మొక్క నాటడం కాదు.. మొక్కను బతికించడమే లక్ష్యం! పచ్చదనం పెంపుతోనే పర్యావరణ సమతుల్యత.. ప్రతి మొక్క సంరక్షణకు ప్రజలు బాధ్యత తీసుకోవాలి: మంత్రి తుమ్మల స్తంభాద్రి ప్రకృతి వనంలో వన మహోత్సవం.. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం వి.ఆర్.కె. వెంకట్రాజు కేశిరాజు ఖమ్మం, ఆగస్టు 25 మొక్కలు నాటడం ఒక్కటే వన మహోత్సవం కాదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి అది బలమైన వృక్షంగా ఎదిగేలా చూడటమే అసలైన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ సమతుల్యత మెరుగుపడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందుతుందని పేర్కొన్నారు. నాటిన మొక్క ప్రతి ఒక్కరి బాధ్యత స్తంభాద్రి ప్రకృతి వనం (వెలుగుమట్ల అర్బన్ పార్క్)లో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వన మహోత్సవాల్లో మొక్కలు నాటడంపై చూపుతున్న శ్రద్ధను వాటి మనుగడ, సంరక్షణపైనా చూపాలని సూచించారు. మొక్క నాటిన ప్రతి ఒక్కరూ దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణపై అప్రమత్తత అవసరం అడవుల నరికివేత, పచ్చదనం తగ్గిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని మంత్రి తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా, గోదావరి, మున్నేరు నదుల్లో ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. భవిష్యత్‌లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జల వనరుల పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి.. పర్యావరణం రెండూ సమానమే ప్రజలకు తాగునీరు, రహదారులు, విద్యుత్, మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అన్నారు. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతుందని, వర్షపాతం కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పిల్లలకు ప్రకృతి పరిచయం చేయాలి ఖమ్మం నగరానికి స్తంభాద్రి ప్రకృతి వనం వంటి పచ్చని ప్రాంతాలు ఉండటం అదృష్టమని మంత్రి అన్నారు. పిల్లలను ఇలాంటి ప్రకృతి వనాలకు తీసుకువచ్చి వివిధ రకాల చెట్లు, వాటి ప్రాధాన్యత, ఉపయోగాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుత తరంలో అనేక రకాల చెట్లను గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోందని, చిన్ననాటి నుంచే పిల్లలకు ప్రకృతి, పర్యావరణంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పచ్చని పరిసరాలే ఆరోగ్యానికి పునాది ప్రజల ఆరోగ్యానికి పరిశుభ్రమైన, పచ్చని పరిసరాలు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణం ఆరోగ్యకరంగా లేకపోతే ఎంత సంపద ఉన్నా దాని ప్రయోజనం పరిమితమేనన్నారు. వన మహోత్సవ సమయంలో మాత్రమే మొక్కలు నాటకుండా, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అలవాటుగా మారాలని పిలుపునిచ్చారు. స్తంభాద్రి ప్రకృతి వనానికి మరింత అభివృద్ధి వెలుగుమట్ల అర్బన్ పార్కును పిల్లలు, వృద్ధులు, వాకర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకరమైన రిక్రియేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. అంతకుముందు వెలుగుమట్ల పార్కును ‘స్తంభాద్రి ప్రకృతి వనం’గా నామకరణం చేసి, లోగోను మంత్రి ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ అందించిన బ్యాటరీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వృక్షప్రసాదాలను పంపిణీ చేశారు. భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వం ప్రస్తుతం మనం చేస్తున్న పనులు భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతాయని మంత్రి అన్నారు. వారికి మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వంతో పాటు ప్రజలందరి బాధ్యత అని, సమిష్టి కృషితోనే పచ్చని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మొక్క నాటడం కాదు.. మొక్కను బతికించడమే లక్ష్యం! పచ్చదనం పెంపుతోనే పర్యావరణ సమతుల్యత.. ప్రతి మొక్క సంరక్షణకు ప్రజలు బాధ్యత తీసుకోవాలి: మంత్రి తుమ్మల స్తంభాద్రి ప్రకృతి వనంలో వన మహోత్సవం.. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం వి.ఆర్.కె. వెంకట్రాజు కేశిరాజు ఖమ్మం, ఆగస్టు 25 మొక్కలు నాటడం ఒక్కటే వన మహోత్సవం కాదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి అది బలమైన వృక్షంగా ఎదిగేలా చూడటమే అసలైన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ సమతుల్యత మెరుగుపడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందుతుందని పేర్కొన్నారు. నాటిన మొక్క ప్రతి ఒక్కరి బాధ్యత స్తంభాద్రి ప్రకృతి వనం (వెలుగుమట్ల అర్బన్ పార్క్)లో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వన మహోత్సవాల్లో
