Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.
Telangana news
తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.1
- ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లతో సిఆర్ఎంపి నిధులు మంజూరయ్యాయని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రితో చర్చించి పనులు ఆమోదింపజేసినట్లు చెప్పారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అటల్ బిహారీ వాజపేయి వంటి మహానేతల పట్ల తమకు గౌరవం ఉందని, ఆయన పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. అయితే ఒక్కరే వ్యతిరేకించడం వెనుక ప్రజాహితం లేదని, రాజకీయ లాభాలే ఉన్నాయని ఆరోపించారు.ఇంకా ఘాటుగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, పార్కుల కబ్జాలు తన రాజకీయాల్లో లేవని విమర్శించారు.దివంగత బండారి రాజిరెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, ఆయన పేరును వ్యతిరేకించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.“అభివృద్ధికి రాజకీయ రంగు వేయొద్దు… ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.2
- దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలను సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఘనంగా నివాళులర్పించారు , అదనపు కలెక్టర్ నగేష్, బీసీ సంక్షేమ కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- వికారాబాద్, మోమిన్ పేట్ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మొహం పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆర్డిఓ వాసు చంద్ర జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు గ్రామంలోని ప్రజలకు అందాల లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయల ప్రయాణాలు చేశారని, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ గురజాతి పథకంలో పేదల ఇళ్లకు ఉచిత కరెంట్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు కల్పించినట్లు తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్లో శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ ప్రవీణ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీలు ప్రేక్షకులను అలరించాయి. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1
- రెండు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం 2000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 5, మే 22 తేదీల్లో జరగబోయే మ్యాచ్‌ల కోసం భద్రతా ఏర్పాట్లపై హెచ్‌సీఏ కోశాధికారి అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బస్వరాజు, బీసీసీఐ అసిస్టెంట్ వెన్యూ మేనేజర్ వైభవ్, సన్‌రైజర్స్ ప్రతినిధి శర్వానన్‌లతో కలిసి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు కూడా ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు.1