కొత్తగూడెం ముందస్తు అడ్మిషన్లు చేసే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి. -కాపాటి పృథ్వి, పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేశారు. పోస్ట్ ఆఫీస్, బస్టాండ్ సెంటర్లో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఏర్పాటుచేసిన హోర్డింగులపై ఫ్లెక్సీలు చింపి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, సీట్ రిజర్వేషన్ పేరుతో తల్లిదండ్రుల నుంచి అక్రమంగా రిజర్వేషన్ ఫీజులు వసూలు చేస్తున్నారని, అడ్మిషన్ ఫీజులు, డొనేషన్ల పేరుతో పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నారని అన్నారు. ప్రైమరీ విద్యకే 20,000 నుండి 8 లక్షల వరకు ఫీజులు వసూళ్లు చేస్తున్నారని, తెలంగాణలో 11 వేల ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఏటా 20–25% ఫీజు పెంచుతున్నారనీ, ప్రైవేట్ పాఠశాలల పిల్లలపై ప్రభుత్వ పాఠశాల కంటే 9 రెట్లు అధిక కుటుంబ వ్యయం వెచ్చించాల్సి వస్తుందని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురుస్తుందని, తిరిగి ఫీజులు చెల్లించలేక ప్రైవేట్ యాజమాన్యాల వేధింపులతో ఒత్తిడులకులోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణలో RTE సెక్షన్ 12(1)(c) ఇంకా అమలు కావట్లేదనీ, 90,311 సీట్లు పేద పిల్లలకు ఇవ్వాల్సి ఉందనీ, రాష్ట్ర భారం కేవలం ₹36 కోట్లు చెల్లించలేక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ముందస్తు అడ్మిషన్లు, అదనపు ఫీజు వసూళ్ళు జరిపిన సంస్థలపై FIR నమోదు చేసి, తిరిగి ఫీజులు వసూళ్లు చేయాలన్నారు. పది, ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడే వరకు ఏ ప్రైవేట్ సంస్థ అడ్మిషన్లు, ఫీజు వసూళ్ళు జరపకూడదని, ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు బుర్ర వీరభద్రం, జిల్లా కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. విప్లవ అభినందనలతో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ బి.వీరభద్రం
కొత్తగూడెం ముందస్తు అడ్మిషన్లు చేసే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి. -కాపాటి పృథ్వి, పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేశారు. పోస్ట్ ఆఫీస్, బస్టాండ్ సెంటర్లో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఏర్పాటుచేసిన హోర్డింగులపై ఫ్లెక్సీలు చింపి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు
నిర్వహిస్తున్నారని, సీట్ రిజర్వేషన్ పేరుతో తల్లిదండ్రుల నుంచి అక్రమంగా రిజర్వేషన్ ఫీజులు వసూలు చేస్తున్నారని, అడ్మిషన్ ఫీజులు, డొనేషన్ల పేరుతో పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నారని అన్నారు. ప్రైమరీ విద్యకే 20,000 నుండి 8 లక్షల వరకు ఫీజులు వసూళ్లు చేస్తున్నారని, తెలంగాణలో 11 వేల ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఏటా 20–25% ఫీజు పెంచుతున్నారనీ, ప్రైవేట్ పాఠశాలల పిల్లలపై ప్రభుత్వ పాఠశాల కంటే 9 రెట్లు అధిక కుటుంబ వ్యయం వెచ్చించాల్సి వస్తుందని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురుస్తుందని, తిరిగి ఫీజులు చెల్లించలేక ప్రైవేట్ యాజమాన్యాల వేధింపులతో ఒత్తిడులకులోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణలో RTE సెక్షన్ 12(1)(c) ఇంకా అమలు
కావట్లేదనీ, 90,311 సీట్లు పేద పిల్లలకు ఇవ్వాల్సి ఉందనీ, రాష్ట్ర భారం కేవలం ₹36 కోట్లు చెల్లించలేక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ముందస్తు అడ్మిషన్లు, అదనపు ఫీజు వసూళ్ళు జరిపిన సంస్థలపై FIR నమోదు చేసి, తిరిగి ఫీజులు వసూళ్లు చేయాలన్నారు. పది, ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడే వరకు ఏ ప్రైవేట్ సంస్థ అడ్మిషన్లు, ఫీజు వసూళ్ళు జరపకూడదని, ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు బుర్ర వీరభద్రం, జిల్లా కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. విప్లవ అభినందనలతో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ బి.వీరభద్రం
- Post by V Ramarao3
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు1
- Post by Sode Prasad1
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది. ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.1
- పొన్నూరు: ప్రేమ జంటకు రక్షణ కల్పించిన పోలీసులు పొన్నూరుకు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అనే భయంతో మార్చి 28వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి మిస్సింగ్పై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వటంతో పోలీసులు వీరిని పిలిపించారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.2
- Post by V Ramarao4