logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బూరుగుపల్లి గ్రామం లో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న స్పీకర్ వికారాబాద్, మోమిన్ పేట్ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మొహం పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆర్డిఓ వాసు చంద్ర జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు గ్రామంలోని ప్రజలకు అందాల లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయల ప్రయాణాలు చేశారని, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ గురజాతి పథకంలో పేదల ఇళ్లకు ఉచిత కరెంట్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు కల్పించినట్లు తెలిపారు.

5 hrs ago
user_Thanmai Sri
Thanmai Sri
Vikarabad, Telangana•
5 hrs ago

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బూరుగుపల్లి గ్రామం లో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న స్పీకర్ వికారాబాద్, మోమిన్ పేట్ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మొహం పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆర్డిఓ వాసు చంద్ర జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు గ్రామంలోని ప్రజలకు అందాల లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయల ప్రయాణాలు చేశారని, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ గురజాతి పథకంలో పేదల ఇళ్లకు ఉచిత కరెంట్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు కల్పించినట్లు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • పత్రిక ప్రకటన తేది 02.04.202.6. కామారెడ్డి జిల్లా గురువారం ... మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన గ్రామసభ. .....కామారెడ్డి జిల్లా రామిరెడ్డి మండలం రంగం పేట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం ఉదయం నుండి ప్రారంభమైన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. .. ముందుగా జయజయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామసభ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సర్పంచ్ వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చర్చలు జరపడం, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం, గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను నిర్ణయించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ వంటి ప్రధాన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించబడుతుందని అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్ల కొనుగోలు బోనస్, పెన్షన్లు వంటి కొత్త పథకాల పై కూడా వివరాలు అందించబడతాయని గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ,పథకాల లబ్ధిదారులు అందరూ భాగస్వాములు కావాలని, గ్రామ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత కేటాయించి, సంబంధిత రిజిస్టర్‌ లో నమోదు చేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభలో తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ పథకాల పై పూర్తి సమాచారం తెలుసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
    1
    పత్రిక ప్రకటన        తేది 02.04.202.6.   కామారెడ్డి జిల్లా  గురువారం                                                   ...                             మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన గ్రామసభ.                                                 .....కామారెడ్డి జిల్లా రామిరెడ్డి మండలం రంగం పేట గ్రామం లో  ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం ఉదయం నుండి ప్రారంభమైన  గ్రామసభ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.                     ..
ముందుగా జయజయ హే తెలంగాణ  రాష్ట్ర  గీతంతో  గ్రామసభ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.                                     అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి  సందేశాన్ని సర్పంచ్  వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చర్చలు జరపడం, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం, గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను నిర్ణయించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.
ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ వంటి ప్రధాన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించబడుతుందని
అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్ల కొనుగోలు బోనస్, పెన్షన్లు వంటి కొత్త పథకాల పై కూడా వివరాలు అందించబడతాయని 
గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ,పథకాల లబ్ధిదారులు అందరూ భాగస్వాములు కావాలని, గ్రామ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత కేటాయించి, సంబంధిత రిజిస్టర్‌ లో నమోదు చేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని,  గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభలో తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ పథకాల పై పూర్తి సమాచారం తెలుసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Tagore
    3
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
  • ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.
    1
    ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో
గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    10 hrs ago
  • దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    దరూరు మండల కేంద్రములో  శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్.
********<<<<<<>>>>>>********
జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి  ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో  ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    11 hrs ago
  • *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*
    1
    *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు*
*ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    11 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా  పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • పత్రిక ప్రకటన తేది:02.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం. .. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. . సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న సేవలను స్మరించుకున్నారు.
    1
    పత్రిక ప్రకటన తేది:02.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం.                                                             ..          
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి
జిల్లా కలెక్టర్  ఆశిష్  సాంగ్వాన్  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు                                                    .
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  “సర్దార్ సర్వాయి పాపన్న  పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. .         సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు విక్టర్,  మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న  సేవలను స్మరించుకున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
  • ఆర్గానిక్ గా పండించిన పంటలకు రైతులు లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది
    1
    ఆర్గానిక్ గా పండించిన పంటలకు రైతులు లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.