Shuru
Apke Nagar Ki App…
రాజంపేటలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం ................... కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం రాజంపేట గ్రామ పంచాయతీలో సోమవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సర్పంచ్ పోచయ్యతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధికి ఈ రోడ్డు పనులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Krishna
రాజంపేటలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం ................... కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం రాజంపేట గ్రామ పంచాయతీలో సోమవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సర్పంచ్ పోచయ్యతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధికి ఈ రోడ్డు పనులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Munna Khan1
- తెలంగాణ అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్యారాక్విట్ గడ్డి మందు నిషేధంపై మాట్లాడారు. ఈ మందు అత్యంత విషపూరితమైందని, రైతులు పత్తి చేనుల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు. ప్యారాక్విట్ వాడకం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనికి బదులుగా బ్రష్ కట్టింగ్ వంటి పరికరాలను ఉపయోగించాలని సూచించారు.1
- హైదరాబాద్: శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ అండ్ టీ నుండి మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. మెట్రో రైలు స్వాధీనంపై సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం పూర్తయిందని, మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మోస్తా నుండి భారీ వర్షం నమోదవుతుంది. సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం జన్నారంతో పాటు పలు గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. జన్నారం మండలంలో ప్రతిరోజు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది.1
- మెట్‌పల్లి మార్చి 30: పట్టణంలోని 26వ వార్డులో భద్రతను బలోపేతం చేసే దిశగా బీజేపీ 26వ వార్డు కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, సీఐ అనిల్, ఎస్సై కిరణ్, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, ఈ సీసీ కెమెరాలు ప్రజలకు అన్నివేళలా నిఘా నేత్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. వీటి ద్వారా చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, దొంగతనాల వంటి ఘటనలను త్వరగా గుర్తించి నిందితులను పట్టుకోవడం పోలీసులకు సులభమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల ఆనంద్, ధర్మపురి స్వరూప, వేణు, నాయకులు బొడ్ల రాహుల్, సుంకేటి విజయ్, సతీష్, బొడ్ల గౌతం, అజిత్, సంజీవ్, అంజయ్య, జెట్టి రూపేష్, శ్రీకాంత్, లత, లక్ష్మి, రాజు, భాయ్, హరితతో పాటు వార్డు ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు సమీపంలో ప్రధాన రహదారిపై కోరుకంటి శిరీష శ్రీధర్ రావు దంపతులు వినూత్న ఆలోచనతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఇసుకతో అద్భుతమైన శిల్పాల రూపంలో తీర్చిదిద్దుతూ, కేవలం 30 సెకన్లలో చూసే విధంగా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రతి శిల్పం ఒక కథను ప్రతిబింబిస్తూ, భక్తి, సంస్కృతి, కళాత్మకతను కలగలిపి సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈనెల 27 నుండి మే 15 వరకు ఈ ఇసుక విగ్రహాల ప్రదర్శన కొనసాగనుండగా, ఈ అరుదైన కళాఖండాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతున్నారని, సనాతన ధర్మం, రామాయణ ఘట్టాలను తక్కువ సమయంలో అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఇసుక శిల్పాలను రూపొందించినట్లు శిరీష తెలిపారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ తక్కువ సమయంలో రామాయణాన్ని అర్థం చేసుకునేలా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు.4
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం రాజంపేట గ్రామ పంచాయతీలో సోమవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సర్పంచ్ పోచయ్యతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధికి ఈ రోడ్డు పనులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.1