Shuru
Apke Nagar Ki App…
*సాత్ ఫెరా ఫర్థువణా, ( బంజారా సంస్కృతి సాంప్రదాయంలో ఏడ అడుగులు వేయడం ) ఒక్కొక అడుగుకి కుటుంబం బంధుత్వం నుంచి కలిసేలా పాట...ఇది కదా బంజారా సంస్కృతి అంటే...( హమ్ సింధూ నంగారిర్ గోర్ ఛా )... *కోరి క్వారుర్ కల్చర్ ఛొడో ( గోర్ ధాటి జీవత్ రకాడో
Ramprasad islavath
*సాత్ ఫెరా ఫర్థువణా, ( బంజారా సంస్కృతి సాంప్రదాయంలో ఏడ అడుగులు వేయడం ) ఒక్కొక అడుగుకి కుటుంబం బంధుత్వం నుంచి కలిసేలా పాట...ఇది కదా బంజారా సంస్కృతి అంటే...( హమ్ సింధూ నంగారిర్ గోర్ ఛా )... *కోరి క్వారుర్ కల్చర్ ఛొడో ( గోర్ ధాటి జీవత్ రకాడో
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao3
- Post by వేముల నాగరాజు1
- సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది. గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి. 1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- Post by Sode Prasad1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.3
- Post by వేముల నాగరాజు1