పంటలు ఎండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆరోపణ...జీవనదిగా ఉన్న వరద కాలువలో నీళ్ళున్నా వినియోగించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శ రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
పంటలు ఎండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆరోపణ...జీవనదిగా ఉన్న వరద కాలువలో నీళ్ళున్నా వినియోగించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శ రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
సుంకె రవిశంకర్ ఆరోపించారు. మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు.
చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను
రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
- రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.4
- జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- హనుమకొండ జిల్లా వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం లేకుండా డాక్యుమెంట్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలతో గత నాలుగు నెలలుగా సుమారు 204 ఫైళ్లను పెండింగ్‌లో ఉంచినట్లు ఫిర్యాదులు వచ్చినట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. సోదాల సందర్భంగా 20 మంది మధ్యవర్తుల వద్ద నుంచి రూ.45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలపై విచారణ కొనసాగుతోంది.1
- Post by Tagore3
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.2
- భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక జగిత్యాల కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ లో చేతికందే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎండుతున్న పంటలను చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పశువులకు మేతగా పచ్చటి పొలాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బావులు పూర్తిగా ఎండిపోవడం, వేసిన బోర్లు కూడా వట్టి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడలేక, చివరికి పశువులకు మేతకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామానికి అతి సమీపంలో పోతారం రిజర్వాయర్ ఉన్నప్పటికీ, సాగునీరు అందకపోవడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కుడి-ఎడమ కాలువల పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అవి అమలు కాలేదని రైతులు తెలిపారు. భూ నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు. తదుపరి ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుడి-ఎడమ కాలువల పనులను త్వరితగతిన ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.4