ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరు వివాదం _రాజకీయాలకు బలి కాకూడదని ఎమ్మెల్యే హెచ్చరిక _బండారి రాజిరెడ్డి సేవలకు గుర్తింపుగా పేరు – మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర స్పందన ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లతో సిఆర్ఎంపి నిధులు మంజూరయ్యాయని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రితో చర్చించి పనులు ఆమోదింపజేసినట్లు చెప్పారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అటల్ బిహారీ వాజపేయి వంటి మహానేతల పట్ల తమకు గౌరవం ఉందని, ఆయన పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. అయితే ఒక్కరే వ్యతిరేకించడం వెనుక ప్రజాహితం లేదని, రాజకీయ లాభాలే ఉన్నాయని ఆరోపించారు.ఇంకా ఘాటుగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, పార్కుల కబ్జాలు తన రాజకీయాల్లో లేవని విమర్శించారు.దివంగత బండారి రాజిరెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, ఆయన పేరును వ్యతిరేకించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.“అభివృద్ధికి రాజకీయ రంగు వేయొద్దు… ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరు వివాదం _రాజకీయాలకు బలి కాకూడదని ఎమ్మెల్యే హెచ్చరిక _బండారి రాజిరెడ్డి సేవలకు గుర్తింపుగా పేరు – మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర స్పందన ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల కోరిక
మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లతో సిఆర్ఎంపి నిధులు మంజూరయ్యాయని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రితో చర్చించి పనులు ఆమోదింపజేసినట్లు చెప్పారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అటల్ బిహారీ వాజపేయి వంటి మహానేతల పట్ల తమకు గౌరవం ఉందని, ఆయన పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. అయితే ఒక్కరే వ్యతిరేకించడం వెనుక ప్రజాహితం లేదని, రాజకీయ లాభాలే ఉన్నాయని ఆరోపించారు.ఇంకా ఘాటుగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, పార్కుల కబ్జాలు తన రాజకీయాల్లో లేవని విమర్శించారు.దివంగత బండారి రాజిరెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, ఆయన పేరును వ్యతిరేకించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.“అభివృద్ధికి రాజకీయ రంగు వేయొద్దు… ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
- విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్ర ఆత్మ హిందూ బంధువులకు ఆహ్వానం ధైర్యం శక్తిసామర్థ్యాల ప్రతీక హనుమంతుడు తన అనంతబల పరాగ్రామాలతో రామ కార్యం సులభతరం చేసిన వీర హనుమాన్ శక్తులు అపారం తున్న విదర్మీల ఆకృత్యాలు ఎదుర్కోవడానికి హిందూ సమాజం నిలవాలంటే ప్రతి ఒక్కరు అనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఐక్యత ప్రదర్శించాలన్నారు హిందూ సమాజ పరిరక్షణకు పూనుకోవాలన్నారు. మెదక్ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వెల్కమ్బోడు వద్ద సాయంత్రం ఐదు గంటలకు విజయ యాత్ర ప్రారంభమవుతుందని సంయోజక్ మహేంద్ర పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు ఈ యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు మీయొక్క వ్యాపారాలను రెండు గంటల పాటు వదిలి విజయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.1
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమితండాలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్రామానికి చెందిన భూక్యా పద్మ నివాసపు పూరి గుడిసె పూర్తిగా కాలి దగ్ధమైంది. గమనించిన స్థానికులు స్పందించి మంటలను ఆరిపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణామాన్ని జరగలేదు. అలాగే సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారు లాలు తండాలో ఎస్సారెస్పీ కాలువ నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. తండా వైపు వచ్చే కాలువ గేట్లను కొందరు ఇష్టారాజ్యంగా ఎత్తడం వల్ల నీరు కాలువపై నుంచి కిందికి వచ్చి రైతుల పొలాల్లోకి చేరుతోంది. దీంతో పంట పొలాలు నీటమునిగే పరిస్థితి ఏర్పడగా, కాలువ తెగిపోవచ్చనే ప్రమాదం కూడా నెలకొంది. సమస్యపై వెంటనే స్పందించి నీటి విడుదలను నియంత్రించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.1
- ములకలకాలువ గ్రామ సభ1
- ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు. హైదరాబాద్ చిల్కానగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, నేర్ధం భాస్కర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తోందని, బడ్జెట్ లో కూడా బీసీలను విస్మరించిందని ఆరోపించారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంగా, రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో బీసీలను గెలిపించుకుంటామని ఆయన అన్నారు. పాపన్న స్ఫూర్తితో కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.1
- దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహణ 📅 తేదీ : 03.04.2026 📍 స్థలం : IDOC, కామాహరెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (LB) శ్రీ మధు మోహన్ గారు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, “దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమర వీరుడని, రెండు పదుల వయసు నిండకుండానే భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం రైతాంగ పోరాటం చేసి అమరుడైన మహా వీరుడని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని, ఆయన ధైర్యసాహసాలు మరియు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.” అలాగే బహుజన సంఘాల నాయకులు, కుర్మ సంఘం నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సహాయ బీసీ అభివృద్ధి అధికారి శ్రీ చక్రధర్ గారు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, గణేష్ నాయక్, విఠల్, నాగరాజు, కుర్మ సంఘం నాయకులు భూమయ్య, సంజీవ్ స్వామి, అశ్వక్, నరేష్, స్వప్న, సునీత, పవన్ మరియు జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారం పది రోజుల్లో ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ను ఓడించే సత్తా గల పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. జగిత్యాలలో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమపై అభిమానాన్ని చూపుతున్నాయని అందుకు ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని త్వరలోనే ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. గతంలో మార్పు రావాలని....కెసిఆర్ పోవాలని కోరుకున్నామని, పదేళ్ల తర్వాత ప్రజల్లో మార్పు వస్తే, ఇప్పుడు పరిస్థితి మారి, రెండేళ్లలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు చేపట్టాలని, ప్రాణహిత నది జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి చేశారు.1