పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించిన ఐటీడీఏ పీవో రాహుల్ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, గురుకులాలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శనివారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 56, వసతిగృహాలు 21, గురుకులాలు 12, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 92 ఇన్స్టిట్యూషన్లలో 3628 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1689 బాలికలు 1939 కలిపి 3628 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.

- వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు4
- Post by Naresh Koppula5
- మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, బుర్కా వంశీయుల ఇలవేలుపు అయిన గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘చిట్టి పండుగ’గా పిలువబడే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా బుర్కా వంశీయుల ఆచారాల ప్రకారం ఈ జాతర మూడు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో కిష్టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆదివాసీలు తమ ఇలవేలుపును కొలుస్తున్నారు. ముసలమ్మ పెద్ద కుమారుడిని దర్శించుకుని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. పూజారులు (వడ్డేలు) అత్యంత నిష్టతో పురాతన పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు తరలివచ్చారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో పాటు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ననిలుస్తున్నాయి అడవి తల్లి ఒడిలో, ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ జాతరతో కృష్ణపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.1
- హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.1
- హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు విచ్చేసి.తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం యజమాన్యం మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజును శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం షోరూం లో నిర్వహించిన ఫ్యాషన్ షో ను తిలకించిన. మంత్రి ఎమ్మెల్యే లు జోయలుక్కస్ గోల్డ్ షోరూం నిర్వాహకులకు మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జోయలుక్కస్ యజమాన్యం సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by వేముల నాగరాజు4
- వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.1
- గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, గురుకులాలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శనివారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 56, వసతిగృహాలు 21, గురుకులాలు 12, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 92 ఇన్స్టిట్యూషన్లలో 3628 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1689 బాలికలు 1939 కలిపి 3628 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.1