Shuru
Apke Nagar Ki App…
జన్నారం మండలంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షం నమోదు..... జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మోస్తా నుండి భారీ వర్షం నమోదవుతుంది. సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం జన్నారంతో పాటు పలు గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. జన్నారం మండలంలో ప్రతిరోజు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది.
P.G. Murthy
జన్నారం మండలంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షం నమోదు..... జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మోస్తా నుండి భారీ వర్షం నమోదవుతుంది. సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం జన్నారంతో పాటు పలు గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. జన్నారం మండలంలో ప్రతిరోజు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది.
More news from తెలంగాణ and nearby areas
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం రాజంపేట గ్రామ పంచాయతీలో సోమవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సర్పంచ్ పోచయ్యతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధికి ఈ రోడ్డు పనులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.1
- విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.1
- జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో కూరగాయలు కోసే పనిలో ఉన్న కామాటి శ్రీనివాస్ మద్యం మత్తులో చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థులను చీపురితో కొట్టాడు. నిత్యం మద్యం మత్తులో వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చే కామాటి శ్రీనివాస్ విద్యార్థులు రాత్రి పడుకునే సమయంలో చీపురుతో కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తెలిపారు. తాళ్ళధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన కామాటి శ్రీనివాస్, గత నాలుగు నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలుమార్లు హాస్టల్ వార్డెన్ మధుసూదన్ మందలించిన శ్రీనివాస్ లో మార్పు రాలేదని తెలిపారు. చివరకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు పిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సీరియస్ గా స్పందిస్తు విచారణ జరిపి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.3
- Post by Solanke Ravi6
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో వృద్ధురాలు రుక్మవ్వ(73)ను హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో ఆమె రెండో కోడలు కోటవ్వ తలపై బండతో కొట్టింది. దీంతో రుక్మవ్వ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మెడలోని బంగారం, చెవి కమ్మలను కోడలు ఎత్తుకెళ్లింది. మృతురాలు కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్న మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికారుల తీరును కౌన్సిలర్ ఆంజనేయులు విమర్శించారు ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ మహేష్ ఏఈ అధికారులుకౌషన్సిలర్లు తధితరులు పాల్గొన్నారు1
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్లు ఆలస్యంగా అందుతుండటంతో ప్రజలు క్యూల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గ్యాస్ లేక గృహిణులు కట్టెల పొయ్యిలపై వంట చేయాల్సి వస్తుండగా, కూలీలు పనులు వదిలి క్యూలో నిలబడుతున్నారు. కొంత స్టాక్ ఇతర మార్గాల్లో తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి సరఫరా సక్రమంగా నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడిమొక్కులను చెల్లించుకున్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వీధి రౌడీ లా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఆరోపిస్తు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న ప్లెక్సీ ని చెప్పుతో కొడుతు నిరసన తెలిపారు. హుజురాబాద్ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే అనే సోయి మరిచిపోయి విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిచో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.1