మొక్కలు నాటడంపై చూపుతున్న శ్రద్ధను వాటి మనుగడ, సంరక్షణపైనా చూపాలని సూచించారు. మొక్క నాటిన ప్రతి ఒక్కరూ దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణపై అప్రమత్తత అవసరం అడవుల నరికివేత, పచ్చదనం తగ్గిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని మంత్రి తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా, గోదావరి, మున్నేరు నదుల్లో ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. భవిష్యత్‌లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జల వనరుల పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి.. పర్యావరణం రెండూ సమానమే ప్రజలకు తాగునీరు, రహదారులు, విద్యుత్, మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అన్నారు. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతుందని, వర్షపాతం కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. పట్టణ
ప్రాంతాల్లో ప్రజలు విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పిల్లలకు ప్రకృతి పరిచయం చేయాలి ఖమ్మం నగరానికి స్తంభాద్రి ప్రకృతి వనం వంటి పచ్చని ప్రాంతాలు ఉండటం అదృష్టమని మంత్రి అన్నారు. పిల్లలను ఇలాంటి ప్రకృతి వనాలకు తీసుకువచ్చి వివిధ రకాల చెట్లు, వాటి ప్రాధాన్యత, ఉపయోగాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుత తరంలో అనేక రకాల చెట్లను గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోందని, చిన్ననాటి నుంచే పిల్లలకు ప్రకృతి, పర్యావరణంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పచ్చని పరిసరాలే ఆరోగ్యానికి పునాది ప్రజల ఆరోగ్యానికి పరిశుభ్రమైన, పచ్చని పరిసరాలు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణం ఆరోగ్యకరంగా లేకపోతే ఎంత సంపద ఉన్నా దాని ప్రయోజనం పరిమితమేనన్నారు. వన మహోత్సవ సమయంలో మాత్రమే మొక్కలు నాటకుండా, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అలవాటుగా మారాలని పిలుపునిచ్చారు. స్తంభాద్రి ప్రకృతి వనానికి మరింత అభివృద్ధి వెలుగుమట్ల అర్బన్ పార్కును పిల్లలు, వృద్ధులు, వాకర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకరమైన
రిక్రియేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. అంతకుముందు వెలుగుమట్ల పార్కును ‘స్తంభాద్రి ప్రకృతి వనం’గా నామకరణం చేసి, లోగోను మంత్రి ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ అందించిన బ్యాటరీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వృక్షప్రసాదాలను పంపిణీ చేశారు. భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వం ప్రస్తుతం మనం చేస్తున్న పనులు భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతాయని మంత్రి అన్నారు. వారికి మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వంతో పాటు ప్రజలందరి బాధ్యత అని, సమిష్టి కృషితోనే పచ్చని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పాదయాత్రకు భారీ సంఘీభావం | కారేపల్లిలో ప్రజా సంఘాల మద్దతు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకు కారేపల్లిలో అడుగడుగునా సంఘీభావం లభించింది. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను మొదలుపెట్టారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, అంబేద్కర్ యువజన సంఘం, ఆటో యూనియన్ తదితర సంఘాల నాయకులు పాదయాత్రలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో ఇస్తాం.. ఇదిగో చేస్తాం అంటూ హామీలు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల కనీస అవసరమైన సొంత ఇంటి స్థలం సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు... పెరిగిన పత్తి ధర ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,975, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.25, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి మాత్రం రూ.200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.1
- పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తహశీల్దార్ రాంప్రసాద్ ఆకాంక్షించారు. నేలకొండపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు.1
- హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.1
- సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..1
- **విద్యార్థులలో విద్య సామర్థ్యాలను పెంపొందించాలి*** *- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. *- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. *- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. *- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్. విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.2
- తిరుమలాయపాలెం ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.1