logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పత్రిక ప్రకటన తేది:02.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం. .. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. . సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న సేవలను స్మరించుకున్నారు.

4 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
4 hrs ago

కామారెడ్డి జిల్లా : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పత్రిక ప్రకటన తేది:02.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం. .. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. . సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న సేవలను స్మరించుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పత్రిక ప్రకటన తేది 02.04.202.6. కామారెడ్డి జిల్లా గురువారం ... మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన గ్రామసభ. .....కామారెడ్డి జిల్లా రామిరెడ్డి మండలం రంగం పేట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం ఉదయం నుండి ప్రారంభమైన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. .. ముందుగా జయజయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామసభ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సర్పంచ్ వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చర్చలు జరపడం, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం, గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను నిర్ణయించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ వంటి ప్రధాన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించబడుతుందని అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్ల కొనుగోలు బోనస్, పెన్షన్లు వంటి కొత్త పథకాల పై కూడా వివరాలు అందించబడతాయని గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ,పథకాల లబ్ధిదారులు అందరూ భాగస్వాములు కావాలని, గ్రామ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత కేటాయించి, సంబంధిత రిజిస్టర్‌ లో నమోదు చేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభలో తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ పథకాల పై పూర్తి సమాచారం తెలుసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
    1
    పత్రిక ప్రకటన        తేది 02.04.202.6.   కామారెడ్డి జిల్లా  గురువారం                                                   ...                             మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన గ్రామసభ.                                                 .....కామారెడ్డి జిల్లా రామిరెడ్డి మండలం రంగం పేట గ్రామం లో  ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం ఉదయం నుండి ప్రారంభమైన  గ్రామసభ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.                     ..
ముందుగా జయజయ హే తెలంగాణ  రాష్ట్ర  గీతంతో  గ్రామసభ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.                                     అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి  సందేశాన్ని సర్పంచ్  వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చర్చలు జరపడం, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం, గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను నిర్ణయించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.
ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ వంటి ప్రధాన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించబడుతుందని
అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్ల కొనుగోలు బోనస్, పెన్షన్లు వంటి కొత్త పథకాల పై కూడా వివరాలు అందించబడతాయని 
గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ,పథకాల లబ్ధిదారులు అందరూ భాగస్వాములు కావాలని, గ్రామ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత కేటాయించి, సంబంధిత రిజిస్టర్‌ లో నమోదు చేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని,  గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభలో తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ పథకాల పై పూర్తి సమాచారం తెలుసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా  పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 24 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సోన్ పెట్ గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో గ్రామస్థులు దాతల సహకారంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఉదయం నుండే అర్చకులు గణపతి పూజ పుణ్యాహవాచనం హోమాలు ఇతర విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి గ్రామ కమిటీని అభినందించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగడం శుభపరిణామమని, భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకకు సోన్ పెట్ గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జై హనుమాన్ నినాదాలతో సోన్ పెట్ గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు భక్తజనులు బీ.ఆర్.ఎస్. నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    నిజామాబాద్ జిల్లా 
మెండోరా మండలంలోని సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. 
ఈ సందర్భంగా గ్రామంలో రూ. 24 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.
భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సోన్ పెట్ గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. 
సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో గ్రామస్థులు దాతల సహకారంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని  ఆలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. 
ఉదయం నుండే అర్చకులు గణపతి పూజ పుణ్యాహవాచనం హోమాలు ఇతర విశేష పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించారు. 
అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి గ్రామ కమిటీని అభినందించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. 
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 
గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగడం శుభపరిణామమని, భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ వేడుకకు సోన్ పెట్ గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 
భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 
జై హనుమాన్ నినాదాలతో సోన్ పెట్ గ్రామం మారుమోగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు భక్తజనులు బీ.ఆర్.ఎస్. నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఏసీబీ దాడులు ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని బిల్స్ సెక్షన్ లో పనిచేస్తున్న రమేష్, అరవింద్ అనే ఇద్దరు ఉద్యోగులు రూ. 13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఏసీబీ దాడులు
ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని బిల్స్ సెక్షన్ లో పనిచేస్తున్న రమేష్, అరవింద్ అనే ఇద్దరు ఉద్యోగులు రూ. 13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    16 hrs ago
  • సంగారెడ్డి మున్సిపాలిటీలో చెత్తను వేరువేరుగా వేయాలి: అదనపు కలెక్టర్ పాండు
    1
    సంగారెడ్డి మున్సిపాలిటీలో చెత్తను వేరువేరుగా వేయాలి: అదనపు కలెక్టర్ పాండు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది
    2
    జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • Post by Solanke Ravi
    2
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • పత్రిక ప్రకటన తేది:02.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం. .. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. . సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న సేవలను స్మరించుకున్నారు.
    1
    పత్రిక ప్రకటన తేది:02.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం.                                                             ..          
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి
జిల్లా కలెక్టర్  ఆశిష్  సాంగ్వాన్  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు                                                    .
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  “సర్దార్ సర్వాయి పాపన్న  పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. .         సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు విక్టర్,  మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న  సేవలను స్మరించుకున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.