logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ శుక్రవారం కొత్తగూడ మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు . అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి గట్టి సుగుణ లతో మాట్లాడి గృహాలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు గాంధీనగర్ లోని గిరిజన బాలికల గురుకులమును పరిశీలించి విద్యార్థిని విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు అనంతరం వారితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు మహబూబాబాద్ జిల్లా జూలై 31: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టు వైవిధ్యం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట మార్పిడి విధానం ద్వారా రైతులు బానోతు బిచ్చ బానోతు సుమన్ పంట పొలంలో పెసర్లు విత్తనాలు చల్లుతున్న రైతులతో స్వయంగా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఆర్దిక ఇబ్బందులు కలగకుండా వరి మక్క జొన్న పత్తి మిర్చి లే కాకుండా ఇతర పంట లు ఆయిల్ పామ్ కందులు పెసర్లు వేరుశ నగ లెమన్ గ్రాస్ తదితర లాభదాయ కమైనటువంటి పంటలు వేయుటకు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రైతులు ప్రతి ఒక్కరూ పంట మార్పిడి విధానం ద్వారా కూరగాయలు పూలు పండ్ల పంటలు సాగు చేయాలని అందుకోసం అధిక మార్కెట్ ఉంటుందని తెలిపారు అలాగే ప్రతి రైతు తమ పొలంలో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా భూగర్భ జలాలు అధికంగా ఉత్పత్తి అవుతాయని తెలిపారు ఈ పథకం అమలు కోసం విబిజి రామ్ పథకం ద్వారా సబ్సిడీ అందించడం జరుగుతుందని రైతులకు తెలిపారు అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతున్న ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్వయం సహాయక బృందాల చేత ఆర్థిక సహాయం అందించాలని ఇప్పటికే ప్రైవేటు సంస్థ ద్వారా గృహాల నిర్మాణం కోసం ఒప్పందాలకు విరుచుకొని నిర్మాణాలు కొనసాగుతున్నాయని మంజురాయి వివిధ దశలో ఉన్న డబ్బులను వెంటనే అందరికీ ఇవ్వాలని అర్హులైన వారికి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అట్టి పథకాన్ని కచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు అనంతరం గిరిజన గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థిని విద్యార్థులతో స్వయం గా మాట్లాడి వారి వివరాలు ఆశయాలను అభిప్రాయాలను అడిగి తెలుసుకుని భవి ష్యత్తు ప్రణాళికలు ద్వారా ముందుకు సాగా లని విద్యార్థులకు సూచించారు విద్యార్థు లకు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఇంగ్లీష్ తో పాటు అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యత సాధించే విధంగా తరగతులు నిర్వహించాలని పక్క డైట్ మెలో ప్రకారం కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ అందించాలని పిల్లలకు అదే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు మండల కేంద్రంలో ప్రభుత్వంచే నిర్వ హించబడుతున్న మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతుల కు రికార్డుల ప్రకారం యూరియా యాప్ ద్వారా బుక్ చేయాలని ఈపాస్ మిషన్ ద్వారా నే ఎరువులు ఇవ్వాలని ప్రతి రైతుకు బిల్లులు కచ్చితంగా ఇవ్వాలని సూచించారు స్టాక్ ను స్వయంగా తనిఖీ చేశారు అక్రమం గా యూరియా డిఏపి నన్ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికా రి విజయచంద్ర గిరిజన సంక్షేమ శాఖ అధికా రి దేశీ రామ్ నాయక్ ఏ డి ఏ శ్రీనివాసరావు అని విభాగాల సంబంధిత అధికారులు తహసిల్దార్ రాజు ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు

4 hrs ago
user_ఆంగోత్ లక్ష్మణ్
ఆంగోత్ లక్ష్మణ్
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
4 hrs ago
b16de804-33ba-4965-979d-57a441ae5b50

