logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల జిల్లాలో గ్యాస్ కొరత...బుక్ చేసినా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆందోళన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

జగిత్యాల జిల్లాలో గ్యాస్ కొరత...బుక్ చేసినా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆందోళన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
    1
    హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది.
ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంతో పాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి లబ్ధిదారులను అభినందించారు. ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు, రైతులకు మద్దతు ధర కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంతో పాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి లబ్ధిదారులను అభినందించారు. ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు, రైతులకు మద్దతు ధర కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    54 min ago
  • విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్ర ఆత్మ హిందూ బంధువులకు ఆహ్వానం ధైర్యం శక్తిసామర్థ్యాల ప్రతీక హనుమంతుడు తన అనంతబల పరాగ్రామాలతో రామ కార్యం సులభతరం చేసిన వీర హనుమాన్ శక్తులు అపారం తున్న విదర్మీల ఆకృత్యాలు ఎదుర్కోవడానికి హిందూ సమాజం నిలవాలంటే ప్రతి ఒక్కరు అనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఐక్యత ప్రదర్శించాలన్నారు హిందూ సమాజ పరిరక్షణకు పూనుకోవాలన్నారు. మెదక్ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వెల్కమ్బోడు వద్ద సాయంత్రం ఐదు గంటలకు విజయ యాత్ర ప్రారంభమవుతుందని సంయోజక్ మహేంద్ర పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు ఈ యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు మీయొక్క వ్యాపారాలను రెండు గంటల పాటు వదిలి విజయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.
    1
    విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్ర ఆత్మ హిందూ బంధువులకు ఆహ్వానం ధైర్యం శక్తిసామర్థ్యాల ప్రతీక హనుమంతుడు తన అనంతబల పరాగ్రామాలతో రామ కార్యం సులభతరం చేసిన వీర హనుమాన్ శక్తులు అపారం తున్న విదర్మీల ఆకృత్యాలు ఎదుర్కోవడానికి హిందూ సమాజం నిలవాలంటే ప్రతి ఒక్కరు అనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఐక్యత ప్రదర్శించాలన్నారు హిందూ సమాజ పరిరక్షణకు పూనుకోవాలన్నారు. మెదక్ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వెల్కమ్బోడు వద్ద సాయంత్రం ఐదు గంటలకు విజయ యాత్ర ప్రారంభమవుతుందని సంయోజక్ మహేంద్ర పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు ఈ యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు మీయొక్క వ్యాపారాలను రెండు గంటల పాటు వదిలి విజయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.
    1
    తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది. ​ గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు. ​రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి. ​
    1
    సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. 
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది.
​
గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు.
​రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి.
​
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    18 min ago
  • కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నచ్చు నచ్చాయి కార్ల ప్రయాణిస్తున్న సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలుకాగ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్వల్ప గాయాలతో మరొకరు మాత్రమే బయటపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జుకావడం చూస్తే ఎంత స్పీడులో ఉన్నారో అర్థం అవుతుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ప్రమాదం పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    3
    కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్  వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నచ్చు నచ్చాయి కార్ల ప్రయాణిస్తున్న సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలుకాగ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్వల్ప గాయాలతో మరొకరు మాత్రమే బయటపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కారు పూర్తిగా నుజ్జునుజ్జుకావడం చూస్తే ఎంత స్పీడులో ఉన్నారో అర్థం అవుతుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ప్రమాదం పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • జనగామ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు పాల్గొని అమరుడి సేవలను స్మరించుకున్నారు.
    1
    జనగామ జిల్లాలో  తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు పాల్గొని అమరుడి సేవలను స్మరించుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెట్ సంగెం గ్రామంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని శుక్రవారం కుస్తీ పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి దశ పోటీలు అత్యంత హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రతో పాటు పరిసర ప్రాంతాల నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుస్తీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది.
    1
    కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెట్ సంగెం గ్రామంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని శుక్రవారం కుస్తీ పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి దశ పోటీలు అత్యంత హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రతో పాటు పరిసర ప్రాంతాల నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుస్తీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    54 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.