logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమరావతిలో మందుబాబు హంగామా... భయాందోళన చెందిన వాహనదారులు. అమరావతిలోని సత్తెనపల్లి రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుకు అటుఇటు తిరుగుతూ, వెళ్లే వాహనాల ముందు డాన్సులు వేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇతని విన్యాసాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. సంబంధిత పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

5 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

అమరావతిలో మందుబాబు హంగామా... భయాందోళన చెందిన వాహనదారులు. అమరావతిలోని సత్తెనపల్లి రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుకు అటుఇటు తిరుగుతూ, వెళ్లే వాహనాల ముందు డాన్సులు వేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇతని విన్యాసాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. సంబంధిత పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రాతిశిల విరిగిపడి గాయాలైన సమ్మక్క పూజారి సిద్ధబోయిన రమేష్-స్వప్న దంపతుల కుమారుడు యువాన్ జన్మదినాన్ని ఆదివారం హన్మకొండ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క కేక్ కట్ చేసి బాలుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం నింపుతూ అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
    1
    ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రాతిశిల విరిగిపడి గాయాలైన సమ్మక్క పూజారి సిద్ధబోయిన రమేష్-స్వప్న దంపతుల కుమారుడు యువాన్ జన్మదినాన్ని ఆదివారం హన్మకొండ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క కేక్ కట్ చేసి బాలుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం నింపుతూ అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • Post by Sode Prasad
    2
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పిఠాపురం పట్టణం డైవర్స్ కాలనీలో శ్రీ రామాలయం నందు శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు మార్నిడి రంగబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పిఠాపురం పట్టణం మాజీ ఎమ్మెల్యే టిడిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్విఎస్ఎన్.వర్మ, మాజీ ఎంపీ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ వంగా గీత విశ్వనాథ్,జనసేన పార్టీ ఇంచార్జ్ చిక్కాల వరలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ దేవు సత్తిబాబు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, దిన దిన అభివృద్ధి చెందుతున్న పిఠాపురం నియోజకవర్గంనీ టెంపుల్ టూరిజంగా మార్చడం జరుగుతుందని అనేక ఆలయాల నిర్మాణం మరియు విగ్రహాల శంకుస్థాపనలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి సనాతన ధర్మాన్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వేద వచనాలతో ఆశీర్వాదాలు తీసుకొనడం జరిగింది. భారీ ఎత్తున ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,అడపా రఘు,జనసేన నాయకులు పట్టణ వైస్ ఇంచార్జ్ బాలిపల్లి అనిల్,చెల్లిబోయిన సతీష్,హాస్పిటల్ అభ్యర్థి కమిటీ డైరెక్టర్ బొజ్జ కుమార్,బొజ్జ లోవరాజు,అడ్వకేట్ రమణారావు,వనం వీరబాబు,గణేష్, కీర్తి దొరబాబు,ఎల్.రామకృష్ణ, కృష్ణార్జున,ఎస్.బాలు,జి.రాజా, కూటమి నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    పిఠాపురం పట్టణం డైవర్స్ కాలనీలో శ్రీ రామాలయం నందు శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు మార్నిడి రంగబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పిఠాపురం పట్టణం  మాజీ ఎమ్మెల్యే టిడిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్విఎస్ఎన్.వర్మ, మాజీ ఎంపీ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ వంగా గీత విశ్వనాథ్,జనసేన పార్టీ ఇంచార్జ్  చిక్కాల వరలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ దేవు సత్తిబాబు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, దిన దిన అభివృద్ధి చెందుతున్న పిఠాపురం నియోజకవర్గంనీ టెంపుల్ టూరిజంగా మార్చడం జరుగుతుందని అనేక ఆలయాల నిర్మాణం మరియు విగ్రహాల శంకుస్థాపనలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి సనాతన ధర్మాన్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వేద వచనాలతో ఆశీర్వాదాలు తీసుకొనడం జరిగింది. భారీ ఎత్తున ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,అడపా రఘు,జనసేన నాయకులు పట్టణ వైస్ ఇంచార్జ్ బాలిపల్లి అనిల్,చెల్లిబోయిన సతీష్,హాస్పిటల్ అభ్యర్థి కమిటీ డైరెక్టర్ బొజ్జ కుమార్,బొజ్జ లోవరాజు,అడ్వకేట్ రమణారావు,వనం వీరబాబు,గణేష్, కీర్తి దొరబాబు,ఎల్.రామకృష్ణ, కృష్ణార్జున,ఎస్.బాలు,జి.రాజా, కూటమి నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    11 hrs ago
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    1
    మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent Nagarkurnool, Telangana•
    11 hrs ago
  • హుస్నాబాద్ మండలం పందిల్ల జాతీయ రహదారి గుండ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో తాటి ముంజలు విక్రయిస్తున్న వారి దగ్గరికి వెళ్లి స్వయంగా వారి కోసుకొని తిన్నారు. ఈ క్రమంలో పలువురికి తాటి ముంజలు అందించారు.వేసవికాలం లో చల్లదనంగా ఆరోగ్యానికి ఉపయోగపడే న్యాచురల్ తాటి ముంజలు వేసవి తాపాన్ని తగ్గించి, ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయన్నారు.