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ శుక్రవారం కొత్తగూడ మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు . అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి గట్టి సుగుణ లతో మాట్లాడి గృహాలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు గాంధీనగర్ లోని గిరిజన బాలికల గురుకులమును పరిశీలించి విద్యార్థిని విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు అనంతరం వారితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు మహబూబాబాద్ జిల్లా జూలై 31: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టు వైవిధ్యం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట మార్పిడి విధానం ద్వారా రైతులు బానోతు బిచ్చ బానోతు సుమన్ పంట పొలంలో పెసర్లు విత్తనాలు చల్లుతున్న రైతులతో స్వయంగా మాట్లాడుతూ

0c798f69-3c1e-4dca-8984-acd517b69ca7

రైతులకు ఎలాంటి ఆర్దిక ఇబ్బందులు కలగకుండా వరి మక్క జొన్న పత్తి మిర్చి లే కాకుండా ఇతర పంట లు ఆయిల్ పామ్ కందులు పెసర్లు వేరుశ నగ లెమన్ గ్రాస్ తదితర లాభదాయ కమైనటువంటి పంటలు వేయుటకు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రైతులు ప్రతి ఒక్కరూ పంట మార్పిడి విధానం ద్వారా కూరగాయలు పూలు పండ్ల పంటలు సాగు చేయాలని అందుకోసం అధిక మార్కెట్ ఉంటుందని తెలిపారు అలాగే ప్రతి రైతు తమ పొలంలో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా భూగర్భ జలాలు అధికంగా ఉత్పత్తి అవుతాయని తెలిపారు ఈ పథకం అమలు కోసం విబిజి రామ్ పథకం ద్వారా సబ్సిడీ అందించడం జరుగుతుందని రైతులకు తెలిపారు అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతున్న ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా

017d44df-780b-429c-b737-8c6fa6e4abdc

స్వయం సహాయక బృందాల చేత ఆర్థిక సహాయం అందించాలని ఇప్పటికే ప్రైవేటు సంస్థ ద్వారా గృహాల నిర్మాణం కోసం ఒప్పందాలకు విరుచుకొని నిర్మాణాలు కొనసాగుతున్నాయని మంజురాయి వివిధ దశలో ఉన్న డబ్బులను వెంటనే అందరికీ ఇవ్వాలని అర్హులైన వారికి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అట్టి పథకాన్ని కచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు అనంతరం గిరిజన గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థిని విద్యార్థులతో స్వయం గా మాట్లాడి వారి వివరాలు ఆశయాలను అభిప్రాయాలను అడిగి తెలుసుకుని భవి ష్యత్తు ప్రణాళికలు ద్వారా ముందుకు సాగా లని విద్యార్థులకు సూచించారు విద్యార్థు లకు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఇంగ్లీష్ తో పాటు అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యత సాధించే విధంగా తరగతులు నిర్వహించాలని పక్క డైట్ మెలో ప్రకారం

3f223ec2-feec-41cf-a021-4564324f9168

కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ అందించాలని పిల్లలకు అదే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు మండల కేంద్రంలో ప్రభుత్వంచే నిర్వ హించబడుతున్న మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతుల కు రికార్డుల ప్రకారం యూరియా యాప్ ద్వారా బుక్ చేయాలని ఈపాస్ మిషన్ ద్వారా నే ఎరువులు ఇవ్వాలని ప్రతి రైతుకు బిల్లులు కచ్చితంగా ఇవ్వాలని సూచించారు స్టాక్ ను స్వయంగా తనిఖీ చేశారు అక్రమం గా యూరియా డిఏపి నన్ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికా రి విజయచంద్ర గిరిజన సంక్షేమ శాఖ అధికా రి దేశీ రామ్ నాయక్ ఏ డి ఏ శ్రీనివాసరావు అని విభాగాల సంబంధిత అధికారులు తహసిల్దార్ రాజు ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • భారతదేశం కర్ణాటక తుమాకూరు జిల్లా : *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* జూలై 31 | షురూ న్యూస్ కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బంగారు నగల దుకాణంలో ఆభరణాలు కనిపించకపోవడంతో మొదట సిబ్బంది దొంగతనం జరిగిందని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేముందు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సీసీటీవీ దృశ్యాల్లో ఓ ఎలుక ఒక్కోసారి ఒక్కో బంగారు ఉంగరం, చిన్న చిన్న ఆభరణాలను నోటితో పట్టుకుని తన బొరియలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సిబ్బంది ఎలుక బొరియను తవ్వి చూడగా అందులో 10 బంగారు ఉంగరాలు, 3 బంగారు చైన్లు సహా సుమారు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు లభించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే ఆభరణాలన్నీ తిరిగి దొరికాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలుకలు మెరిసే వస్తువులు, చిన్న పరిమాణంలో ఉండే వస్తువులను తమ బొరియల్లోకి తీసుకెళ్లే అలవాటు కొన్నిసార్లు చూపుతాయి. అవి వాటి విలువను తెలుసుకుని కాకుండా, సహజ ప్రవృత్తి కారణంగా ఇలా తీసుకెళ్తాయని చెబుతున్నారు. ఈ ఘటన బంగారు దుకాణాల్లో సీసీటీవీ నిఘా ఎంత కీలకమో మరోసారి నిరూపించింది. సీసీటీవీ లేకపోయి ఉంటే ఇది నిజమైన దొంగతనంగా భావించి దర్యాప్తు మరింత క్లిష్టంగా మారేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. *— నిమ్మ నగంటి అనిల్ బాబు* * డోర్నకల్ రిపోర్టర్, షురూ న్యూస్*
    1
    భారతదేశం కర్ణాటక తుమాకూరు జిల్లా : *గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* 

