జగిత్యాల ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్ లో దారుణం... మద్యం మత్తులో చిన్నారులను చీపురుతో కొట్టిన కామాటి శ్రీనివాస్... విచారణ జరిపి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైన అధికారులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో కూరగాయలు కోసే పనిలో ఉన్న కామాటి శ్రీనివాస్ మద్యం మత్తులో చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థులను చీపురితో కొట్టాడు. నిత్యం మద్యం మత్తులో వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చే కామాటి శ్రీనివాస్ విద్యార్థులు రాత్రి పడుకునే సమయంలో చీపురుతో కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తెలిపారు. తాళ్ళధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన కామాటి శ్రీనివాస్, గత నాలుగు నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలుమార్లు హాస్టల్ వార్డెన్ మధుసూదన్ మందలించిన శ్రీనివాస్ లో మార్పు రాలేదని తెలిపారు. చివరకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు పిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సీరియస్ గా స్పందిస్తు విచారణ జరిపి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జగిత్యాల ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్ లో దారుణం... మద్యం మత్తులో చిన్నారులను చీపురుతో కొట్టిన కామాటి శ్రీనివాస్... విచారణ జరిపి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైన అధికారులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో కూరగాయలు కోసే పనిలో ఉన్న కామాటి శ్రీనివాస్ మద్యం మత్తులో చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు.
విద్యార్థులను చీపురితో కొట్టాడు. నిత్యం మద్యం మత్తులో వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చే కామాటి శ్రీనివాస్ విద్యార్థులు రాత్రి పడుకునే సమయంలో చీపురుతో కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తెలిపారు. తాళ్ళధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన
కామాటి శ్రీనివాస్, గత నాలుగు నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలుమార్లు హాస్టల్ వార్డెన్ మధుసూదన్ మందలించిన శ్రీనివాస్ లో మార్పు రాలేదని తెలిపారు. చివరకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు పిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సీరియస్ గా స్పందిస్తు విచారణ జరిపి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు సమీపంలో ప్రధాన రహదారిపై కోరుకంటి శిరీష శ్రీధర్ రావు దంపతులు వినూత్న ఆలోచనతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఇసుకతో అద్భుతమైన శిల్పాల రూపంలో తీర్చిదిద్దుతూ, కేవలం 30 సెకన్లలో చూసే విధంగా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రతి శిల్పం ఒక కథను ప్రతిబింబిస్తూ, భక్తి, సంస్కృతి, కళాత్మకతను కలగలిపి సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈనెల 27 నుండి మే 15 వరకు ఈ ఇసుక విగ్రహాల ప్రదర్శన కొనసాగనుండగా, ఈ అరుదైన కళాఖండాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతున్నారని, సనాతన ధర్మం, రామాయణ ఘట్టాలను తక్కువ సమయంలో అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఇసుక శిల్పాలను రూపొందించినట్లు శిరీష తెలిపారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ తక్కువ సమయంలో రామాయణాన్ని అర్థం చేసుకునేలా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్‌లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం1
- వరంగల్ జిల్లా:సోషల్ మీడియా వచ్చిన తరువాత మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో సోమవారం మాట్లాడిన ఆయన, ఇటీవల రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో పాల్గొన్న తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెరుగుతున్నాయని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో డీసీపీ, సీపీగా పనిచేసిన అనుభవంతో చట్టం ప్రకారం వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టానని, ప్రజా సమస్యల పరిష్కారం మరియు వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.1
- Post by Tagore1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 29 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ నేతలు దేవి రవీందర్, బెండ మధు మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, చేర్యాల, జనగామ ప్రాంతాల్లో 15 నుంచి 17 గంటల విద్యుత్ ఇస్తుంటే.. గజ్వేల్‌లో మాత్రం 14 గంటలకే పరిమితం చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఎండాకాలంలో సాగుకు విద్యుత్, నీరు అత్యవసరమని, వెంటనే 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.2
- 30/03/2026 కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్.. రంగాయ చెరువు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు.. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే పెండింగ్ లో పనులు.. నేల రోజుల్లో కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు.. రామప్ప - రంగాయి చెరువు - పాకాల ప్రాజెక్ట్ లో భాగమైన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు.. రుద్రగూడెం రంగయ్య చెరువు కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో గోదావరి జలాలను నర్సంపేట నియోజక వర్గానికి తరలించే క్రమంలో 3.5 TMC నీళ్లను రంగాయి చెరువుకు తరలించే పనులు విజయవంతంగా పూర్తి చేసాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై 2ఏండ్లు పూర్తి ఐనా నేటికీ కాలువల నిర్మాణం పనులు పూర్తి చేయలేదు.. గోదావరి జిల్లాలు రంగాయ చెరువు లో అందుబాటులో ఉన్న కాలువల పనులు పూర్తిగా గత రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది.. సుమారు 87% పనులు పూర్తయిన మిగిలిన పనులను పూర్తి చేయకుండా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. నర్సంపేట రైతాంగం బంగారు పంటలు పండించాలని గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకురావడం జరిగింది. తలాపుల నీళ్లు ఉన్నా చిన్న చిన్న పనులు పూర్తి చేయగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. బిఆర్ఎస్ హయంలో పూర్తయిన ప్రాజెక్టును అక్కడక్కడ మిగిలిపోయిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది.. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల 68 గ్రామాల రైతుల పంటలకు సాగు నీటిని అందించే రంగయ్య చెరువు ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంగయ్య చెరువు ప్రాజెక్టు పై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేయలేదు 32 వేల 500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నేను శాసన సభ్యుడిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరిగింది రీ డిజైన్ చేసి ఒక్క ఎకరం ముంపు లేకుండా, ప్రతి చెరువు కుంట ప్రత్యేక సర్వే నిర్వహించి , అనేక అనుమతులు తీసుకువచ్చి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లింక్ మెయిన్ కెనాల్, ద్వారా 32వేల 500 ఎకరాల పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గా రూపొందించాము 87శాతం పనులను పూర్తి చేసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచిన ఒక్క శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు... ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు, కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు, నిధులు మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి, ఆ నిల్వ ఉన్న నిధులు ఖర్చుపెట్టండి ... దొంతి మాధవరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడూ ఊర్లు ముంచుదామ, వేల ఎకరాల పంటను ముంచుదామా, అమాయకు గిరిజన భూములలో ప్రాజెక్టు కట్టి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఆశ మాత్రమే ఉన్నదీ కాలువల పనుల నిర్మాణం గురించి,మరమ్మతుల గురించి ఎన్నడు ఆలోచించలేదు నిర్మాణమైన కాలువల నుండి గోదావరి జలాలు ప్రతి ఎకరానికి పోయే విధానంగా పంట కాలువలు, చిన్న కాలువలు, తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు నిల్వ ఉన్నాయి 40 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలి, అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలి , ఎండాకాలం సీజన్ పూర్తయ్యే వరకు పంట కాలువలను పూర్తి చేసి రెండో పంటకు నిరందించాలి, నేషనల్ హైవే 365 కి సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది 365 నేషనల్ హైవే కాబట్టి డిల్లీ నుంచి అనుమతులు రావాలని ఆనాడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడూ ఢిల్లీకి అనుమతులు కొరకు పంపివ్వడం జరిగింది... దానికి సంబంధించి ఒక్కనాడు అధికార పార్టీ వాళ్ళు సమీక్షించే పరిస్థితి లేదు , ఇప్పటికీ కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదూ, అనుమతులు తెచ్చే పరిస్థితి లేదు, రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నాపైన చేయండి కానీ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుపైనా కాదు రంగయ్య చెరువు ప్రాజెక్టు మరియు కాలువనిర్మానం పైన గత రెండేళ్లుగా ఒక సమీక్ష కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.. కాలువలను నిర్మాణం మరియు మరమ్మత్తుల కోసం 40 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ పనులు చేయకుండా ఎమ్మెల్యే రైతులను మోసం చేస్తున్నారు.. నిధులు ఉన్నప్పటికీ పనులు చేయించే నాయకత్వం లేకపోవడం నర్సంపేట రైతుల పాలిట శాపంగా మారింది కాలువలు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా నాడు రైతులకు మార్కెట్ ధరను మించి పరిహారం ఇప్పించడం జరిగింది. నేడు మిగిలిన కాలువలకు మార్కెట్ ధరను మించి రైతులకు చెల్లించాల్సిందే.. ఆ బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్కు నెలరోజుల డెడ్లైన్ విధిస్తున్నం.. లేనిపక్షంలో రైతుల తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరెడ్డి చవి చూడాల్సి ఉంటుంది.. తక్షణమే కాలువల పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలి.. ఈ నిరసన ఆరంభం మాత్రమే.. తదుపరి నర్సంపేట నియోజకవర్గం కలెక్టరేట్ ను ముట్టడిస్తాం.. నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పనులను ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.. నీళ్లు ఉన్న పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్ధత వల్ల వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండుతున్నాయి.. నెల రోజుల్లో పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీలు మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు,వైస్ ఎంపీపీ, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్త రూపంలో3
- జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో కూరగాయలు కోసే పనిలో ఉన్న కామాటి శ్రీనివాస్ మద్యం మత్తులో చిన్నారులపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్థులను చీపురితో కొట్టాడు. నిత్యం మద్యం మత్తులో వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చే కామాటి శ్రీనివాస్ విద్యార్థులు రాత్రి పడుకునే సమయంలో చీపురుతో కొడుతున్న విజువల్స్ రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తెలిపారు. తాళ్ళధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన కామాటి శ్రీనివాస్, గత నాలుగు నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలుమార్లు హాస్టల్ వార్డెన్ మధుసూదన్ మందలించిన శ్రీనివాస్ లో మార్పు రాలేదని తెలిపారు. చివరకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు పిర్యాదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సీరియస్ గా స్పందిస్తు విచారణ జరిపి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.3