క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నతస్థానం. -ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. -రాజుపాళెం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఎల్లారెడ్డి. బద్వేలు, ఏప్రిల్ 20:ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత స్థానం లభిస్తుందని రాజుపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఎల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం బద్వేలు మండల పరిధిలోని రాజుపాళెం ఉన్నత పాఠశాల నందు పాఠశాల వార్షికోత్సవ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని, చదువుతోనే ఏదైనా సాధించవచ్చని, మనిషి మనుగడకు చదువు, సంస్కారం ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు వేసవి సెలవులలో సమయాన్ని వ్యర్థం చేయకుండా చదవడం, రాయడంపై దృష్టి పెట్టాలన్నారు. ఒక సైనికుడికి ఆయుధం ఎంత అవసరమో ప్రతి విద్యార్థికి అభ్యసన అనేది అంతే అవసరమని, అభ్యసన ద్వారానే విద్యార్థి ఆయుధం అనే జ్ఞానం, శక్తిని సంపాదిస్తారని పేర్కొన్నారు. అభ్యసన ద్వారానే మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. తద్వారానే జీవితంలో విజయం సునాయసమవుతుందని పేర్కొన్నారు. తెలుగు ఉపాధ్యాయులు మాదన విజయకుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, అందుకు తగ్గట్టుగానే తన ఆలోచన, తపన, కృషి, పట్టుదల ఉండాలన్నారు. విద్యార్థుల అభ్యసన ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. నేటి కాలంలో అవసరానికి మించి వాడుతున్న పరికరం మొబైల్ ఫోన్ అని, ఇది సమయాన్ని వృధా చేయడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత లేకుండా చేస్తుందని, మెదడుపై, కంటి చూపుపై ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే లభిస్తుందని, కార్పొరేట్ మాయాజాలంలో పడి ప్రభుత్వ విద్యా రంగం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చూపకూడదన్నారు. విద్యార్థి సర్వతోన్ముఖాభివృద్ధికి పాటుపడేది ప్రభుత్వ పాఠశాలలేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేస్తే, ఊరి బడి కనుమరుగవుతుందని, తద్వారా పేదలకు విద్య దూరమవుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ బడులలోనే తమ పిల్లలను చేర్పించి ఊరి బడిని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎన్.బాల ఓబన్న, జి.ఆంథోని రావు, పట్టెం వెంకటసుబ్బారెడ్డి, శ్రీకాంత్, సరస్వతి, బి.థామస్, ఎన్.శ్రీధర్ రెడ్డి, ఎల్.వెంకట రెడ్డి, విద్యా కమిటీ చైర్మెన్ కె.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నతస్థానం. -ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. -రాజుపాళెం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఎల్లారెడ్డి. బద్వేలు, ఏప్రిల్ 20:ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత స్థానం లభిస్తుందని రాజుపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఎల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం బద్వేలు మండల పరిధిలోని రాజుపాళెం ఉన్నత పాఠశాల నందు పాఠశాల వార్షికోత్సవ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని, చదువుతోనే ఏదైనా సాధించవచ్చని, మనిషి మనుగడకు చదువు, సంస్కారం ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు వేసవి సెలవులలో సమయాన్ని వ్యర్థం చేయకుండా చదవడం, రాయడంపై దృష్టి పెట్టాలన్నారు. ఒక సైనికుడికి ఆయుధం ఎంత అవసరమో ప్రతి విద్యార్థికి అభ్యసన
అనేది అంతే అవసరమని, అభ్యసన ద్వారానే విద్యార్థి ఆయుధం అనే జ్ఞానం, శక్తిని సంపాదిస్తారని పేర్కొన్నారు. అభ్యసన ద్వారానే మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. తద్వారానే జీవితంలో విజయం సునాయసమవుతుందని పేర్కొన్నారు. తెలుగు ఉపాధ్యాయులు మాదన విజయకుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, అందుకు తగ్గట్టుగానే తన ఆలోచన, తపన, కృషి, పట్టుదల ఉండాలన్నారు. విద్యార్థుల అభ్యసన ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. నేటి కాలంలో అవసరానికి మించి వాడుతున్న పరికరం మొబైల్ ఫోన్ అని, ఇది సమయాన్ని వృధా చేయడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత లేకుండా చేస్తుందని, మెదడుపై, కంటి చూపుపై ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే లభిస్తుందని,
