Shuru
Apke Nagar Ki App…
నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
Dr.Gangu Manmadharao
నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రత్తిపాడుకి, పులికి మధ్య విడదీయలేని సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022లో ఏలేశ్వరం, రౌతులపూడి ప్రాంతాల్లో నెలల తరబడి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన పులి.. అధికారుల ప్రయత్నాలు ఫలించకుండానే దానంతట అదే వెళ్లిపోయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం మళ్లీ ఇంకో పులి ప్రత్తిపాడులోనే మకాం వేయడం, పట్టుబడకపోవడంతో అప్పటిలాగే ఇది కూడా అదే వెళ్లిపోతుందా అని అప్పటి జ్ఞపకాలను నెమరువేసుకుంటున్నారు.1
- వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు4
- Post by Naresh Koppula4
- baryal ground ఇబ్బంది పడుతున్నాము3
- మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- Post by వేముల నాగరాజు4
- గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, గురుకులాలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శనివారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 56, వసతిగృహాలు 21, గురుకులాలు 12, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 92 ఇన్స్టిట్యూషన్లలో 3628 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1689 బాలికలు 1939 కలిపి 3628 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.1
- Post by Naresh Koppula3
- Post by వేముల నాగరాజు1