బీరంగూడ ఆలయ అభివృద్ధికి కార్యాచరణ* *భక్తుల సౌకర్యాల మెరుగుదలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి* •బీరంగూడ ఆలయ అభివృద్ధికి కార్యాచరణ* *భక్తుల సౌకర్యాల మెరుగుదలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి* అమీన్పూర్: దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయ ప్రాంగణ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. త్వరలోనే ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకుంటామని విజయ రామారావు తెలిపారు.
బీరంగూడ ఆలయ అభివృద్ధికి కార్యాచరణ* *భక్తుల సౌకర్యాల మెరుగుదలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి* •బీరంగూడ ఆలయ అభివృద్ధికి కార్యాచరణ* *భక్తుల సౌకర్యాల మెరుగుదలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి* అమీన్పూర్: దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో దేవనాదం,
చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయ ప్రాంగణ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. త్వరలోనే ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకుంటామని విజయ రామారావు తెలిపారు.
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే ఎరువుల కోసం వేచి చూస్తున్నామని మహిళా రైతు యశోద ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తున్న సమయంలో ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఖరీదైన ఫోన్ ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నించారు. చదువు లేకపోవడంతో ఆన్‌లైన్ విధానంలో బుకింగ్ చేసుకోవడం తమకు కష్టంగా మారిందన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ప్రక్రియతో ఇబ్బంది పెట్టకుండా నేరుగా యూరియా అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.1
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- పటాన్చెరు: 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పటాన్చెరు: 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఆగస్టు 29న అమీన్పూర్‌లో భారీ నిరసన సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సభకు 15 వేల మంది తరలిరానున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న భూములను 22A నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1