కార్పొరేట్ మాయాజాలంలో పడి ప్రభుత్వ విద్యా రంగం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చూపకూడదన్నారు. విద్యార్థి సర్వతోన్ముఖాభివృద్ధికి పాటుపడేది ప్రభుత్వ పాఠశాలలేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేస్తే, ఊరి బడి కనుమరుగవుతుందని, తద్వారా పేదలకు విద్య దూరమవుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ బడులలోనే తమ పిల్లలను చేర్పించి ఊరి బడిని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎన్.బాల ఓబన్న, జి.ఆంథోని రావు, పట్టెం వెంకటసుబ్బారెడ్డి, శ్రీకాంత్, సరస్వతి, బి.థామస్, ఎన్.శ్రీధర్ రెడ్డి, ఎల్.వెంకట రెడ్డి, విద్యా కమిటీ చైర్మెన్ కె.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- అమరావతి నిర్మాత, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ కటౌట్‌కు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. డ్రోన్ సహాయంతో కటౌట్‌పై పుష్ఫాభిషేకం నిర్వహించారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో లక్ష్మీపురం గ్రామం దద్ధరిల్లింది. చంద్రబాబు నాయుడు అంటే కేవలం పేరు కాదని, అదొక అభివృద్ధి బ్రాండ్ అని నినదించారు. ఈ సందర్భంగా ఆయన అందిస్తున్న సుపరిపాలనను కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలగకుండా చంద్రబాబు నాయుడు పాలన అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్న నవ్యాంధ్ర నిర్మాతకు ప్రజలందరూ అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.4
- బనగానపల్లె మండలం మైన్ ప్రాథమిక పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బడిబాట విశిష్టత హెచ్ఎం మల్లికార్జున రావుకు సన్మానం, విద్యార్థులకు బహుమతులు ప్రధాన ఉత్సవం, అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది, ముందుగా బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిల్లల కోసం మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికాహారం బూట్లు పుస్తకాలు అమ్మ ఒడి రూ. 15000 మొదలగునవి మీకోసం అమలు చేస్తుందని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కృషి చేయాలని బడిబాటి బంగారు బాట అన్నారు. అనంతరం హెచ్ ఎం మల్లికార్జునరావు ఘనంగా సన్మానించి విద్యార్థులకు బహుమతులు అందించారు. హెచ్ఎం మల్లికార్జునరావు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ.. పిల్లలు మా పాఠశాలలో చేర్పించండి చదువు చెప్పడం మా వంతు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు వల్లపు శంకర్, ఉపాధ్యాయులు, మధు కిషోర్, సురేష్, మల్లేశ్వరుడు, మల్లికార్జున , పలుకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.1
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- బద్వేలు :మున్సిపాలిటీ సీనియర్ లీడర్ జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బద్వేలుఆర్డీవో చంద్రమోహన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి .వందలాది మంది కార్యకర్తలతో కోలాహలంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- విడవలూరు వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు కేంద్రంలోని వీపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఆదివారం జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలని మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు వీ పీ ఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ సరఫరా, వీపీఆర్ నేత్ర, వీపీఆర్ విద్య, వైద్యం,దివ్యాంగులకి ట్రై సైకిళ్లు, మహిళలకి కుట్టు మిషన్లు సేవ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేసే మంచి మనసున్న నాయకుడు ఎంపీ వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని వీ పీ ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్చార్జ్ కడపల శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చెముకుల చైతన్య, చెముకుల శ్రీనివాసులు, బెజవాడ గోవర్ధన్ రెడ్డి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు గాంధీ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.4