యోగివేమన ప్రాజెక్టుకు గ్రహణం! నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతున్న రూ.కోట్ల విలువైన ప్రాజెక్టు 10 వేల ఎకరాలకు సాగునీరు.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: రైతు సంఘం ముదిగుబ్బ: దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సత్యసాయి జిల్లా ఒకటని, నిత్యం కరువు పరిస్థితులతో రైతులు అప్పుల భారాన్ని మోస్తూ, ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడిన వెనుకబడిన ప్రాంతమైన ముదిగుబ్బ మండలానికి యోగివేమన జలాశయం ప్రధాన జలవనరు అని తెలిపారు. తాగునీరు, సాగునీరు, పశువులకు నీటి అవసరాలను తీర్చగలిగే ఈ ప్రాజెక్టు నేడు పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుతోందని విమర్శించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. హరి, జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న యోగివేమన ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు పరిసరాలు, కాలువలు, భవనాలు, రహదారి, మౌలిక వసతుల పరిస్థితులను పరిశీలించారు. ఏ. హరి మాట్లాడుతూ.. 2001లో శంకుస్థాపన చేసిన యోగివేమన ప్రాజెక్టు సుమారు 0.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించబడిందన్నారు. కుడి కాలువ ద్వారా 7,215 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 2,800 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్వహణను ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. 14 మంది సిబ్బంది ఉండాల్సిన చోట ఒక్కరు మాత్రమే ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సుమారు 18 కిలోమీటర్ల పొడవైన కుడి, ఎడమ కాలువల్లో చెట్లు, చెదారం పెరిగిపోయినా పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు దిగువన ఉన్న కొన్ని గ్రామాల్లో రైతుల పొలాల మీదుగా కాలువలు వెళ్లినా ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని రైతు సంఘం నాయకులు తెలిపారు. కాలువల కోసం భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వద్ద కనీసం లైటింగ్ సౌకర్యం లేకపోవడం, ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సరిగా లేకపోవడం, ప్రాజెక్టు పరిధిలోని భవనాలు పాడుపడి శిథిలావస్థకు చేరుకోవడం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. నీటి లీకేజీలను అరికట్టేందుకు ఇటీవల రూ.3.96 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే లీకేజీ పనులతో పాటు ప్రాజెక్టు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏ. హరి అన్నారు. మరోవైపు రాయలసీమను లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను అభివృద్ధి చేసి రైతులకు వ్యవసాయంలో అండగా నిలవకుండా, సాగు గిట్టుబాటు కావడం లేదనే పేరుతో సోలార్ ప్రాజెక్టుల కోసం రైతులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టడం రైతుల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులను మభ్యపెట్టొద్దు సోలార్ ప్రాజెక్టుల కోసం రైతుల భూములను ప్రైవేట్ కంపెనీలకు దీర్ఘకాలికంగా అప్పగించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడం సరికాదని రైతు సంఘం నాయకులు అన్నారు. సంవత్సరానికి రూ.30 వేల కౌలు ఇస్తామని చెప్పి 29 సంవత్సరాల 11 నెలల పాటు అగ్రిమెంట్లు చేసుకునే విధంగా రైతులను ఒప్పించడం వల్ల భవిష్యత్తులో రైతులు తమ భూములపై హక్కులు, నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములను కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధానాలకు బదులుగా సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ.. యోగివేమన ప్రాజెక్టును కేవలం నీటి నిల్వ ప్రాంతంగా కాకుండా మండల ప్రజలకు ఉపయోగపడే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రాజెక్టు పరిసరాల్లో పార్కు, వాకింగ్ ట్రాక్, లైటింగ్, పచ్చదనం, కూర్చునే సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారుతుందన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు కాలువల నిర్వహణ, రహదారి సౌకర్యం, భవనాల పునరుద్ధరణ, లైటింగ్ వంటి మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షాన నిలబడి యోగివేమన జలాశయంతో పాటు జిల్లాలోని అన్ని జలాశయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. కాలువల కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించి, వేలాది మంది రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1