రూ.16.10 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీత పనులకు శ్రీకారం – సుందరీకరణతో జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి లక్ష్యం హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
రూ.16.10 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీత పనులకు శ్రీకారం – సుందరీకరణతో జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి లక్ష్యం హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
- హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.1
- హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు విచ్చేసి.తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం యజమాన్యం మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజును శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం షోరూం లో నిర్వహించిన ఫ్యాషన్ షో ను తిలకించిన. మంత్రి ఎమ్మెల్యే లు జోయలుక్కస్ గోల్డ్ షోరూం నిర్వాహకులకు మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జోయలుక్కస్ యజమాన్యం సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.1
- వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు4
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపి వైద్యుడిపై దాడి చేసి కళ్ళలో కారం చల్లి చైన్ స్నాచింగ్ పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన మైనర్ బాలుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిని కరీంనగర్ లో సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మనవేని కొమురయ్య ఆర్‌ఎంపిగా పనిచేస్తున్నారు. అతనిపై ఈనెల 11న రాత్రి దారి దోపిడికి పాల్పడిన ముఠాను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడితో పాటు గుండ్లపల్లికి చెందిన పెనుగొండ అబినైజర్, పంబాల నాగరాజు, నుస్తులాపూర్ కు చెందిన మాచర్ల రామ్ చరణ్ గౌడ్, పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన గుజ్జేటి మధువర్ధన్ ఐదుగురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీకి సంబంధించి యజమానికి చెల్లించాల్సిన 40 వేల కోసం దొంగతనానికి పథకం వేశారు. ఒంటరిగా తిరిగే ఆర్ఎంపి కొమురయ్య మెడలోని బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకుని 11న కరీంనగర్‌లో ఒక స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని మాటు వేశారు. నేదునూర్ నుండి తన మోటార్ సైకిల్‌పై ఆర్ఎంపీ వస్తుండగా, నిందితులు కారులో వెంబడించారు. నేదునూర్ శివారులోని మామిడి తోట వద్ద అతడిని అడ్డుకుని, కళ్ళలో కారం చల్లి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, 1,000/-నగదు దోచుకుని పరారయ్యారు. దారి దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ దర్యాప్తు చేపట్టి మైనర్ బాలుడితో పాటు అబినైజర్, నాగరాజు, రామ్ చరణ్ గౌడ్, గుజ్జేటి మధువర్ధన్ ను అరెస్టు చేశామని సిపి తెలిపారు. ముఠా సభ్యులు కోహెడ మండలంలో ఒక కరెంటు మోటారు దొంగతనం చేసినట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక తులం బంగారు గొలుసు, 4 మొబైల్ ఫోన్లు, 1,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు.3
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.1
- *నల్లగొండ జిల్లా :-* • మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. • భూగర్భ జలాలు అడుగంటంతో ట్యాంకర్ల ద్వారా రైతులు ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులు *ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్ :-* • అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి. • బ్రాహ్మణ వెళ్ళాముల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. • ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళాముల ప్రాజెక్టు నుండి కిష్టాపురం వరకు కాల్వ పొడగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలి • నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గనికి కొలమానం లేకుండా నీరు తరలించడం అన్యాయం. • పంటలు ఎండిన రైతు ఎకరాకి 40 వేల నష్టపరిహారం ఇవ్వాలి. • ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే బాధ నేను స్వయాన అనుభవించిన. • మునుగోడు మండలంలోని కలువల పల్లి,పులిపలుపుల చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. • బోరు బావుల పై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు.1
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.1