ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థి నాయకత్వ ఎన్నికలు ప్రజా ముద్ర న్యూస్ ప్రతి నిది నిర్మల్ : అక్టోబర్ 15: (ప్రజా ముద్ర న్యూస్) నిర్మల్ జిల్లా లోని రత్నపూర్ కాండ్లి గ్రామం లో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యార్థి నాయకత్వ ఎన్నికలను నిర్మల్ జిల్లా కేంద్రం లోని రత్నపూర్ కాoడ్లీ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్య క్రమంలో ఎలక్షన్ రిటర్నింగ్ అధికారిగా వసంత బాధ్యతలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఎన్నికలలో పోటీకి నిలబడి ,నిజమైన నాయకుల మాదిరిగానే ప్రచారాలు, వాగ్దానాలు, చేసి పోటీపడ్డారు . పాఠశాల హెడ్ బాయ్ గా అరుణ్, మరియు భీమేష్ పోటీచేయగా అరుణ్ 69 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. అలాగే హెడ్ గర్ల్ గా లక్ష్మీ ,మరియు అఖిల పోటీపడగా లక్ష్మీ 74 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. మరియు పాఠశాల అసిస్టెంట్ బాయ్ గా నర్సయ్యా, మరియు జశ్వంత్ పోటీపడగా జశ్వంత్ 62 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది.మరియు పాఠశాల అసిస్టెంట్ గర్ల్ గా గీతిక, ప్రగతి లు పోటీ పడగా ప్రగతి 63 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ కార్య క్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయ స్వప్న మాట్లాడుతూ పాఠశాల దశ నుండి పిల్లల యందు , నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందేలా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని చెప్పడం జరిగింది. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విజయ స్వప్న, మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, అనిత, వసంత, శ్యామల, అరుణ దేవి, గంగాధర్, రాజేశ్వర్, వెన్నెల, నవ్య మరియు పాఠశాల పిల్లలు పాల్గొని ఈ కార్య క్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ తర్వాత పోటీలో గెలుపొందిన విద్యార్థుల తో ప్రమాణ స్వీకారం చేపించి కార్య క్రమాన్ని విజయ వంతం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థి నాయకత్వ ఎన్నికలు ప్రజా ముద్ర న్యూస్ ప్రతి నిది నిర్మల్ : అక్టోబర్ 15: (ప్రజా ముద్ర న్యూస్) నిర్మల్ జిల్లా లోని రత్నపూర్ కాండ్లి గ్రామం లో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యార్థి నాయకత్వ ఎన్నికలను నిర్మల్ జిల్లా కేంద్రం లోని రత్నపూర్ కాoడ్లీ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్య
క్రమంలో ఎలక్షన్ రిటర్నింగ్ అధికారిగా వసంత బాధ్యతలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఎన్నికలలో పోటీకి నిలబడి ,నిజమైన నాయకుల మాదిరిగానే ప్రచారాలు, వాగ్దానాలు, చేసి పోటీపడ్డారు . పాఠశాల హెడ్ బాయ్ గా అరుణ్, మరియు భీమేష్ పోటీచేయగా అరుణ్ 69 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. అలాగే హెడ్ గర్ల్ గా లక్ష్మీ ,మరియు అఖిల పోటీపడగా లక్ష్మీ 74 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. మరియు పాఠశాల అసిస్టెంట్
బాయ్ గా నర్సయ్యా, మరియు జశ్వంత్ పోటీపడగా జశ్వంత్ 62 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది.మరియు పాఠశాల అసిస్టెంట్ గర్ల్ గా గీతిక, ప్రగతి లు పోటీ పడగా ప్రగతి 63 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ కార్య క్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయ స్వప్న మాట్లాడుతూ పాఠశాల దశ నుండి పిల్లల యందు , నాయకత్వ లక్షణాలు అభివృద్ధి
చెందేలా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని చెప్పడం జరిగింది. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విజయ స్వప్న, మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, అనిత, వసంత, శ్యామల, అరుణ దేవి, గంగాధర్, రాజేశ్వర్, వెన్నెల, నవ్య మరియు పాఠశాల పిల్లలు పాల్గొని ఈ కార్య క్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ తర్వాత పోటీలో గెలుపొందిన విద్యార్థుల తో ప్రమాణ స్వీకారం చేపించి కార్య క్రమాన్ని విజయ వంతం చేశారు.
- Post by Ravi Poreddy1
- నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......2
- నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by KLakshmi Devi2