    1
    హుస్నాబాద్ మండలం పందిల్ల జాతీయ రహదారి గుండ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో  తాటి ముంజలు విక్రయిస్తున్న వారి దగ్గరికి వెళ్లి స్వయంగా వారి కోసుకొని తిన్నారు. ఈ క్రమంలో పలువురికి తాటి ముంజలు అందించారు.వేసవికాలం లో చల్లదనంగా ఆరోగ్యానికి ఉపయోగపడే న్యాచురల్ తాటి ముంజలు వేసవి తాపాన్ని తగ్గించి, ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • Breaking US IRAN Islamabad Talks fail If no Deal War Remain a question US delegation leaves Pakistan without reaching Iran deal Vance says no deal reached, US has made ‘best, final offer’ US ‘looking for excuse’ to leave talks. IRAN
    1
    Breaking 
US IRAN  Islamabad Talks fail
If no Deal War Remain a question 
US delegation leaves Pakistan without reaching Iran deal
Vance says no deal reached, US has made ‘best, final offer’
US ‘looking for excuse’ to leave talks. IRAN
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • సత్తనపల్లి: హోంగార్డు శ్రీధర్ కు డిఎస్పి రివార్డు నగదు ఆదివారం అందించారు. ఇటీవల పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో అధికారులతో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు డిఎస్పి ప్రోత్సాహంగా రివార్డు నగదును అందించారు. డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకోవటం ఆనందదాయకంగా ఉందని శ్రీధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ ఎస్ ఐ గిరిబాబు రవిబాబు పాల్గొన్నారు.
    1
    సత్తనపల్లి: హోంగార్డు శ్రీధర్ కు డిఎస్పి రివార్డు నగదు ఆదివారం అందించారు. ఇటీవల పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో అధికారులతో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు డిఎస్పి ప్రోత్సాహంగా రివార్డు నగదును అందించారు. డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకోవటం ఆనందదాయకంగా ఉందని శ్రీధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ ఎస్ ఐ గిరిబాబు రవిబాబు పాల్గొన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో యువతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన యువతి మృతితో ఆగ్రహించిన వారు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో యువతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన యువతి మృతితో ఆగ్రహించిన వారు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    15 hrs ago
  • నాగర్ కర్నూలు కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలోని 460 పంచాయతీల్లో పనుల పర్యవేక్షణకు 'నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్' (NMMS) యాప్‌ను విధిగా వాడాలని ఆదేశించారు. కూలీల హాజరును ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని, 'యుక్తదార' సాఫ్ట్‌వేర్ ద్వారా కొత్త పనులను గుర్తించి అంచనాలు రూపొందించాలని సూచించారు. ఈ pకార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, హెచ్ఆర్ మేనేజర్ ఆనంద్ కుమార్ టెక్నికల్ డిఆర్పి రవిరాజా సిటీ రాజేష్ కుమార్ జీవన్ ప్రకాష్ ఆసిఫ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    1
    నాగర్ కర్నూలు కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలోని 460 పంచాయతీల్లో పనుల పర్యవేక్షణకు 'నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్' (NMMS) యాప్‌ను విధిగా వాడాలని ఆదేశించారు. కూలీల హాజరును ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని, 'యుక్తదార' సాఫ్ట్‌వేర్ ద్వారా కొత్త పనులను గుర్తించి అంచనాలు రూపొందించాలని సూచించారు. ఈ pకార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, హెచ్ఆర్ మేనేజర్ ఆనంద్ కుమార్ టెక్నికల్ డిఆర్పి రవిరాజా సిటీ రాజేష్ కుమార్ జీవన్ ప్రకాష్ ఆసిఫ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent Nagarkurnool, Telangana•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.