సోన్ పెట్ గ్రామంలో వైభవంగా శ్రీ ఆంజనేయ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 24 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సోన్ పెట్ గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో గ్రామస్థులు దాతల సహకారంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఉదయం నుండే అర్చకులు గణపతి పూజ పుణ్యాహవాచనం హోమాలు ఇతర విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి గ్రామ కమిటీని అభినందించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగడం శుభపరిణామమని, భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకకు సోన్ పెట్ గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జై హనుమాన్ నినాదాలతో సోన్ పెట్ గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు భక్తజనులు బీ.ఆర్.ఎస్. నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- పత్రిక ప్రకటన తేది:02.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం. .. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. . సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న సేవలను స్మరించుకున్నారు.1
- జన్నారం మండలంలోని అన్నిగ్రామాలలో భక్తిశ్రద్ధల మధ్య హనుమాన్ జయంతిని భక్తులు, ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జన్నారం మండల కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, హనుమాన్, పైడిపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయాలు, వివిధ గ్రామాలలో ఉన్న హనుమాన్ దేవాలయాల్లోని ఆంజనేయస్వామి వారిని వేద పండితులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే భక్తులు కూడా పూజలు చేయిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడలోతేది: 01-04-2025 (బుధవారం) రోజున పదవీ విరమణ పొందుతున్న మరియు బదిలీ అయిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది2
- సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. అధికారుల గైర్హాజరును కారణంగా చూపుతూ సమావేశాన్ని అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా సభ నిర్వహించడం సరైందికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా వార్డు సభ్యులు వాకౌట్ చేయడంతో ప్రజలు కూడా బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ నాగమణి, అధికారులు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించారు.2
- రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.4
- కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్ నగర్ లో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వడ్ల బాలచంద్రంకు చెందిన కార్పెంటర్ షాప్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. మంటలు పై అంతస్థకు వ్యాపించడంతో కుటుంబ సభ్యులు కిందికి వచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రాణా హాని కాలేదు. గమనించిన స్థానికులు వెంటనే పారిసిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఫైర్ ఇంజన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా కలప, ఇతర సామాగ్రి దగ్ధమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలినట్లు 12 వార్డు కౌన్సిలర్ కాసర్ల స్వామి తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దక్షిణ కాశిగా పేరుగాంచిన తెలంగాణ అతిపెద్ద దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన డీఈఓగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.1
- భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక జగిత్యాల కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ లో చేతికందే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎండుతున్న పంటలను చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పశువులకు మేతగా పచ్చటి పొలాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బావులు పూర్తిగా ఎండిపోవడం, వేసిన బోర్లు కూడా వట్టి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడలేక, చివరికి పశువులకు మేతకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామానికి అతి సమీపంలో పోతారం రిజర్వాయర్ ఉన్నప్పటికీ, సాగునీరు అందకపోవడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కుడి-ఎడమ కాలువల పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అవి అమలు కాలేదని రైతులు తెలిపారు. భూ నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు. తదుపరి ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుడి-ఎడమ కాలువల పనులను త్వరితగతిన ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.4