Shuru
Apke Nagar Ki App…
ఇందాపూర్ గ్రామ పంచాయతీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణం కెరమెరి: కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇందాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును సర్పంచ్ దుర్గం బుచ్చయ్య, మాజీ ఎంపీపీ అబ్దుల్ కలాం, ఉప సర్పంచ్ మొహర్లే మోహన్ ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Munna Khan
ఇందాపూర్ గ్రామ పంచాయతీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణం కెరమెరి: కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇందాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును సర్పంచ్ దుర్గం బుచ్చయ్య, మాజీ ఎంపీపీ అబ్దుల్ కలాం, ఉప సర్పంచ్ మొహర్లే మోహన్ ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Munna Khan1
- తెలంగాణ అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్యారాక్విట్ గడ్డి మందు నిషేధంపై మాట్లాడారు. ఈ మందు అత్యంత విషపూరితమైందని, రైతులు పత్తి చేనుల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు. ప్యారాక్విట్ వాడకం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనికి బదులుగా బ్రష్ కట్టింగ్ వంటి పరికరాలను ఉపయోగించాలని సూచించారు.1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అర్ధరాత్రి భారీ వర్షం దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జన్నారం, పలు గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావతమైంది. ఉరుములు, మెరుపులు భారీ ఈదురుగాళ్లతో వర్షం పడుతోంది. దీంతో చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు అరగంటకు పైగా భారీ ఈదురుగాలులతో వర్షం పడినట్టు సమాచారం అందుతుంది..మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. నష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది.1
- మెట్‌పల్లి మార్చి 30: పట్టణంలోని 26వ వార్డులో భద్రతను బలోపేతం చేసే దిశగా బీజేపీ 26వ వార్డు కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, సీఐ అనిల్, ఎస్సై కిరణ్, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, ఈ సీసీ కెమెరాలు ప్రజలకు అన్నివేళలా నిఘా నేత్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. వీటి ద్వారా చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, దొంగతనాల వంటి ఘటనలను త్వరగా గుర్తించి నిందితులను పట్టుకోవడం పోలీసులకు సులభమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల ఆనంద్, ధర్మపురి స్వరూప, వేణు, నాయకులు బొడ్ల రాహుల్, సుంకేటి విజయ్, సతీష్, బొడ్ల గౌతం, అజిత్, సంజీవ్, అంజయ్య, జెట్టి రూపేష్, శ్రీకాంత్, లత, లక్ష్మి, రాజు, భాయ్, హరితతో పాటు వార్డు ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- రాబోయే రోజుల్లో కరువు దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రాణహిత జలాలను సద్వినియోగం చేసుకునేలా కాలేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో పర్యటించిన జీవన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో శ్రీ సీతారామ స్వామి వారి బ్రహ్మోత్సవములలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాలలో విద్యుత్ అర్టిసన్ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘిభావం తెలిపారు. సారంగాపూర్ లో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి సౌకర్యం మెరుగుపర్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2004 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సారెస్పీ దిగువన కడెం ప్రాజెక్టు నీటిని నిలువరింప చేసే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడడంతో పాటుగా తుమ్మడి హెట్టి నుండి ప్రాణహిత నది జలాలను పొందే విధంగా 152 మీటర్ లెవెల్ లో బ్యారేజ్ నిర్మాణం చేయాలనుకోవడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా కాలువలు కూడా తవ్వకం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి టిఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి 152 లెవెల్ మీటర్స్ తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని 148 మీటర్స్ కుదించే విధంగా దానితో పాటుగా దిగువ 100 మీటర్ల లెవెల్ లో మేడిగడ్డ వద్ద దానికి ప్రతిగా ఇంకో బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి మేడిగడ్డ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని తెలిపారు. దానికి అనుసంధానంగా అన్నారం, సుందిళ్ల వద్ద రెండు బ్యారేజీలు నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించే ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో దానికి మరమ్మత్తులు చేసేందుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం, తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి తగిన ప్రణాళిక రూపొందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందని విమర్శించారు. తుమ్మడిహేట్టి ప్రాణహిత నది జలాల కొరకు 52 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి, కొడంగల్ ఇరిగేషన్ కు 1100 కోట్లు కెటాయించడంతో ఉత్తర తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షత చూపడం కాదా అని ప్రశ్నించారు.3
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం రాజంపేట గ్రామ పంచాయతీలో సోమవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సర్పంచ్ పోచయ్యతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధికి ఈ రోడ్డు పనులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.1