*గోల్డ్ షాపులో చోరీ.. దొంగ ఎవరో తెలిస్తే షాక్! ఎలుక బొరియలో రూ.10 లక్షల బంగారు ఆభరణాలు..* 
జూలై 31 | షురూ న్యూస్ 
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బంగారు నగల దుకాణంలో ఆభరణాలు కనిపించకపోవడంతో మొదట సిబ్బంది దొంగతనం జరిగిందని భావించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేముందు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
సీసీటీవీ దృశ్యాల్లో ఓ ఎలుక ఒక్కోసారి ఒక్కో బంగారు ఉంగరం, చిన్న చిన్న ఆభరణాలను నోటితో పట్టుకుని తన బొరియలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సిబ్బంది ఎలుక బొరియను తవ్వి చూడగా అందులో 10 బంగారు ఉంగరాలు, 3 బంగారు చైన్లు సహా సుమారు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు లభించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
దీంతో పోలీసులు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే ఆభరణాలన్నీ తిరిగి దొరికాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలుకలు మెరిసే వస్తువులు, చిన్న పరిమాణంలో ఉండే వస్తువులను తమ బొరియల్లోకి తీసుకెళ్లే అలవాటు కొన్నిసార్లు చూపుతాయి. అవి వాటి విలువను తెలుసుకుని కాకుండా, సహజ ప్రవృత్తి కారణంగా ఇలా తీసుకెళ్తాయని చెబుతున్నారు.
ఈ ఘటన బంగారు దుకాణాల్లో సీసీటీవీ నిఘా ఎంత కీలకమో మరోసారి నిరూపించింది. సీసీటీవీ లేకపోయి ఉంటే ఇది నిజమైన దొంగతనంగా భావించి దర్యాప్తు మరింత క్లిష్టంగా మారేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
*— నిమ్మ నగంటి అనిల్ బాబు* 
* డోర్నకల్ రిపోర్టర్, షురూ న్యూస్*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం.... రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన కారేపల్లి సిఐ సాగర్.. రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారం తీరున కనిపించేలా తయారు చేస్తారు అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలలో తాకట్టు పెట్టి రుణాలు పొందుతారు ఈ విధంగా ప్రవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడంలో ఈ ముఠా రూటే సపరేటు.. సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... రామ్ చందర్ అనే వ్యక్తి తన ఏజెంట్ అయిన సునీల్ ను ఇల్లందులోని ఒక ముత్తూట్ ఫైనాన్సులో 52 గ్రాముల బంగారం పెట్టించి (390000) ఋణం తీసుకున్నారు దానిని విడిపించేందుకు మరో ప్లాన్ చేశారు... ఈసారి ఏకంగా ఈ నకిలీ బంగారం విడిపించేందుకు హైదరాబాదుకు చెందిన మరో కంపెనీని మోసం చేసే ఎత్తుగడ వేశారు.. అందులో భాగంగా హైదరాబాదులోని మన గోల్డ్ కంపెనీని సంప్రదించి వారి యొక్క ప్రతినిధి ద్వారా 5 లక్షల 80 వేల రూపాయలు సునీల్ తీసుకొని కారేపల్లి మండల సమీపంలో అతని నమ్మించి మోసం చేసి పారిపోయాడు.. దీనితో ఆ సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్టు చేయడoతో ఈ నకిలీ బంగారం విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కారేపల్లి మండలం భాగ్యనగర్ కు చెందిన గుగులోతు సునీల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ చేయగా మరొకరు రామ్ చందర్ ను విలేకరుల సమావేశంలో చూపించారు.. పరారీలో ఉన్న సూర్య తండా కు చెందిన రాకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని కారేపల్లి పోలీసులు తెలిపారు.. నిందితులు అంత సులువుగా నకిలీ బంగారం తనకా పెడుతున్నరూ అంటే దీని వెనుక ఫైనాన్సర్ సంస్థలలో ఉన్న కొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టేముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించుకోవాలని అనుమానాధస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
    1
    రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు....
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం....
రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన కారేపల్లి సిఐ సాగర్..
రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారం తీరున కనిపించేలా తయారు చేస్తారు అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలలో తాకట్టు పెట్టి రుణాలు పొందుతారు ఈ విధంగా ప్రవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడంలో ఈ ముఠా రూటే సపరేటు..
సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... రామ్ చందర్ అనే వ్యక్తి తన ఏజెంట్ అయిన సునీల్ ను ఇల్లందులోని ఒక ముత్తూట్ ఫైనాన్సులో 52 గ్రాముల బంగారం పెట్టించి  (390000) ఋణం తీసుకున్నారు దానిని విడిపించేందుకు మరో ప్లాన్ చేశారు... ఈసారి ఏకంగా ఈ నకిలీ బంగారం విడిపించేందుకు హైదరాబాదుకు చెందిన మరో కంపెనీని మోసం చేసే ఎత్తుగడ వేశారు.. అందులో భాగంగా హైదరాబాదులోని మన గోల్డ్ కంపెనీని సంప్రదించి వారి యొక్క ప్రతినిధి ద్వారా 5 లక్షల 80 వేల రూపాయలు సునీల్ తీసుకొని కారేపల్లి మండల సమీపంలో అతని నమ్మించి మోసం చేసి పారిపోయాడు.. దీనితో ఆ సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు పక్కా ప్రణాళికతో  నిందితులను అరెస్టు చేయడoతో ఈ నకిలీ బంగారం విషయాలు వెలుగులోకి వచ్చాయి..  కారేపల్లి మండలం భాగ్యనగర్ కు చెందిన గుగులోతు సునీల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ చేయగా మరొకరు రామ్ చందర్ ను విలేకరుల సమావేశంలో చూపించారు.. పరారీలో ఉన్న  సూర్య తండా కు చెందిన రాకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని కారేపల్లి పోలీసులు తెలిపారు..
నిందితులు అంత సులువుగా నకిలీ బంగారం తనకా పెడుతున్నరూ అంటే దీని వెనుక  ఫైనాన్సర్ సంస్థలలో ఉన్న కొందరి  ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.
బంగారం తాకట్టు పెట్టేముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించుకోవాలని అనుమానాధస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
    1
    జనసంద్రంగా మారిన నల్లబెల్లి

పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు
 దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది
 కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు
జనసంద్రంగా మారిన నల్లబెల్లి
పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు
దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది
కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
    user_Yakesh Goud Sudagani
    Yakesh Goud Sudagani
    పెద్దవంగర, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు.. నల్లబెల్లిలో జనసంద్రం వరంగల్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవుతున్నారు.
    2
    పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు.. నల్లబెల్లిలో జనసంద్రం
వరంగల్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది.
కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవుతున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
    1
    ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం: 10 శాతం లేనోడు 10 శాతం రిజర్వేషన్ ఇలా తీసుకుంటున్నాడు..??? మా లొల్లి అంతా EWS రిజర్వేషన్ పైనే.... 10 శాతం లేనోడు 10 శాతం రిజర్వేషన్ ఇలా తీసుకుంటున్నాడు..??? 56 శాతం ఉన్న బీసీలకు 27 శాతమే ఎందుకు..?? ఇదే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ లడాయి
    1
    మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం: 10 శాతం లేనోడు 10 శాతం రిజర్వేషన్ ఇలా తీసుకుంటున్నాడు..???
మా లొల్లి అంతా EWS రిజర్వేషన్ పైనే....
10 శాతం లేనోడు 10 శాతం రిజర్వేషన్ ఇలా తీసుకుంటున్నాడు..???
56 శాతం ఉన్న బీసీలకు 27 శాతమే ఎందుకు..??
ఇదే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ లడాయి
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • కొత్తగూడెంలో వైభవంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం.. ఆషాఢ మాస బోనాల సమర్పణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...... స్లగ్: కొత్తగూడెంలో వైభవంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం.. యాంకర్ వాయిస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు, డోలు కళాబృందాలు, స్థానిక శివసత్తుల పూనకాలు, కళాకారుల విచిత్ర వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా బూడిదగడ్డ బస్తీలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి ఘనంగా రథోత్సవాన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు, డోలు మేళాలు, స్థానిక శివసత్తుల పూనకాలు, కళాకారుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. ఆలయ ప్రాంగణంలో కళాకారులు తమ సాంప్రదాయ కళా ప్రదర్శనలతో భక్తులను అలరించారు. అనంతరం అమ్మవారి రథోత్సవం పట్టణ ప్రధాన వీధుల గుండా అట్టహాసంగా సాగింది. డప్పు, డోలు వాయిద్యాల నాదం, శివసత్తుల విన్యాసాలు, కళాబృందాల ప్రదర్శనల మధ్య సాగిన ఈ రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 2వ తేదీన చండీ హోమం నిర్వహిస్తారు.
    1
    కొత్తగూడెంలో వైభవంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం.. ఆషాఢ మాస బోనాల సమర్పణ 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా......
స్లగ్: కొత్తగూడెంలో వైభవంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం..
యాంకర్ వాయిస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు, డోలు కళాబృందాలు, స్థానిక శివసత్తుల పూనకాలు, కళాకారుల విచిత్ర వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా బూడిదగడ్డ బస్తీలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి ఘనంగా రథోత్సవాన్ని ప్రారంభించారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు, డోలు మేళాలు, స్థానిక శివసత్తుల పూనకాలు, కళాకారుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. ఆలయ ప్రాంగణంలో కళాకారులు తమ సాంప్రదాయ కళా ప్రదర్శనలతో భక్తులను అలరించారు.
అనంతరం అమ్మవారి రథోత్సవం పట్టణ ప్రధాన వీధుల గుండా అట్టహాసంగా సాగింది. డప్పు, డోలు వాయిద్యాల నాదం, శివసత్తుల విన్యాసాలు, కళాబృందాల ప్రదర్శనల మధ్య సాగిన ఈ  రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 2వ తేదీన చండీ హోమం నిర్వహిస్తారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
  • ఉద్యమ గాయాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానన్న పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్:నర్సంపేట పట్టణంలో 2023లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడటంతో కుడి కన్ను చూపు కోల్పోయానని, లాఠీచార్జీల్లో చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం శరీర నొప్పులతో బాధపడుతూ వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ చేయించుకుంటేనే నడవగలుగుతున్నానని పేర్కొంటూ, తనను అపార్థం చేసుకోవద్దని ప్రజలను కోరారు.
    1
    ఉద్యమ గాయాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానన్న పెద్ది సుదర్శన్ రెడ్డి 
వరంగల్:నర్సంపేట పట్టణంలో 2023లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడటంతో కుడి కన్ను చూపు కోల్పోయానని, లాఠీచార్జీల్లో చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం శరీర నొప్పులతో బాధపడుతూ వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ చేయించుకుంటేనే నడవగలుగుతున్నానని పేర్కొంటూ, తనను అపార్థం చేసుకోవద్దని ప్రజలను కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
    2
    భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక  44 అడుగులకు చేరిన గోదావరి వరద
భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు.
భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.