ప్రాణానికి రక్షణ.. గీతన్నకు ‘హెల్మెట్’ శిక్షణ! నర్సింహులపేట మండలంలో హెల్మెట్ తో తాటిచెట్టు ఎక్కుతున్న గీత కార్మికుడు సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది. గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి.

- సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది. గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి. 1
- వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. గడువు ముగిసిన మందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే వేరు చేసి తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన ఔషధాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాంబశివరావు, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఆసుపత్రి అధికారి డా. కిషన్, డా. ప్రవీణ్ ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు1
- హన్మకొండ జిల్లాలో ఓ ఎంఆర్వోపై భార్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఎంఆర్వో గిరిబాబు ఐదేళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య ఝాన్సీరాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యా పిల్లలను పట్టించుకోకుండా వేరే మహిళతో ఉంటూ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను తీసుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.1
- Post by Ramprasad islavath1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.3
- అంజన్న మాలధారణ స్వాములకు నిలువ నీడ లేక ఇబ్బందులు ఆలయ కమిటీపై భక్తుల ఆగ్రహం ఏటూర్ నాగారం శ్రీ రామ నవమి అనంతరం మండల దీక్షలో ఉన్న స్వాములకు తగిన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి స్థానిక రామాలయం గుడి కళ్యాణ మండపం వద్ద శ్రీ రామ నవమి సందర్భంగా దాతల సహకారంతో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సమయంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినప్పటికీ, అనంతరం పరిస్థితులు మారడం గమనార్హం. శ్రీ రామ నవమి ముగిసిన తరువాత హనుమాన్ స్వాములు, అంజన్న స్వాములు 41 రోజుల మండల దీక్షలో భాగంగా మాలధారణ చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో రామాలయం వద్ద స్వాముల కోసం ప్రత్యేకంగా కుటీరాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆలయ కమిటీ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించకపోవడంతో మాలధారణలో ఉన్న స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిలువ నీడ లేక భక్తులు, స్వాములు బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే స్థానిక గ్రామ పెద్దలు. స్పందించి స్వాములకు తగిన నీడ, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని,1
- ములకలకాలువ గ్రామ సభ1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారు లాలు తండాలో ఎస్సారెస్పీ కాలువ నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. తండా వైపు వచ్చే కాలువ గేట్లను కొందరు ఇష్టారాజ్యంగా ఎత్తడం వల్ల నీరు కాలువపై నుంచి కిందికి వచ్చి రైతుల పొలాల్లోకి చేరుతోంది. దీంతో పంట పొలాలు నీటమునిగే పరిస్థితి ఏర్పడగా, కాలువ తెగిపోవచ్చనే ప్రమాదం కూడా నెలకొంది. సమస్యపై వెంటనే స్పందించి నీటి విడుదలను నియంత్రించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.1