logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భక్తిశ్రద్ధల మధ్య హనుమాన్ జయంతి, తరలివస్తున్న భక్తులు... జన్నారం మండలంలోని అన్నిగ్రామాలలో భక్తిశ్రద్ధల మధ్య హనుమాన్ జయంతిని భక్తులు, ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జన్నారం మండల కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, హనుమాన్, పైడిపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయాలు, వివిధ గ్రామాలలో ఉన్న హనుమాన్ దేవాలయాల్లోని ఆంజనేయస్వామి వారిని వేద పండితులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే భక్తులు కూడా పూజలు చేయిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

13 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
13 hrs ago

భక్తిశ్రద్ధల మధ్య హనుమాన్ జయంతి, తరలివస్తున్న భక్తులు... జన్నారం మండలంలోని అన్నిగ్రామాలలో భక్తిశ్రద్ధల మధ్య హనుమాన్ జయంతిని భక్తులు, ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జన్నారం మండల కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, హనుమాన్, పైడిపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయాలు, వివిధ గ్రామాలలో ఉన్న హనుమాన్ దేవాలయాల్లోని ఆంజనేయస్వామి వారిని వేద పండితులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే భక్తులు కూడా పూజలు చేయిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

More news from తెలంగాణ and nearby areas
  • సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కాకపోవడాన్ని కారణంగా చూపుతూ ఆయన సభను అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ఇతర ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా గ్రామసభ నిర్వహించడం సరికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో కొంతమంది గ్రామస్తులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ నాగమణి, ఇతరులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.
    2
    సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కాకపోవడాన్ని కారణంగా చూపుతూ ఆయన సభను అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ఇతర ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా గ్రామసభ నిర్వహించడం సరికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో కొంతమంది గ్రామస్తులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
సర్పంచ్ నాగమణి, ఇతరులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • 🪾🌿🪾🌿🪾🌿🪾🌿🪾🌿 .* *ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ. గోడం నగేష్ గారు లోకసభలో మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆటవిశాఖ అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరడం జరిగింది. జిల్లాలోని ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్ మరియు PMGSY ద్వారా మంజూరైన రోడ్లకు వాటి అనుమతులు లేక పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గారు కోరారు.* 🌿🪾🌺🌿🪾🌺🌿🪾🌺🌿
    1
    🪾🌿🪾🌿🪾🌿🪾🌿🪾🌿
.*
*ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ. గోడం నగేష్ గారు లోకసభలో మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆటవిశాఖ అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరడం జరిగింది. జిల్లాలోని ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్ మరియు PMGSY ద్వారా మంజూరైన రోడ్లకు వాటి అనుమతులు లేక పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గారు కోరారు.*
🌿🪾🌺🌿🪾🌺🌿🪾🌺🌿
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా  పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
    4
    రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు.
మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Solanke Ravi
    2
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • పత్రిక ప్రకటన తేది 02.04.202.6. కామారెడ్డి జిల్లా గురువారం ... మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన గ్రామసభ. .....కామారెడ్డి జిల్లా రామిరెడ్డి మండలం రంగం పేట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం ఉదయం నుండి ప్రారంభమైన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. .. ముందుగా జయజయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామసభ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సర్పంచ్ వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చర్చలు జరపడం, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం, గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను నిర్ణయించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ వంటి ప్రధాన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించబడుతుందని అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్ల కొనుగోలు బోనస్, పెన్షన్లు వంటి కొత్త పథకాల పై కూడా వివరాలు అందించబడతాయని గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ,పథకాల లబ్ధిదారులు అందరూ భాగస్వాములు కావాలని, గ్రామ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత కేటాయించి, సంబంధిత రిజిస్టర్‌ లో నమోదు చేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభలో తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ పథకాల పై పూర్తి సమాచారం తెలుసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
    1
    పత్రిక ప్రకటన        తేది 02.04.202.6.   కామారెడ్డి జిల్లా  గురువారం                                                   ...                             మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన గ్రామసభ.                                                 .....కామారెడ్డి జిల్లా రామిరెడ్డి మండలం రంగం పేట గ్రామం లో  ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం ఉదయం నుండి ప్రారంభమైన  గ్రామసభ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.                     ..
ముందుగా జయజయ హే తెలంగాణ  రాష్ట్ర  గీతంతో  గ్రామసభ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.                                     అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి  సందేశాన్ని సర్పంచ్  వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చర్చలు జరపడం, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం, గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను నిర్ణయించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.
ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ వంటి ప్రధాన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించబడుతుందని
అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్ల కొనుగోలు బోనస్, పెన్షన్లు వంటి కొత్త పథకాల పై కూడా వివరాలు అందించబడతాయని 
గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ,పథకాల లబ్ధిదారులు అందరూ భాగస్వాములు కావాలని, గ్రామ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత కేటాయించి, సంబంధిత రిజిస్టర్‌ లో నమోదు చేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని,  గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభలో తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ పథకాల పై పూర్తి సమాచారం తెలుసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. అధికారుల గైర్హాజరును కారణంగా చూపుతూ సమావేశాన్ని అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా సభ నిర్వహించడం సరైందికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా వార్డు సభ్యులు వాకౌట్ చేయడంతో ప్రజలు కూడా బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ నాగమణి, అధికారులు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించారు.
    2
    సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. అధికారుల గైర్హాజరును కారణంగా చూపుతూ సమావేశాన్ని అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా సభ నిర్వహించడం సరైందికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా వార్డు సభ్యులు వాకౌట్ చేయడంతో ప్రజలు కూడా బయటకు వెళ్లిపోయారు.
సర్పంచ్ నాగమణి, అధికారులు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • Assam is all set to bless the BJP-NDA. The energy at Behali says it all!
    1
    Assam is all set to bless the BJP-NDA. The energy at Behali says it all!
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    9 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామివారికి మంత్రోచ్ఛారణల మధ్య సుప్రభాత ధారాభిషేకం, మహాపూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని అనుబంధ ఆలయాలలో పరివార దేవతలకు, ఆలయంలో ఉన్న హనుమాన్ మూల మూర్తులకు మేళతాళాల మధ్య వేద స్వస్తి మంత్రాలతో చందనాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న–భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మామిడాకులు, కొబ్బరాకులతో చేసిన తోరణాలు మరియు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామివారికి మంత్రోచ్ఛారణల మధ్య సుప్రభాత ధారాభిషేకం, మహాపూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని అనుబంధ ఆలయాలలో పరివార దేవతలకు, ఆలయంలో ఉన్న హనుమాన్ మూల మూర్తులకు మేళతాళాల మధ్య వేద స్వస్తి మంత్రాలతో చందనాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న–భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మామిడాకులు, కొబ్బరాకులతో చేసిన తోరణాలు మరియు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.