకు సాధ్యమైనంత వరకు ఇక్కడే చికిత్స అందించాలని, అత్యవసరమైతేనే జిల్లా కేంద్రానికి రిఫర్ చేయాలని వైద్యులకు దిశానిర్దేశం చేశారు. ఓపీ విభాగాన్ని సందర్శించి రోగులతో మాట్లాడిన మంత్రి.. మరుగుదొడ్ల నిర్వహణ, ఫ్యాన్లు, లైట్లు, లిఫ్ట్ సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. మంత్రి చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద రూ. 18 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి సమకూర్చారు. ఇందులో 4 ఆపరేషన్ టేబుళ్లు, 5 మల్టీపారా మానిటర్లు, వీన్ ఫైండర్లు, రోగుల విశ్రాంతి కోసం 20 కుర్చీలను అందజేసి, వాటిని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే బాధ్యతారాహిత్య సిబ్బందిపై కఠినంగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మహారాజ్, పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

5 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
25eba7cd-72f6-4d8b-b066-8ce7e9bbd8f7

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు మంత్రి అచ్చం నాయుడు. 42 ఆరోగ్య సిబ్బందికి హెచ్చరికలు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం లో టెక్కలి ప్రధాన జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను హెచ్చరించారు. సోమవారం ఉదయం 9 గంటలకే ఆకస్మికంగా టెక్కలి జిల్లా ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, సుమారు

de1066ca-3efa-4a13-8f33-d554e6663a92

గంటన్నర పాటు ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ఆరా తీసిన ఆయన.. విధులకు ఆలస్యంగా వచ్చిన 42 మంది సిబ్బందికి మరోసారి పునరావృతం కాకుండా పద్ధతి మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై కమిటీ వేసి 36 గంటల్లోగా నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్‌ను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, రోగులకు ఇబ్బంది

5a9d0329-c98a-4f59-898e-4874d4c2f74c

కలగకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఆసుపత్రిలో నీటి లభ్యత ఉన్న చోట వెంటనే కొత్త బోరు తవ్వించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించడంతో పాటు, రోగుల రాకపోకల సౌకర్యార్థం ప్రధాన గేటు వద్ద రెండు మాన్యువల్ గేట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే కేసులకు సాధ్యమైనంత వరకు ఇక్కడే చికిత్స అందించాలని, అత్యవసరమైతేనే జిల్లా కేంద్రానికి రిఫర్ చేయాలని వైద్యులకు దిశానిర్దేశం చేశారు. ఓపీ విభాగాన్ని సందర్శించి రోగులతో మాట్లాడిన మంత్రి.. మరుగుదొడ్ల నిర్వహణ, ఫ్యాన్లు, లైట్లు, లిఫ్ట్ సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.

5f7f3ab1-9d15-45d8-8f08-61682e21213b

మంత్రి చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద రూ. 18 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి సమకూర్చారు. ఇందులో 4 ఆపరేషన్ టేబుళ్లు, 5 మల్టీపారా మానిటర్లు, వీన్ ఫైండర్లు, రోగుల విశ్రాంతి కోసం 20 కుర్చీలను అందజేసి, వాటిని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే బాధ్యతారాహిత్య సిబ్బందిపై కఠినంగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మహారాజ్, పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజాం మండలం గడ్డవలసలో పిడుగుపడి మృతి చెందిన ముగ్గురు మహిళా కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ పరామర్శించారు. ఆయన ఒక్కొక్కరికి రూ. 10 వేల వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
    1
    రాజాం మండలం గడ్డవలసలో పిడుగుపడి మృతి చెందిన ముగ్గురు మహిళా కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ పరామర్శించారు. ఆయన ఒక్కొక్కరికి రూ. 10 వేల వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • 'ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకాశయానం' సాధారణంగా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం లేదా దాతలు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం చూస్తుంటాం. కానీ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎం. సత్యారావు విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలలను నిజం చేశారు. ​మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు విమానం ఎక్కడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయుడు సత్యారావు తెలిపారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన జీతపు సొమ్మును విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఈ విధంగా వెచ్చించడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమాన ప్రయాణం కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాకుండా, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ఒక గొప్ప పునాదిగా నిలుస్తుందని వారు కొనియాడారు.
    1
    'ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకాశయానం'
సాధారణంగా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం లేదా దాతలు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం చూస్తుంటాం. కానీ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎం. సత్యారావు  విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలలను నిజం చేశారు.
​మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు విమానం ఎక్కడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయుడు సత్యారావు తెలిపారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన జీతపు సొమ్మును విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఈ విధంగా వెచ్చించడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమాన ప్రయాణం కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాకుండా, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ఒక గొప్ప పునాదిగా నిలుస్తుందని వారు కొనియాడారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరుగురు బాధితులకు రూ. 8.52 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. వైసీపీ హయాంలో నిర్వీర్యం చేయబడిన ఈ పథకం పేదల వైద్యానికి తిరిగి భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు.
    1
    అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరుగురు బాధితులకు రూ. 8.52 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. వైసీపీ హయాంలో నిర్వీర్యం చేయబడిన ఈ పథకం పేదల వైద్యానికి తిరిగి భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు.
    user_Tri
    Tri
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    user_Shivaram
    Shivaram
    Apprenticeship Centre బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.

పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు.

తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • పి ఓ డబ్ల్యు ఏపీ రాష్ట్ర 9వ మహాసభలు విజయవంతం చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం పిలుపు. బొడ్డపాడు లో అమరవీరుల స్మారక భవనం వద్ద సభల పోస్టర్ ఆవిష్కరణ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు వద్ద ప్రగతిశీల మహిళా సంఘం పీ ఓ డబ్ల్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయండని ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం పిలుపునిచ్చింది. సోమవారం బొడ్డపాడు గ్రామంలోని అమరవీరుల స్మారక భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బొడ్డపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా టి వి డబ్ల్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. ఈశ్వరమ్మ , పి కుసుమలు మాట్లాడుతూ దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, గృహహింస, మూఢనమ్మకాలు, వివక్ష, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై మహిళలు ఐక్య పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ, ఉపాధి, విద్య, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. మహిళా హక్కుల సాధన, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు నిర్మించేందుకు రాష్ట్ర మహాసభలు దోహదపడతాయని పేర్కొన్నారు. 2026 మే 23, 24 తేదీలలో గుంటూరులో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభలను విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలని వారు కోరారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు బతకల ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ తో పాటు జిల్లా కోశాధికారి బర్ల జానకమ్మ, జిల్లా కమిటీ సభ్యులు రజిని, లత, ఢిల్లీశ్వరి, స్థానిక మహిళా సంఘ సభ్యులు మోహినమ్మ, వసంత, కుమారి, మహాలక్ష్మి, పద్మ తదితరులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
    1
    పి ఓ డబ్ల్యు ఏపీ రాష్ట్ర 9వ మహాసభలు విజయవంతం చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం పిలుపు. బొడ్డపాడు లో అమరవీరుల స్మారక భవనం వద్ద సభల పోస్టర్ ఆవిష్కరణ.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు వద్ద ప్రగతిశీల మహిళా సంఘం పీ ఓ డబ్ల్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయండని ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం పిలుపునిచ్చింది. సోమవారం బొడ్డపాడు గ్రామంలోని అమరవీరుల స్మారక భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బొడ్డపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా టి వి డబ్ల్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. ఈశ్వరమ్మ , పి కుసుమలు మాట్లాడుతూ దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, గృహహింస, మూఢనమ్మకాలు, వివక్ష, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై మహిళలు ఐక్య పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ, ఉపాధి, విద్య, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
మహిళా హక్కుల సాధన, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు నిర్మించేందుకు రాష్ట్ర మహాసభలు దోహదపడతాయని పేర్కొన్నారు. 2026 మే 23, 24 తేదీలలో గుంటూరులో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 9వ మహాసభలను విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలని వారు కోరారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు బతకల ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ తో పాటు జిల్లా కోశాధికారి బర్ల జానకమ్మ, జిల్లా కమిటీ సభ్యులు రజిని, లత, ఢిల్లీశ్వరి, స్థానిక మహిళా సంఘ సభ్యులు మోహినమ్మ, వసంత, కుమారి, మహాలక్ష్మి, పద్మ తదితరులు,  గ్రామ మహిళలు పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించండి -పిల్లలను చేర్పించండి: కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని తెలిపారు. వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.
    1
    ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించండి -పిల్లలను చేర్పించండి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని తెలిపారు.
వివిధ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న 26 మంది విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ పొందారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు.
జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో 60 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    1
    ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.